థియేటర్లలో 50 రోజులు.. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఏ మూవీ అయినా ఈ మైల్ స్టోన్ చేరుకుంటే సంబరాలు చేసేవాళ్లు. కానీ ఈ ఓటీటీ కాలంలో ఆ సందడి, సెలబ్రేషన్స్ లేకుండా పోయాయి. అలా థియేటర్లలోకి వచ్చిన మూవీ, ఇలా ఓటీటీలోకి రావడం కామనైపోయింది. అలాంటిది ఈ రోజుల్లోనూ 50 రోజుల పాటు థియేటర్లలో రన్ అవడం మామూలు విషయం కాదు. ఈ అరుదైన రికార్డును ధురంధర్ సాధించింది.
ధురంధర్ 50 డేస్

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. థియేటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా నిలిచింది. ఓటీటీ జమానాలో ఈ ఫీట్ చిన్నదేం కాదు. డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది ధురంధర్. దీనికి ఆదిత్య ధర్ డైరెక్టర్. సారా అర్జున్ హీరోయిన్.
ధురంధర్ కలెక్షన్లు
బాక్సాఫీస్ దగ్గర ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది ధురంధర్. ఈ స్పై థ్రిల్లర్ తన ఏడో వారంలోనూ సినిమా హాళ్లలో జోరు కొనసాగిస్తోంది. 50వ రోజు (జనవరి 23) ధురంధర్ మూవీ ఇండియాలో రూ.0.36 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ మూవీ 50 రోజుల మొత్తం ఇండియా నెట్ వసూళ్లు రూ.830.86 కోట్లకు చేరుకున్నాయి.
50వ రోజు ఆక్యుపెన్సీ గణాంకాలు ధురంధర్ సినిమా పరిమితమైన డిమాండ్‌ను చూపుతున్నాయి. ఉదయం షోలు సగటున 8.46%, మధ్యాహ్నం షోలు 21.36% ఆక్యుపెన్సీ నమోదు చేశాయి.
వరల్డ్ వైడ్ వసూళ్లు
ధురంధర్ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్లలో సత్తాచాటింది. ఈ సినిమా 7వ వారం మొత్తం రూ. 13.9 కోట్ల వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే కలెక్షన్లు రూ.1,289 కోట్లుగా ఉన్నాయి. ఇప్పటికే ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాగా ధురంధర్ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. పుష్ప 2 హిందీ వర్షన్ రికార్డును ధురంధర్ బ్రేక్ చేసింది.
మూడు వారాల్లోనే
{{/usCountry}}ధురంధర్ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్లలో సత్తాచాటింది. ఈ సినిమా 7వ వారం మొత్తం రూ. 13.9 కోట్ల వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే కలెక్షన్లు రూ.1,289 కోట్లుగా ఉన్నాయి. ఇప్పటికే ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాగా ధురంధర్ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. పుష్ప 2 హిందీ వర్షన్ రికార్డును ధురంధర్ బ్రేక్ చేసింది.
మూడు వారాల్లోనే
{{/usCountry}}ఇక థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసింది ధురంధర్. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. ఇప్పటివరకూ అన్ని ప్రాంతాలలో కలిపి సుమారు 3.5 కోట్ల మంది ధురంధర్ సినిమాను థియేటర్లలో చూడటం విశేషం. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్.మాధవన్ తదితరులు నటించారు.
సీక్వెల్ రిలీజ్ డేట్
ధురంధర్ ఇంతటి ఘన విజయం సాధించడంతో ధురంధర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ధురంధర్ 2 మార్చి 19, 2026న రిలీజ్ కానుంది. మరి ఈ సీక్వెల్ ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.