Mani Ratnam Praised Keerthy Suresh Bold Movie Dorothy: తమిళ డారెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం 'డోరతి' థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా ఇద్దరు మిత్రులు, ఒక యువతి చుట్టూ తిరిగే సాధారణ ప్రేమకథగా భావించిన ప్రేక్షకులకు.. ఇందులో ఎల్జీబీటీక్యూఐఏ+ (LGBTQIA+) కోణాన్ని స్పృశించడం ఊహించని చర్చకు దారితీసింది.
మణిరత్నం స్పెషల్ వీడియో

స్వదేశంలో ఈ కథాంశంపై కొంత ప్రతికూల స్పందన వ్యక్తమవుతుండగా, కెనడా వేదికగా జరిగిన గ్లోబల్ ప్రిమియర్‌లో అద్భుత టాక్ సొంతం చేసుకుంది డోరతి సినిమా. ఈ క్రమంలో భారతీయ సినిమా దిగ్గజ దర్శకుడు మణిరత్నం డోరతి చిత్రంపై ప్రత్యేకంగా స్పందిస్తూ చిత్ర బృందాన్ని ఆకాశానికెత్తేశారు.
నిర్మాతలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పంచుకున్న ఒక ప్రత్యేక వీడియో సందేశంలో మణిరత్నం మహానటి కీర్తి సురేష్ ‘డోరతి’ చిత్రాన్ని, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌ను విపరీతంగా అభినందించారు.
"నాకు అసూయగా ఉంది!" - మణిరత్నం కామెంట్స్
"ప్రస్తుతం మన వద్ద ఎంతోమంది నూతన ఉత్సాహవంతులైన యువ దర్శకులు ఉన్నారు. వారిందరిలో కార్తీక్ అత్యంత ప్రత్యేకమైన ప్రతిభావంతుడు. అందరికీ నాయకత్వం వహిస్తూ ముందు వరుసలో నిలిచాడు. డోరతి చాలా ప్రత్యేకమైన చిత్రం" అని డైరెక్టర్ మణిరత్నం చెప్పారు.
సినిమా మేకింగ్ శైలిపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ.. "డోరతి టేకింగ్, సినిమా భాష చాలా బాగున్నాయి. కార్తీక్ కెమెరా షాట్స్, టెక్నిక్, విజువల్ లాంగ్వేజ్‌పై ఉన్న పట్టు చూస్తుంటే నాకు అసూయ కలుగుతోంది. ఇళయరాజా అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది" అని మణిరత్నం కొనియాడారు.
ఇళరాజాకు 1540వ చిత్రం
1990ల కాలం నాటి తమిళనాడు నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో మానవ సంబంధాలు, కులం, పౌరుషం, భావోద్వేగాలను అత్యంత సమగ్రంగా ఆవిష్కరించారు. జియో స్టూడియోస్, సిఖ్య ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. ఇది ఆయన కెరీర్లో 1540వ చిత్రం కావడం విశేషం.
స్వదేశంలో మిశ్రమ స్పందన
{{/usCountry}}1990ల కాలం నాటి తమిళనాడు నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో మానవ సంబంధాలు, కులం, పౌరుషం, భావోద్వేగాలను అత్యంత సమగ్రంగా ఆవిష్కరించారు. జియో స్టూడియోస్, సిఖ్య ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. ఇది ఆయన కెరీర్లో 1540వ చిత్రం కావడం విశేషం.
స్వదేశంలో మిశ్రమ స్పందన
{{/usCountry}}ఇటీవలే ప్రతిష్టాత్మక టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (TIFF) ప్రదర్శితమైన ఈ సినిమాకు అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి స్టాండింగ్ ఓవియేషన్ (నిలబడి కరతాళ ధ్వనులు) లభించింది. అయితే భారతీయ థియేటర్లలో విడుదలయ్యాక, సాంప్రదాయ కథనాలను ఆశించిన కొందరు ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ, ధైర్యవంతమైన కథాంశాన్ని ఎంచుకున్నందుకు సినీ విశ్లేషకులు, నెటిజన్లు కార్తీక్ సుబ్బరాజ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
నా మనసుకు దగ్గరైన కథ: కార్తీక్ సుబ్బరాజ్
ఈ చిత్రం గురించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ స్పందిస్తూ.. "డోరతి నా మనసులో చాలా కాలంగా ఉండిపోయిన కథ. నాకంటూ బాగా తెలిసిన ప్రపంచం నుంచి ఈ కథ పుట్టుకొచ్చింది. మైత్రికి ఆశ్రయంగా నిలిచే చోటు, నిశ్శబ్దంలోనూ బతికే ప్రేమ, కఠినమైన పరిస్థితుల్లో సైతం ఉద్భవించే ఆప్యాయతలను ఇందులో చూపించాలనుకున్నాను" అని తెలిపారు.
"కేవలం వినోదం కోసమే కాకుండా గుర్తింపు, కులం, మగతనం, కరుణ వంటి అంశాలను హృదయపూర్వక పాత్రల ద్వారా చర్చించాను. ఈ కథ తమిళనాడు సంస్కృతిలో ముడిపడి ఉన్నప్పటికీ, ఇందులో ఉన్న భావోద్వేగాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి" అని కార్తీక్ సుబ్బరాజ్ వివరించారు.
కొండంత బలం
దశాబ్దాలుగా భారతీయ సినిమాలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నాయకన్, దళపతి, కన్నత్తిల్ ముత్తమిట్టాల్, పొన్నియిన్ సెల్వన్ వంటి కళాఖండాలను అందించిన మణిరత్నం లాంటి దర్శకుడి నుంచి ప్రశంసలు రావడం డోరతి చిత్ర బృందానికి కొండంత బలాన్నిచ్చింది.