Panchali Pancha Bhartruka: హీరోగా రాప్ సింగర్ రోల్ రైడా- పాత రాజేంద్రప్రసాద్‌ను గుర్తు చేసేలా పాంచాలి పంచభర్తృక మూవీ!
Panchali Pancha Bhartruka Movie Song Released: తెలుగు రాప్ సింగర్ రోల్ రైడా హీరోగా పరిచయం అవుతున్న ట్రెండీ కామెడీ మూవీ పాంచాలి పంచభర్తృక. నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా నుంచి ఇటీవల సెనోరిటా రాసిస్తా నా ఆస్తి నీ పేరిట సాంగ్ రిలీజ్ అయింది.
Panchali Pancha Bhartruka Movie Song Released: కామెడీ సినిమాలకు ఎప్పటికి ఆదరణ ఉంటుంది . టైటిల్‌లోనే వైవిధ్యం చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కామెడీ కథాంశంతో విడుదలకు సిద్ధమైన సినిమా "పాంచాలి పంచభర్తృక ". ఈ మూవీలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. హీరోగా తెలుగు రాప్ సింగర్ రోల్ రైడా పరిచయం కానున్నాడు.

ట్రెండీ కామెడీతో
రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్ , ఓం సాయిరాం ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న పాంచాలి పంచభర్తృక సినిమాకు రాజ్ పవన్, వెంకట్ దుగ్గిరెడ్డి యూఎస్ఏ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ట్రెండీ కామెడీతో తెరకెక్కించిన ఈ చిత్రానికి గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు.
ప్రమోషన్స్‌లో భాగంగా పాంచాలి పంచ భర్తృక సినిమాలోని "సెనోరిటా రాసిస్తా నా ఆస్తి నీ పేరిట" అనే రెట్రో స్టైల్‌లో ఉన్న పాటను ఇటీవల విడుదల చేసారు. ఈ పాట సోషల్ మీడియాలో ట్రేండింగ్‌గా నిలిచి ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సందర్బంగా సినిమా యూనిట్ మీడియాతో పాంచాలి పంచభర్తృక సినిమా విశేషాలని పంచుకున్నారు.
"ఈ మధ్య కాలంలో నాకు ఇలాంటి పాత్ర రావడం చాలా అరుదు. ఈ సినిమాలో పాటలు, ఫైట్‌లతో మళ్లీ మీ అప్పటి పాత రాజేంద్ర ప్రసాద్‌ని చూస్తారు" అని పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు . హీరో రోల్ రైడా మాట్లాడుతూ.. "సినిమా మొత్తం నవ్వుతూనే చూస్తారు. ప్రేక్షకుడికి మంచి ఫన్ ట్రీట్ ఈ సినిమా " అని తెలిపారు .
నటించడం మాకు సవాలే
"ఆరోగ్యవంతమైన కామెడీ తెలుగు ప్రేక్షకులు చూసి చాల రోజులైంది. ఇంత మంచి కామెడీ రైటింగ్ రాయడం ఒక ఎత్తు అయితే ఆ టైమింగ్‌లో నటించడం మాకు సవాలే " అని మరో హీరోగా నటించిన జెమినీ సురేష్ పేర్కొన్నారు.
"సెటిల్డ్ కామెడీతో మెప్పించడం కొత్త నటుడిగా నాకు ఒక పరీక్ష.నా నటనతో ఆ పరీక్ష పాసయ్యాను అనే చెప్పాలి " అని కొత్తగా పరిచయం అవుతున్న హీరో రాజ్ పవన్ అన్నారు. "నెల్లూరు యాసలో కామెడీ చేయడం అనేది నాకు వ్యక్తిగతంగా సరిపోయే పాత్ర. ఇలాంటి పాత్రలు చేసినప్పుడు మనలో ఉన్న అసలు నటుడు బయటికి వస్తాడు. ప్రేక్షకులని మెప్పిస్తాడు" అని హీరోల్లో ఒకరైన వెంకట్ దుగ్గిరెడ్డి యూఎస్ఏ ప్రస్తావించారు .
"వెంకట్ దుగ్గిరెడ్డి యూఎస్ఏ తో కలిసి ఖర్చుకు వెనకాడకుండా క్వాలిటీలో రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఈ సినిమా నిర్మాణంలో కో ప్రొడ్యూసర్స్‌గా శ్రీకాంత్ శెట్టివారి, సాయినాథ్ మన్యం సహాయ సహకారాలు మరువలేనివి" అని చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాజ్ పవన్ తెలిపారు .
డైలాగ్స్ ట్రెండ్ అవుతాయి
"బాబీ అందించిన బలమైన కథ చెప్పడానికి కామెడీని ఎంచుకున్నాను, రెండు గంటలు ప్రేక్షకులని నవ్వించడం పెద్ద టాస్క్, టీం వర్క్‌తో అది సాధ్యం అయింది . ప్రేక్షకులకి నచ్చే మెచ్చే సినిమా ఈ పాంచాలి పంచభర్తృక. ఈ సినిమాలో డైలాగ్స్ కచ్చితంగా ట్రెండ్ అవుతాయి. ఈ సినిమా నిర్మాణంలో సహకరించిన నిర్మాతలకి కృతజ్ఞతలు " అని మూవీ డైరెక్టర్ గంగ సప్తశిఖర చెప్పారు.
కాగా, పాంచాలి పంచభర్తృక సినిమాలో రాజేంద్రప్రసాద్, జెమినీ సురేష్, రోల్ రైడా, రాజ్ పవన్, వెంకట్ దుగ్గిరెడ్డి యూఎస్ఏ, సారెహ్ ఫార్, పృథ్వీ రాజ్, రూపా లక్ష్మి, శ్రీకాంత్ అయ్యంగార్, రవి రెడ్డి, అనక తదితరులు నటించారు. మహేష్ నారాయణ, బిషేక్, రోల్ రైడా, నవనీత్ చారి సంగీతం అందించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


