Dhurandhar OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. తెలుగులోనూ

2025లో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రణ్‌వీర్ సింగ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘ధురంధర్’ ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ స్పై థ్రిల్లర్.. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Published on: Jan 21, 2026, 16:22:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) డిజిటల్ ఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో రికార్డుల మోత మోగించి, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.

Dhurandhar OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. తెలుగులోనూ
Dhurandhar OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. తెలుగులోనూ

ధురంధర్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

ధురంధర్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకుంది. జనవరి 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. సీక్వెల్ ను పాన్ ఇండియా స్థాయిలో తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ మూవీని ఓటీటీలో ప్రాంతీయ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనుండటం విశేషం.

బాక్సాఫీస్ రికార్డులు, ఓటీటీ డీల్..

రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ మూవీ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ‘ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్’గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1,283 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఇక హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. ఈ క్రమంలో అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసింది. అంతేకాదు ఓటీటీ డీల్ కూడా భారీగానే ఉంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాతో పాటు దీని సీక్వెల్ హక్కులను కలిపి సుమారు రూ. 130 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ధురంధర్ మూవీ స్టోరీ ఇదీ

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్‌ ధురంధర్. రణ్‌వీర్ సింగ్ ‘రా’ (RAW) ఏజెంట్ జస్కిరత్ సింగ్ రంగీగా నటించాడు. పాకిస్థాన్‌లోని ప్రమాదకరమైన లియారీ ప్రాంతంలో హంజా అలీ మజారీ అనే మారుపేరుతో అతను చేసే ఆపరేషన్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇందులో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

ఈ ధురందర్ సినిమాకు త్వరలో సీక్వెల్ కూడా రానుంది. ‘ధురంధర్ 2: ది రివెంజ్’ (Dhurandhar 2) మార్చి 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఆ సినిమా రిలీజ్‌కు ముందే మొదటి భాగాన్ని ఓటీటీలో చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కింది. థియేటర్లలో ఈ మూవీని మిస్ అయి ఉంటే ఇప్పుడు తెలుగులోనూ నెట్‌ఫ్లిక్స్ లో రాబోతోంది. చూసి ఎంజాయ్ చేసేయండి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More