Anakapalli Pre Release Event Shiva Nirvana VV Vinayak Speech: భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు.
అనకాపల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్

ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నటుడిగా మారడం విశేషం. అలాగే, ఆయన ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లేని అందించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా నిర్వహించిన అనకాపల్లి అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబర్ 27) నాడు అనకాపల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వీవీ వినాయక్ మాట్లాడుతూ .. "లగడపాటి శ్రీధర్ గారికి మా అందరికంటే సినిమా పిచ్చి ఎక్కువగా ఉంటుంది. ఆయనకి సినిమా పట్ల ఉన్న ప్యాషన్ గురించి నాకు తెలుసు. విక్రమ్ పెద్ద హీరో అయి శ్రీధర్ గారి కోరికని నెరవేర్చుతాడు. తారక్ పొన్నప్ప అందరినీ భయపెట్టేస్తున్నాడు. దర్శక, నిర్మాతలకు మంచి లాభాలు రావాలి. విక్రమ్ పెద్ద హీరో అవుతాడు. ‘అనకాపల్లి’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి" అని కోరారు.
త్రినాథరావు ప్రయోగం చేశారు
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ .. "అనకాపల్లితో నాకు మంచి ఎమోషన్ ఉంది. నేను డిగ్రీ అక్కడే చదివాను. నేను కూడా అనకాపల్లి ఎమోషన్ మీద కథ రాయాలని అనుకున్నా. కానీ త్రినాథ్ గారు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ‘అనకాపల్లి’ చిత్రంతో త్రినాథ్ రావు గారు ప్రయోగం చేశారు. ఇకపై నటుడిగానూ త్రినాథ్ బిజీగా అవుతారని ఆశిస్తున్నాను" అని అన్నారు.
"విక్రమ్ పెద్ద హీరో అవుతాడు. తారక్ అందరినీ భయపెడుతున్నాడు. సంధ్య గారు, ఇంద్రజ గారిని చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. దర్శక, నిర్మాతలకు ఈ చిత్రంతో మంచి విజయం దక్కాలి. అక్టోబర్ 2న ఈ చిత్రం రాబోతోంది. ‘అనకాపల్లి’ సౌండ్ రెండు రాష్ట్రాల్లో గట్టిగా వినిపించాలని కోరుకుంటున్నాను" అని ఆకాంక్షించారు ఇరుముడి దర్శకుడు శివ నిర్వాణ.
ఆయనే హీరో అవుతారనుకున్నా
{{/usCountry}}"విక్రమ్ పెద్ద హీరో అవుతాడు. తారక్ అందరినీ భయపెడుతున్నాడు. సంధ్య గారు, ఇంద్రజ గారిని చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. దర్శక, నిర్మాతలకు ఈ చిత్రంతో మంచి విజయం దక్కాలి. అక్టోబర్ 2న ఈ చిత్రం రాబోతోంది. ‘అనకాపల్లి’ సౌండ్ రెండు రాష్ట్రాల్లో గట్టిగా వినిపించాలని కోరుకుంటున్నాను" అని ఆకాంక్షించారు ఇరుముడి దర్శకుడు శివ నిర్వాణ.
ఆయనే హీరో అవుతారనుకున్నా
{{/usCountry}}నిర్మాత మైత్రి రవి మాట్లాడుతూ .. "లగడపాటి శ్రీధర్ మాకు మంచి మిత్రులు. విక్రమ్ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. తారక్ తన పర్ఫామెన్స్‌తో అందరినీ భయపెడుతున్నాడు. ఈ చిత్రంలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్" అని చెప్పారు.
"శ్రీధర్ అన్న ఇంత త్వరగా హీరోని చేస్తాడని అనుకోలేదు. ముందు ఆయనే హీరో అయి తర్వాత కొడుకుని తీసుకు వస్తారని అనుకున్నాం (నవ్వుతూ). ‘రంగస్థలం’ టైంలో సినిమా చూసి రూటెడ్ కథలు చెప్పాలని పవన్ కల్యాణ్ గారు అన్నారు. ‘అనకాపల్లి’లోనూ అంతే రూటెడ్, డెప్త్ కనిపిస్తోంది" అని ప్రొడ్యూసర్ రవి యెర్నేని తెలిపారు.
ఇరుముడికి కూడా ఇలాగే చేశాం
"మొత్తం అనకాపల్లిలోనే షూట్ చేయడం గొప్ప విషయం. ‘ఇరుముడి’కి కూడా మేం చాలా వరకు కొత్త వారిని తీసుకుని లైవ్ లొకేషన్స్‌లో చేశాం. ‘అనకాపల్లి’కి కూడా పెద్ద ఆదరణ లభించాలని కోరుకుంటున్నాను" అని మైత్రి రవి కోరారు.
కెమెరామెన్ మాయా వి మాట్లాడుతూ .. "‘అనకాపల్లి’ సినిమా అద్భుతంగా వచ్చింది. ఇదంతా కూడా త్రినాథ్ గారి విజన్‌తోనే సాధ్యమైంది. ఖగేష్ ఈ మూవీని ఎంతో రస్టిక్‌గా తెరకెక్కించారు. రూటెడ్, రస్టిక్ విలేజ్ డ్రామాగా సినిమా రాబోతోంది. విక్రమ్‌కి అద్భుతమైన టాలెంట్ ఉంది. తారక్ పొన్నప్ప, సంధ్య, ఇంద్రజ గారు, త్రినాథ్ గారు గొప్పగా నటించారు. అక్టోబర్ 2న మా సినిమా రాబోతోంది. అందరూ చూడండి" అని ఆకాంక్షించారు.