...
...
Next Story

అఖండ 2 సినిమా కాదు భారతదేశ ఆత్మ- మైనస్ 12 డిగ్రీస్‌లో షూట్, శివుడే దారి చూపించాడు.. డైరెక్టర్ బోయపాటి శ్రీను కామెంట్స్

డైరెక్టర్ బోయపాటి శ్రీను-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా అఖండ 2. ఆది పినిశెట్టి పవర్‌ఫుల్ రోల్ చేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ది తాండవం సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన అఖండ 2 ది తాండవం సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో బోయపాటి శ్రీను ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

Published on: Nov 15, 2025, 13:32:42 IST
Advertisement

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన నాలుగో సినిమా అఖండ 2. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. అలాగే, సంయుక్త మీనన్ ముఖ్య పాత్ర పోషిస్తుంటే.. హీరో ఆది పినిశెట్టి ఓ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నాడు.

అఖండ 2 ది తాండవం సాంగ్ రిలీజ్

అఖండ 2 సినిమా కాదు భారతదేశ ఆత్మ- మైనస్ 12 డిగ్రీస్‌లో షూట్, శివుడే దారి చూపించాడు.. డైరెక్టర్ బోయపాటి శ్రీను కామెంట్స్
అఖండ 2 సినిమా కాదు భారతదేశ ఆత్మ- మైనస్ 12 డిగ్రీస్‌లో షూట్, శివుడే దారి చూపించాడు.. డైరెక్టర్ బోయపాటి శ్రీను కామెంట్స్

బాలీవుడ్ నటి హర్షాలి మల్హోత్రా కీలక పాత్ర చేస్తోంది. ఇక తాజాగా అఖండ 2 సినిమా నుంచి ది తాండవం పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన అఖండ 2 ది తాండవం సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.

భారతదేశ ధర్మం, ఆత్మ

డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఇది ఒక సినిమా కాదు భారతదేశ ఆత్మ. భారతదేశ ధర్మం. ఈ సినిమా చూసిన తర్వాత మీరు అదే ఫీల్ అవుతారు. ఫ్యామిలీ అందరు కలిసి వెళ్లి ఆనందంగా చూసే సినిమా ఇది. మన దేశం మన వేదం మన కల్చర్ మన ఇవన్నీ ఈ సినిమాలో మీరు చూస్తారు" అని అన్నారు.

నాలుగు సినిమాల జర్నీ

"డిసెంబర్ 5న మీ ముందుకు అఖండ 2 వస్తుంది. తప్పకుండా అందరూ చూడాలని కోరుకుంటున్నాను. బాలయ్య గారితో నాలుగు సినిమాల జర్నీ. ప్రతి సినిమా ట్రెమండస్ హిట్. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తుందో ఎవరూ చెప్పలేరు. మా నిర్మాతలకి థాంక్యూ. కైలాష్ కేర్ గారు అద్భుతంగా పాడారు. తమన్ గారికి థాంక్ యూ" అని బోయపాటి శ్రీను చెప్పారు.

శివుడే దారి చూపించాడు

నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ఇది వండర్‌ఫుల్ జర్నీ. ముంబైలో మా పాన్ ఇండియా ప్రమోషన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా హీరో బాలకృష్ణ గారికి డైరెక్టర్ బోయపాటి గారికి థాంక్యూ. అఖండ 2 పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాబోతోంది" అని జోస్యం చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks