...
...
Next Story

అనిల్ రావిపూడి సినిమాల 50కిపైగా నటీనటులు ఉన్నారు, నచ్చకుంటే డబ్బు రిటర్న్ ఇస్తాం.. పాంచాలి పంచభర్తృక దర్శకుడు కామెంట్స్

Panchali Panchabhartruka Pre Release Event: సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్, రోల్ రైడా, సరీ ఫర్, రాజ్ పవన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ పాంచాలి పంచభర్తృక. పాంచాలి పంచభర్తృక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో దర్శకుడు గంగ సప్తశిఖర ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Aug 10, 2026, 19:21:20 IST
Advertisement

Panchali Panchabhartruka Pre Release Event: నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘పాంచాలి పంచభర్తృక’. ఈ చిత్రంలో సరీ ఫర్, రోల్ రైడా, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటించారు.

కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా పాంచాలి పంచభర్తృక

అనిల్ రావిపూడి సినిమాల 50కిపైగా నటీనటులు ఉన్నారు, నచ్చకుంటే డబ్బు రిటర్న్ ఇస్తాం.. పాంచాలి పంచభర్తృక దర్శకుడు కామెంట్స్
అనిల్ రావిపూడి సినిమాల 50కిపైగా నటీనటులు ఉన్నారు, నచ్చకుంటే డబ్బు రిటర్న్ ఇస్తాం.. పాంచాలి పంచభర్తృక దర్శకుడు కామెంట్స్

ఫ్యామిలీ డ్రామాతో కూడిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా పాంచాలి పంచభర్తృక చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు గంగ సప్తశిఖర. ఈ చిత్రాన్ని రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్‌, ఓం సాయిరాం ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్‌ఏ), రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం నిర్మించారు.

పాంచాలి పంచభర్తృక ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈ నెల 14న ‘పాంచాలి పంచభర్తృక’ సినిమాను వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగస్ట్ 9) సాయంత్రం పాంచాలి పంచభర్తృక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ మహేశ్ నారాయణ మాట్లాడుతూ.. "ఈ మూవీకి మ్యూజిక్ చేసేందుకు డైరెక్టర్ గంగ సప్తశిఖర చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. తక్కువ టైమ్ లోనే సాంగ్స్ అన్నీ కంపోజ్ చేయగలిగాం. ప్రయోగాత్మకంగా కంపోజ్ చేసిన ఒక కవ్వాలీ సాంగ్ రాజేంద్రప్రసాద్ గారు విని ఇది చాలా బాగుంది మూవీలో పెట్టమని చెప్పారు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘పాంచాలి పంచభర్తృక’ మీ అందరినీ ఆకట్టుకుంటుంది" అని అన్నారు.

సినిమా నచ్చకపోతే డబ్బులు రిటర్న్ ఇస్తాం

"అమెరికాలో కూడా పెద్ద సంఖ్యలో లొకేషన్స్‌లో మా మూవీ రిలీజ్‌కు వస్తోంది. మా ప్రొడ్యూసర్స్ వెంకట్ దుగ్గి రెడ్డి, రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టి వారి, సాయినాథ్ మన్యం ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా నిర్మించారు. రాజ్ పవన్, వెంకట్ దుగ్గిరెడ్డి ఈ చిత్రంలో కీ రోల్స్ చేశారు. వారి నటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది" అని గంగ సప్తశిఖర అన్నారు.

ఈవీవీ, జంద్యాల, అనిల్ రావిపూడి సినిమాలలా

"రాజేంద్రప్రసాద్ గారు ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నన్ను ఇంతలా వాడుకున్న దర్శకుడు నువ్వే అని కితాబు ఇచ్చారు. ఆయన ఈ సినిమాలో పాటలు, ఫైట్స్ చేశారు. ఇటీవల కాలంలో మాలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాలేదని చెప్పగలను" అని డైరెక్టర్ గంగ సప్తశిఖర పేర్కొన్నారు.

"మా చిత్రంలో 50కి పైగా నటీనటులు వివిధ పాత్రల్లో కనిపిస్తారు. ఒక ఈవీవీ, జంధ్యాల, అనిల్ రావిపూడి సినిమాలలా మా మూవీలో ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులు ఉంటారు. ఈ సినిమా మేకింగ్‌లో ప్రతి ఆర్టిస్టు, టెక్నీషియన్ నాకు సపోర్ట్ చేశారు. వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నా" అని దర్శకుడు గంగ సప్తశిఖర వెల్లడింతారు.

మంచి కామెడీ టైమింగ్ ఉంది

"మా డైరెక్టర్ గంగ సప్తశిఖరకు మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఆయన సీన్స్ చెబుతున్నప్పుడే చాలా నవ్వుకున్నాం. నా క్యారెక్టర్‌ను ఆయన ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ నెల 14న థియేటర్స్‌లో ‘పాంచాలి పంచభర్తృక’ సినిమా తప్పకుండా చూడండి" అని యాక్టర్ శ్రీనివాస్ కోరారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe