బాలీవుడ్ వెర్సటైల్ నటుడు, ధురంధర్ విలన్ అక్షయ్ ఖన్నా ప్రస్తుతం తన కెరీర్‌లో గోల్డెన్ పీరియడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ధురంధర్’ చిత్రంలో రెహ్మాన్ డెకాయిట్‌గా అక్షయ్ ఖన్నా పండించిన నెగెటివ్ షేడ్స్ ప్రేక్షకులను మెప్పించాయి.

ఈ క్రమంలో మార్చి 28న అక్షయ్ పుట్టినరోజును పురస్కరించుకుని, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. తమ కాంబినేషన్‌లో వస్తున్న ‘మహాకాళి’ (Mahakali) చిత్రం నుంచి అక్షయ్ ఖన్నా లుక్‌ను తాజాగా రివీల్ చేశారు.
రాక్షస గురువుగా అక్షయ్ ఖన్నా!
ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియా వేదికగా అక్షయ్ ఖన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ చిత్రంలో ఆయన ‘శుక్రాచార్యుడి’ పాత్రలో కనిపిస్తారని వెల్లడించారు. "నిజమైన ప్రతిభకు ఆర్భాటాలు అవసరం లేదని నిరూపించే నటుడు అక్షయ్ ఖన్నా సర్. మీతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవం. మనం కలిసి సృష్టిస్తున్న ఈ అద్భుతాన్ని ప్రపంచానికి చూపించడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.
రాక్షస గురువు శుక్రాచార్యుడి పాత్ర కోసం అక్షయ్ ఖన్నా పూర్తిగా మేకోవర్ అయ్యారు. పురాణాల్లోని అసుర గురువు శుక్రాచార్యుడి పాత్రకు ఆయన తనదైన శైలిలో గాంభీర్యాన్ని అద్దనున్నారని ఈ లుక్ చూస్తే అర్థమవుతోంది.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)
పూజా కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహాకాళి’ చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా వస్తోంది. ‘హను-మాన్’ విజయంతో మొదలైన ఈ యూనివర్స్‌లో ‘జై హనుమాన్’, ‘అధీర’ వంటి చిత్రాలు కూడా రాబోతున్నాయి.
‘మహాకాళి’ చిత్రంతో అక్షయ్ ఖన్నా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో భూమి శెట్టి లేడీ సూపర్ హీరోగా నటిస్తోంది. పురాణ గాథలకు ఆధునిక సూపర్ హీరో టచ్ ఇచ్చి రూపొందిస్తున్న ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు
{{/usCountry}}‘మహాకాళి’ చిత్రంతో అక్షయ్ ఖన్నా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో భూమి శెట్టి లేడీ సూపర్ హీరోగా నటిస్తోంది. పురాణ గాథలకు ఆధునిక సూపర్ హీరో టచ్ ఇచ్చి రూపొందిస్తున్న ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు
{{/usCountry}}ఇటీవల కల్యాణి ప్రియదర్శన్ నటించిన ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ వంటి లేడీ సూపర్ హీరో చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘మహాకాళి’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, అక్షయ్ ఖన్నా కేవలం తెలుగులోనే కాకుండా హిందీలోనూ బిజీగా ఉన్నారు.
ప్రధాన విలన్‌గా
సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వంలో వస్తున్న ‘ఇక్కా’ (Ikka) సినిమాలో సన్నీ డియోల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అక్షయ్ ఖన్నా. ఇందులో అక్షయ్ ఖన్నా ప్రధాన విలన్‌గా నటిస్తుండగా.. దియా మీర్జా, తిలోత్తమ షోమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.