Dhurandhar 2: టెన్షన్స్ అలాగే ఉన్నాయి.. కానీ మా మూవీ వస్తుంది కదా.. టాక్సిక్ వాయిదాపై ధురంధర్ నటుడి సెటైర్

Dhurandhar 2: ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ వార్ కారణంగా మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ నెలకొంది. దీంతో టాక్సిక్ మూవీ రిలీజ్ ను వాయిదా వేశారు. అయితే అదే రోజు రిలీజ్ కానున్న ధురంధర్ 2 సినిమా నటుడు టాక్సిక్ వాయిదాపై సెటైర్ వేశాడు. 

Published on: Mar 12, 2026, 12:55:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురంధర్ 2' రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది. మరోవైపు అదే రోజు విడుదల కావాల్సిన టాక్సిక్ మూవీ పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. దీంతో టాక్సిక్ పై ధురంధర్ నటుడు రాకేష్ బేడీ వేసిన సెటైర్ వైరల్ గా మారింది.

టాక్సిక్ పై ధురంధర్ నటుడి సెటైర్
టాక్సిక్ పై ధురంధర్ నటుడి సెటైర్

ధురంధర్ నటుడి సెటైర్

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో టాక్సిక్ మూవీ రిలీజ్ ను మార్చి 19 నుంచి జూన్ 4కు పోస్ట్ పోన్ చేశారు. ధురంధర్ 2 మాత్రం మార్చి 19నే రిలీజ్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టాక్సిక్ పై ధురంధర్ నటుడు రాకేష్ బేడీ సెటైర్ వేశాడు.

మేమైతే వస్తున్నాం

ధురంధర్ సినిమాలో జమీల్ జమాలీ పాత్రలో నటించిన నటుడు రాకేష్ బేడీ.. టాక్సిక్ వాయిదాపై స్పందించాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. "టెన్షన్ తో హమారే లియే భీ హై మిడిల్ ఈస్ట్ మెయిన్, పర్ హమ్ తో ఆ రహే హై (మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ అలాగే ఉంది. మాకు కూడా టెన్షన్ గానే ఉంది. కానీ మేం వస్తున్నాం. మూవీ రిలీజ్ అవుతుంది)’’ అని రాకేష్ బేడీ అన్నాడు.

ఎగతాళి చేసినట్లు

ధురంధర్ 2తో పోటీ పడటం ఎందుకని టాక్సిక్ మూవీ రిలీజ్ వాయిదా వేశారనే అర్థం వచ్చేలా రాకేష్ బేడీ కౌంటర్ ఉందనే కామెంట్లు వస్తున్నాయి. ఇందుకు యుద్ధం పేరు చెప్పారనే అర్థం వస్తుందని అంటున్నారు. సినిమా మీద నమ్మకంతో, దేనికైనా తాము రెడీగా ఉన్నామని ధురంధర్ 2ను షెడ్యూల్ ప్రకారమే టీమ్ రిలీజ్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ధురంధర్ గురించి..

ధురంధర్ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 5, 2025న రిలీజ్ అయింది. అయితే ఈ మూవీని పాకిస్థాన్ లో మాత్రమే కాకుండా గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిషేధించారు. కానీ ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ లోకి ఈ మూవీ వచ్చినప్పుడు పాకిస్థాన్ లో ట్రెండింగ్ నంబర్ వన్ గా నిలిచింది. ఇప్పుడు ధురంధర్ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ధురంధర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో రణ్ వీర్ సింగ్, ఆర్. మాధవన్, సారా అర్జున్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీ, డానిష్ పండోర్ తదితరులు నటించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More