Dhurandhar 2 OTT: బాక్సాఫీస్ ను షేక్ చేసి, రికార్డుల మోత మోగించిన ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ కోసం సినీ లవర్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందా? అని ఆత్రుతతో ఉన్నారు. కానీ ఇండియన్ ఓటీటీ ఆడియన్స్ కు షాక్ తప్పలేదు. ఈ మూవీ ఇండియాలో ఇంకా ఓటీటీ రిలీజ్ కాలేదు.
ధురంధర్ 2 ఓటీటీ

ధురంధర్ 2 ఓటీటీ విషయంలో ఇండియన్ మూవీ లవర్స్ కు షాక్ తగిలింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇండియాలో ఓటీటీ రిలీజ్ కాలేదు. అదే సమయంలో విదేశాల్లో మాత్రం స్ట్రీమింగ్ షురూ అయింది. ఇతర దేశాల్లో ఓటీటీలోకి వచ్చేసింది ధురంధర్ 2.
రెండు ఓటీటీలు
ధురంధర్ 2 ఓటీటీ రైట్స్ ను రెండు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ దక్కించుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్ ఈ హక్కులను సొంతం చేసుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఏమో ఓవర్సీస్ ఓటీటీ రైట్స్ ను ఖాతాలో వేసుకుంది. అంటే ఇండియా మినహా ఇతర దేశాల్లో ధురంధర్ 2ను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఇప్పటికే వేరే దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో ధురంధర్ 2 రిలీజ్ అయింది.
ఇండియాలో నో రిలీజ్
ఇక జియోహాట్‌స్టార్ విషయానికి వస్తే.. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏమో ధురంధర్ 2 మూవీ ఇండియా ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేసింది. ఇండియాలో మూవీని స్ట్రీమింగ్ చేసే హక్కులను సంపాదించింది. కానీ ఇంకా ధురంధర్ 2 రిలీజ్ కు సంబంధించి జియోహాట్‌స్టార్ నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇండియాలో ఇంకా ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ కాలేదు.
అదే కారణమా?
విదేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ధురంధర్ 2 ఇండియాలో జియోహాట్స్టార్లో రిలీజ్ కాకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటేమో ఐపీఎల్ 2026. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ ను జియోహాట్‌స్టార్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ధురంధర్ 2ను ఓటీటీలో రిలీజ్ చేస్తే ఐపీఎల్ వ్యూయర్ షిప్ పై ప్రభావం పడుతుందని జియోహాట్‌స్టార్ భావించినట్లు తెలుస్తోంది.
{{/usCountry}}విదేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ధురంధర్ 2 ఇండియాలో జియోహాట్స్టార్లో రిలీజ్ కాకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటేమో ఐపీఎల్ 2026. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ ను జియోహాట్‌స్టార్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ధురంధర్ 2ను ఓటీటీలో రిలీజ్ చేస్తే ఐపీఎల్ వ్యూయర్ షిప్ పై ప్రభావం పడుతుందని జియోహాట్‌స్టార్ భావించినట్లు తెలుస్తోంది.
{{/usCountry}}మరోవైపు ఇప్పటికీ థియేటర్లలో ధురంధర్ 2 షోలు వేస్తున్నారు. మార్చి 19, 2026న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఇంకా కొన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఇండియాలో లాంగ్ థియేటర్ రన్ కోసమని ఇప్పుడే ఓటీటీ రిలీజ్ చేయలేదని అంటున్నారు. మరి ఇండియాలో ఓటీటీ స్ట్రీమింగ్ పై అప్ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.