నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ బోయపాటి మాట్లాడుతూ.. "ఈ వేడుకల్లో పాల్గొన్న పెద్ద వాళ్లందరకీ, సోదర సమానులైన నందమూరి అభిమానులకు సినీ అభిమానులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు" అని అన్నారు.
వారి కారణంగానే షూటింగ్

"తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి కారణంగానే సినిమా అద్భుతంగా షూటింగ్ చేసుకోగలిగాం. ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటులకు కృతజ్ఞతలు. బాలయ్య గారే మా ఆస్తి బాలయ్య గారు మా పవర్ ఆయనే మా ధైర్యం. సంయుక్త, ఆది పినిశెట్టి, మురళీమోహన్ గారు హర్షాలి అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు" అని బోయపాటి చెప్పారు.
సెన్సార్ సభ్యులు మెచ్చుకున్నారు
"ఇప్పుడే సెన్సార్ నుంచి వచ్చాను. సినిమాకి యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సభ్యులు చాలా గౌరవంగా అభినందించారు. ఈ సినిమా తర్వాత మీరు గౌరవమైన స్థానంలో ఉంటారని చెప్పారు. చాలా ఆనందంగా అనిపించింది" అని బోయపాటి శ్రీను తెలిపారు.
దేవుడు ఒప్పుకుంటాడా
"రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ప్రపంచ దేశాలకు మార్గదర్శకత్వం అయినవి. ఇలాంటి మార్గదర్శకత్వం చూపించిన దేశాన్ని ముట్టుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా.." అని ప్రశ్నించారు బోయపాటి శ్రీను.
మూడు రోజుల్లో
"పెహెల్గామ్ దాడిలో మన ఆడబిడ్డ నుదుటిన ఉన్న సింధూరాన్ని ముట్టుకుంటే ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి భారతదేశంతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో మన సైనికులు చూపించారు. తొమ్మిది మిషాల్లో టార్గెట్ రీచ్ అయ్యి మూడు రోజుల్లో మోకాళ్ల మీద కూర్చోబెట్టారు. అది మన సైన్యం. మనందరం అభినందించాలి. క్లాప్స్ కొట్టాలి" అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు.
కులాలు, మతాలు లేవు
"ఈ పరిశ్రమ ఒక్కరితో కాదు అందరితో కూడుకున్నది. ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు. ఉన్నదంతా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి. వాళ్లకి మంచి చెప్పడానికి ప్రయత్నించాలి. అన్ని సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించాలి పరిశ్రమ బావుండాలి" అని బోయపాటి శ్రీను పేర్కొన్నారు.
వరల్డ్ వైడ్ ప్రేక్షకులు
{{/usCountry}}"ఈ పరిశ్రమ ఒక్కరితో కాదు అందరితో కూడుకున్నది. ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు. ఉన్నదంతా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి. వాళ్లకి మంచి చెప్పడానికి ప్రయత్నించాలి. అన్ని సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించాలి పరిశ్రమ బావుండాలి" అని బోయపాటి శ్రీను పేర్కొన్నారు.
వరల్డ్ వైడ్ ప్రేక్షకులు
{{/usCountry}}"ప్రతి సినిమాకి మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ.. అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్ ప్రేక్షకులు ఈ సినిమాని ఆనందంగా చూడాలని కోరుకుంటున్నాను" అని అఖండ 2 తాండవం డైరెక్టర్ బోయపాటి శ్రీను కోరారు.
అఖండ 2 నటీనటులు
ఇదిలా ఉంటే, బ్లాక్ బస్టర్ హిట్ అఖండ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2 తాండవం వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విలన్‌గా హీరో ఆది పినిశెట్టి యాక్ట్ చేశాడు. బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా మరో బ్యూటి పూర్ణ కీలక పాత్ర పోషించారు.