Shree Tej SK About Rajamouli Adopted Daughter Name: తెలుగులో తెరకెక్కిన లేటెస్ట్ సైకలాజికల్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా మయూఖ. ఈ సినిమాతో దర్శకుడిగా మారారు నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల. అది కూడా శ్రీ తేజ్ ఎస్‌కె అనే పేరుతో డైరెక్టర్‌గా మారారు. ఈ సినిమాలో మయూఖగా హీరోయిన్ పాయల్ చెంగప్ప మెయిన్ లీడ్ రోల్ పోషించింది.
మయూఖ సినిమాకు మంచి రెస్పాన్స్

ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్ల నిర్మించారు. ఇటీవలే అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలైన మయూఖ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులకు ఆడియెన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. అయితే, సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ శ్రీతేజ్ మయూఖకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
-మయూఖ అంటే ఆశాకిరణం. మా సినిమా చూస్తూ చివరకు వచ్చేసరికి మీకు మా మూవీ టైటిల్ జస్టిఫై అవుతుంది. నేను రూపొందించిన చివరి షార్ట్ ఫిల్మ్ పేరు మయూఖ. ఆ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేయకుండానే యూఎస్ వెళ్లాను. అప్పుడు రాజమౌళి గారు ఒక పాపను దత్తత తీసుకుని ఆమెకు మయూఖ అనే పేరు పెట్టారు.
చాలా జాగ్రత్తలు తీసుకున్నాం
-నా ప్రొఫెషనల్ కెరీర్‌లో కొనసాగుతున్న టైమ్‌లో ప్రొడ్యూసర్‌కు ఈ మయూఖ కథ చెబితే బాగుంది చేద్దామని అన్నారు. మనం ఎంత మంచి కథ రాసినా దాన్ని విజువల్‌గా, ఆడియో పరంగా అందంగా తెరకెక్కించాలి. అప్పుడే సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాకు విజువల్, సౌండ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. క్వాలిటీగా చేశాం. శిబి మాత్యూ అలెక్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు.
-మన ఆడియెన్స్ కొరియన్, హాలీవుడ్ థ్రిల్లర్స్ చూసి మన వాళ్లు ఇలా ఎందుకు తీయరు అనుకుంటూ ఉంటారు. మనం అలాంటి ప్రాడక్ట్ ఇస్తే తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం. మా సినిమాలో ఎమోషన్ కంటే ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం. సినిమా మేకింగ్‌లో మా ప్రొడ్యూసర్ శశిధర్ నల్ల నుంచి కంప్లీట్ సపోర్ట్ లభించింది.
20 ఏళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్స్
{{/usCountry}}-మన ఆడియెన్స్ కొరియన్, హాలీవుడ్ థ్రిల్లర్స్ చూసి మన వాళ్లు ఇలా ఎందుకు తీయరు అనుకుంటూ ఉంటారు. మనం అలాంటి ప్రాడక్ట్ ఇస్తే తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం. మా సినిమాలో ఎమోషన్ కంటే ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం. సినిమా మేకింగ్‌లో మా ప్రొడ్యూసర్ శశిధర్ నల్ల నుంచి కంప్లీట్ సపోర్ట్ లభించింది.
20 ఏళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్స్
{{/usCountry}}-నేను దాదాపు ఇరవై ఏళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్స్ రూపొందించాను. ఆ తర్వాత యూఎస్ వెళ్లాను అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడెమీలో డైరెక్షన్ కోర్స్ చేశాను. దర్శకత్వం అనేది ఎప్పుడూ నా ప్రయారిటీగా ఉండేది. అయితే సినిమా మేకింగ్‌లో అనుభవం కోసం ప్రొడక్షన్ విషయాలపై కూడా అవగాహన పెంచుకున్నాను.
-తంత్రం, సూత్రవాక్యం అనే సినిమాలను తెలుగులో రిలీజ్ చేశాం. మా సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఇప్పటిదాకా రెండు చిత్రాలు చేశాం. మరికొన్ని ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఇవన్నీ కొత్త టీమ్ తో చేసినవే. మంచి కథలు ఉంటే తప్పకుండా న్యూ టాలెంట్‌కు సపోర్ట్ చేస్తాం.
ఉపేంద్ర, ఆర్జీవీ, పూరి అంటే ఇష్టం
-ఒక సినిమా హిట్ అయితే అదే జోనర్‌లో మూవీస్ వస్తుంటాయి. మనం ఆ జోనర్‌లో మూవీ చేసేలోపు ట్రెండ్ మారిపోతుంది. నేను లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయొచ్చు. కానీ, కొత్తగా ప్రయత్నిద్దామని మయూఖ రూపొందించాను.
-ఉపేంద్ర, రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, జొనాథన్ నోలన్ వంటి దర్శకులను ఇష్టపడతా. నెక్ట్స్ నా దర్శకత్వంలో ఒక ఎమోషనల్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నా. అది క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా అవుతుంది.