మెగా డాటర్ నిహారిక కొణిదెల తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై నిర్మిస్తున్న మరో కొత్త సినిమా బరి. ఈ సినిమాలో తన అన్న, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాకు కమిటీ కుర్రోళ్లు సినిమాతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ యదు వంశీ దర్శకత్వం వహించనున్నారు.
ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్

రూరల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న బరి సినిమా పూజా కార్యక్రమాలను ఇవాళ శనివారం (మార్చి 28) నాడు నిర్వహించారు. బరి సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
పూజా కార్యక్రమాల అనంతరం
ముహూర్తపు సన్నివేశానికి పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టగా మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్ రెడ్డి ఎదుగురు స్క్రిప్ట్ అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం యూనిట్ చిత్రానికి సంబంధించిన విశేషాల్ని పంచుకున్నారు.
ఏడాది తిరిగా
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ యదు వంశీ మాట్లాడుతూ .. "‘కమిటీ కుర్రోళ్లు’ (అవార్డ్ విన్నింగ్ సూపర్ హిట్ మూవీ) తరువాత ఓ కథను పట్టుకుని ఏడాది తిరిగా. అది వర్కౌట్ కాలేదు. మధ్యలో నాకు వాలీబాల్ బ్యాక్ డ్రాప్‌తో ఓ ఐడియా వచ్చింది. కొంత కథ రెడీ చేసుకున్నా" అని అన్నారు.
వాలీబాల్ అనుకోవడంతోనే
"వాలీబాల్ అని అనుకోవడంతోనే నాకు వరుణ్ గారు మైండ్‌లోకి వచ్చారు. అలా కొంత కథ అయ్యాక మళ్లీ తిరిగి నిహారిక వద్దకే వెళ్లాను. ఆమెకు ఈ కథను నెరేట్ చేసి వరుణ్ గారు కావాలని అడిగాను. పూర్తి కథ సిద్దం చేసిన తరువాత వరుణ్ అన్న దగ్గరకు వెళ్దామని నిహారిక గారు అన్నారు. అలా మూడు నెలల్లో పూర్తి కథను రెడీ చేసి వరుణ్ గారికి వినిపించాం. ఆయనకి కథ చాలా నచ్చింది" అని యుదు వంశీ తెలిపారు.
ఓ గెస్ట్ రాబోతున్నారని
"ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాం. షూటింగ్ కూడా త్వరగా ఫినిష్ చేసి వచ్చే సంక్రాంతికి మా ‘బరి’ మూవీని బరిలోకి దించుతాం. నిన్న రాత్రి నాకు వరుణ్ గారు ఫోన్ చేశారు. ఓ గెస్ట్ రాబోతోన్నారు అని నన్ను సర్‌ప్రైజ్ చేశారు" అని యదు వంశీ చెప్పుకొచ్చారు.
షాక్ అయ్యాను
{{/usCountry}}"ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాం. షూటింగ్ కూడా త్వరగా ఫినిష్ చేసి వచ్చే సంక్రాంతికి మా ‘బరి’ మూవీని బరిలోకి దించుతాం. నిన్న రాత్రి నాకు వరుణ్ గారు ఫోన్ చేశారు. ఓ గెస్ట్ రాబోతోన్నారు అని నన్ను సర్‌ప్రైజ్ చేశారు" అని యదు వంశీ చెప్పుకొచ్చారు.
షాక్ అయ్యాను
{{/usCountry}}"పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పగానే నేను షాక్ అయ్యాను. ఈ రోజు ఆయన ఇలా వచ్చి మాలాంటి యంగ్ టీంని ప్రోత్సహించడం, మా వెనుక వరుణ్ గారు, నిహారిక వంటి వారు నిలబడటం చాలా ఆనందంగా ఉంది" అని డైరెక్టర్ యదు వంశీ పేర్కొన్నారు.
పది రెట్లు ప్రభావం చూపేలా
ఇదే ఈవెంట్‌లో సంగీతం దర్శకుడు అనుదీప్ దేవ్ మాట్లాడుతూ .. "‘కమిటీ కుర్రోళ్లు’ కంటే పది రెట్లు ప్రభావం చూపేలా ‘బరి’లోని మ్యూజిక్ ఉంటుంది. వంశీ గారికి కూడా మ్యూజిక్ పట్ల మంచి టేస్ట్ ఉంది. ఈ చిత్రంలోనూ మ్యూజిక్‌కి చాలా స్కోప్ ఉంది. చాలా అద్బుతమైన మ్యూజిక్ రాబోతోంది" అని అన్నారు.