Dhurandhar 2 OTT: బాక్సాఫీస్ సెన్సేషనల్ మూవీ ధురంధర్ 2 మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న ఇండియన్ సినిమాల్లో ధురంధర్ 2 మూడో ప్లేస్ కు చేరుకుంది. పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసింది. ఈ నేపథ్యంలో ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది.
ధురంధర్ 2 రికార్డు

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 మరో రికార్డు నమోదు చేసింది. బాక్సాఫీస్ మోత మోగిస్తున్న ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా నిలిచింది. మార్చి 19న రిలీజైన ధురంధర్ 2 ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.1749 కోట్ల కలెక్షన్లు సొంతం చేసుకుందని సక్నిల్క్ వెల్లడించింది.
పుష్ప 2 కలెక్షన్లు
అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 రికార్డును ధురంధర్ 2 బ్రేక్ చేసింది. పుష్ప 2 ఏమో ప్రపంచవ్యాప్తంగా రూ. 1742 కోట్ల వసూళ్లు దక్కించుకుంది. ఇప్పుడు ధురంధర్ 2 ఆ కలెక్షన్లను దాటేసి మూడో ప్లేస్ కు చేరుకుంది. టాప్-2లో దంగల్ (రూ.2,090 కోట్లు), బాహుబలి 2 (రూ.1788 కోట్లు) ఉన్నాయి.
ధురంధర్ 2 ఓటీటీ
ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ కోసం సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ డీల్ ను జియోహాట్‌స్టార్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏకంగా రూ.150 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ధురంధర్ ఫస్ట్ పార్ట్ కంటే ఇది డబుల్ కావడం విశేషం.
స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సాధారణంగా బాలీవుడ్ సినిమాలు ఎనిమిది వారాల థియేట్రికల్ విండో తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. ఈ లెక్కన చూసుకుంటే ధురంధర్ 2 మూవీ మే 14 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి.
{{/usCountry}}సాధారణంగా బాలీవుడ్ సినిమాలు ఎనిమిది వారాల థియేట్రికల్ విండో తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. ఈ లెక్కన చూసుకుంటే ధురంధర్ 2 మూవీ మే 14 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి.
{{/usCountry}}కానీ ధురంధర్ 2 రిలీజై నెల రోజులు అవుతున్నా ఈ మూవీకి ఇంకా ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని మరో వర్షన్ కూడా వినిపిస్తోంది. ఈ మూవీ జూన్ 4న ఓటీటీ డెబ్యూ చేస్తుందనే ప్రచారమూ సాగుతోంది.
మరి రెగ్యులర్ విండో ప్రకారం ధురంధర్ 2 ఎనిమిది వారాలకే ఓటీటీలోకి వస్తుందా? లేదా డిజిటల్ స్ట్రీమింగ్ లేట్ అవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. మేకర్స్ దీనిపై ఇంకా అఫీషియల్ సమాచారం ఇవ్వలేదు.