టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన లేటెస్ట్ తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా శంబాల. అర్చన అయ్యర్, స్వాసిక విజయన్, ఇంద్రనీల్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు.
శంబాల సక్సెస్ ఈవెంట్

డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన శంబాల మంచి టాక్‌తో పేరు తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల శంబాల సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో శంబాల ఓటీటీ రైట్స్ అమ్ముడుపోవడంపై డైరెక్టర్ యుగంధర్ ముని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ప్రతి ఒక్కరు
దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ .. "శంబాల సక్సెస్‌కి నేను ఒక్కడిని కారణం కాదు. ఇదంతా టీమ్ వర్క్. నా నిర్మాతలు మహీధర్ గారు, రాజశేఖర్ గారి సపోర్ట్ వల్లే చిత్రం ఇంత బాగా వచ్చింది. ఆది గారు లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ తమ తమ పాత్రకు న్యాయం చేశారు" అని అన్నారు.
గాయాలైన సపోర్ట్ చేశారు
"ఇంటర్వెల్ బ్లాక్ చిత్రీకరిస్తున్నప్పుడు ఆర్టిస్టులందరికీ గాయాలు అయ్యాయి. అయినా అందరూ సపోర్ట్ చేసి నటించారు. ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ ఆర్ఆర్, శ్రవణ్ ఎడిటింగ్ ఇలా అన్నీ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నాకంటే శ్రీ చరణ్‌నే అందరూ ఎక్కువగా పొగుడుతున్నారు" అని యుగంధర్ ముని తెలిపారు.
భగవద్గీతతో పోలుస్తున్నారు
"సినిమాకి ప్రతీ ఒక్కరూ కష్టపడతారు. కానీ, కొన్ని చిత్రాలే ఆడియెన్స్‌కి నచ్చుతాయి. చాలా లేయర్స్‌తో ఈ మూవీని తీశాను. ఆడియెన్స్ మా సినిమాకి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. భగవద్గీతతో మా చిత్రాన్ని పోల్చుతున్నారు. సినిమా హిట్ అవుతుందని అనుకున్నాం. కానీ, ఈ రేంజ్లో బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకోలేదు" అని దర్శకుడు చెప్పారు.
రెండు ఓటీటీ వాళ్లు
{{/usCountry}}"సినిమాకి ప్రతీ ఒక్కరూ కష్టపడతారు. కానీ, కొన్ని చిత్రాలే ఆడియెన్స్‌కి నచ్చుతాయి. చాలా లేయర్స్‌తో ఈ మూవీని తీశాను. ఆడియెన్స్ మా సినిమాకి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. భగవద్గీతతో మా చిత్రాన్ని పోల్చుతున్నారు. సినిమా హిట్ అవుతుందని అనుకున్నాం. కానీ, ఈ రేంజ్లో బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకోలేదు" అని దర్శకుడు చెప్పారు.
రెండు ఓటీటీ వాళ్లు
{{/usCountry}}"ఈ మూవీని థియేటర్లో చూస్తేనే సౌండింగ్‌ను ఫీల్ అవుతారు. ఈ మూవీని రాజేష్ దండా గారికి ముందే చూపించాం. ఈ సినిమా చూసిన వెంటనే హిట్టు అని రాజేష్ దండా గారు ఒకే మాట చెప్పారు. జీ, ఆహా రెండు ఓటీటీ వాళ్లు మా మూవీని చూసి వెంటనే కొనేసుకున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ అదరగొట్టేశాడు అని మైత్రి శశి ప్రశంసించారు" అని శంబాల ఓటీటీ రైట్స్ గురించి డైరెక్టర్ యుగంధర్ ముని వెల్లడించారు.
సాయి కుమార్ గారి వల్లే
"మేం కంటెంట్ ఎంత బాగా తీసినా అది జనాల వరకు రీచ్ అవ్వాలి. సాయి కుమార్ గారి వల్లే ఈ చిత్రానికి ఈ రీచ్ వచ్చింది. ముందు నుంచీ కూడా మా సినిమాకి ఓ డివైన్ వైబ్ ఉంటూ వచ్చింది. మా మూవీ కోసం ఇండస్ట్రీ అంతా కదిలి వచ్చి సపోర్ట్ చేసింది. మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్" అని స్పీచ్ ముగించారు యుగంధర్ ముని.