జోరుగా రాయుడు గారి తాలూకా ప్రమోషన్స్- మొన్న మాస్ సాంగ్, నేడు రొమాంటిక్ పాట- క్లాస్ డైరెక్టర్‌తో రిలీజ్

రాయుడు గారి తాలూకా మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇదివరకు పక్కా మాస్ బీట్ సాంగ్‌గా జాతరొచ్చింది విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా రొమాంటిక్‌గా సాగే ఏలేలో పాటను రిలీజ్ చేశారు. మరి ఈ సాంగ్‌ను ఏ డైరెక్టర్ రిలీజ్ చేశారో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jan 14, 2026, 20:40:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులో తెరకెక్కుతోన్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా రాయుడు గారి తాలూకా. శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా రూరల్ ఎంటర్‌టైనర్ ‘రాయుడి గారి తాలుకా’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

జోరుగా రాయుడు గారి తాలూకా ప్రమోషన్స్- మొన్న మాస్ సాంగ్, నేడు రొమాంటిక్ పాట- క్లాస్ డైరెక్టర్‌తో రిలీజ్
జోరుగా రాయుడు గారి తాలూకా ప్రమోషన్స్- మొన్న మాస్ సాంగ్, నేడు రొమాంటిక్ పాట- క్లాస్ డైరెక్టర్‌తో రిలీజ్

మొదటి పాటగా జాతరొచ్చింది

ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన రాయుడు గారి తాలూకా సినిమాకు కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే మొదటి పాట ‘జాతరొచ్చింది’ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ పొందింది.

పక్కా మాస్ బీట్ సాంగ్

రాయుడు గారి తాలూకా నుంచి మొన్న విడుదలైన జాతరొచ్చింది పక్కా మాస్ బీట్ ఐటమ్ సాంగ్‌గా అలరించింది. ఈ సాంగ్‌ను సోగ్గాడే చిన్ని నాయనా, బంగర్రాజు సినిమాల డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కూరసాల విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా ఇవాళ (జనవరి 14) మరో దర్శకుడు చేతుల మీదుగా మరో పాటను రిలీజ్ చేశారు.

క్లాస్ డైరెక్టర్‌గా పేరు

ఈసారి రాయుడు గారి తాలూకా నుంచి రొమాంటిక్ సాంగ్‌గా ‘ఏలేలో..’ పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను క్లాస్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల విడుదల చేశారు. కొత్త బంగారులోకం ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి సినిమాలతో క్లాస్ డైరెక్టర్‌గా శ్రీకాంత్ అడ్డాల పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

రొమాంటిక్ ట్రాక్

ఇకపోతే ఏలేలో అంటూ సాగే ఈ రొమాంటిక్ ట్రాక్‌కు గురుబిల్లి జగదీష్ సాహిత్యం అందించగా, నగేష్ గౌరీష్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. జయశ్రీ పల్లెం, సాయి సందీప్ పక్కి మధురమైన స్వరాలతో ఆలపించారు. ఈ పాట ద్వారా సినిమాలోని గ్రామీణ నేపథ్యం, రొమాన్స్ ఎలిమెంట్స్ బాగా హైలైట్ అవుతున్నాయి.

జోరుగా ప్రమోషన్స్

ఇలా వరుస పెట్టి జోరుగా రాయుడి గారి తాలుకా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే మొన్న మాస్ బీట్ సాంగ్, ఇవాళ రొమాంటిక్ పాటను రిలీజ్ చేసి ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నారు.

రాయుడు గారి తాలూకా నటీనటులు

కాగా, రాయుడు గారి తాలూకా సినిమాను ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి, కరణం పేరినాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సుమన్, కిట్టయ్య, ఆర్.కే నాయుడు, సలార్ పూజ, కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు, సృజనక్షిత వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More