Suyodhana: ప్రతి షో కు స్క్రీన్స్ పెరుగుతున్నాయి, ఓవర్సీస్‌లోనూ మంచి రెస్పాన్స్: సుయోధన డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి

Director YS Madhav Reddy About Suyodhana Response: ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్‌గా నటించిన సినిమా సుయోధన సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని చిత్ర దర్శకుడు వైఎస్ మాధవ్ రెడ్డి తెలిపారు. సుయోధన సక్సెస్ ఈవెంట్‌లో డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Mar 29, 2026, 16:49:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్‌గా నటించిన సినిమా సుయోధన. డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు.

ప్రతి షో కు స్క్రీన్స్ పెరుగుతున్నాయి, ఓవర్సీస్‌లోనూ మంచి రెస్పాన్స్- సుయోధన డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి
ప్రతి షో కు స్క్రీన్స్ పెరుగుతున్నాయి, ఓవర్సీస్‌లోనూ మంచి రెస్పాన్స్- సుయోధన డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి

సుయోధన సక్సెస్ ఈవెంట్

సుయోధన సినిమా శుక్రవారం (ఈ నెల 27న) ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. సుయోధన సక్సెస్ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ బోసుబాబు నిడుమోలు, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు, డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని

నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ.. "సుయోధన చిత్రంతో మొదటి ప్రయత్నంలోనే మా చిత్రానికి మంచి విజయాన్ని అందించారు. మా నెక్ట్స్ మూవీకి ఇంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం అన్ని ఏరియాల నుంచి రెస్పాన్స్ బాగుంది. ఈ సినిమా చేసిన అనుభవంతో నెక్ట్స్ మరో మంచి చిత్రంతో మీ ముందుకు వస్తాం" అని అన్నారు.

రాబోయే సినిమా పక్కా ప్లానింగ్‌తో

"అయితే ఈ సారి ఏదైనా పేరున్న సంస్థతో భాగస్వామ్యం అయి సినిమా నిర్మించాలని అనుకుంటున్నాం. ఎంతో కొంత అనుభవం, అవగాహన తెచ్చుకున్న తర్వాత చిత్ర పరిశ్రమలోకి రావాలని కొత్త నిర్మాతలకు నా సలహా. త్వరలోనే మంచి సబ్జెక్ట్ చూసుకుని కొత్త మూవీ అనౌన్స్ చేస్తాం. ఈ సారి మా సంస్థలో రాబోయే సినిమా పక్కా ప్లానింగ్‌తో ఉంటుంది" అని నిర్మాత బోసుబాబు నిడుమోలు తెలిపారు.

అనుభవం ఉన్న దర్శకుడిలా

డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ.. "చిన్న సినిమాలను ప్రేక్షకులకు చేర్చడంలో మా మీడియా మిత్రులు ముందుంటారు. సుయోధన చిత్రాన్ని కూడా వారే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, సాయి కుమార్ పోటాపోటీగా నటించారు. మా డైరెక్టర్ మాధవ్ సినిమా చేసిన విధానం చూస్తుంటే అనుభవం ఉన్న దర్శకుడిలా రూపొందించారు. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది" అని పేర్కొన్నారు.

ఓవర్సీస్‌లోనూ మంచి రెస్పాన్స్

డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ.. "సుయోధన మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి షో కు స్క్రీన్స్ పెరుగుతున్నాయి. ఓవర్సీస్‌లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కడి నుంచి మిత్రులు మూవీ చాలా బాగుందంటూ ఫోన్స్ చేస్తున్నారు" అని డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి తెలిపారు.

హైలైట్‌గా వారి నటన

"ప్రియదర్శి, సాయి కుమార్ గారి నటన సుయోధన చిత్రానికి హైలైట్‌గా నిలుస్తోంది. మా సినిమాను మరింతగా ప్రేక్షకుల దగ్గరకు మీరు రీచ్ చేయాలని కోరుకుంటున్నా" అని దర్శకుడు వైఎస్ మాధవ్ రెడ్డి కోరారు.

సుయోధన నటీనటులు

ఇదిలా ఉంటే, సుయోధన సినిమాలో హీరో ప్రియదర్శి, హీరోయిన్ ద్రిషిక చందర్, కీలక పాత్రల్లో సాయి కుమార్, ప్రేమతోపాటు విష్ణు (లడ్డు), దేవి ప్రసాద్, రాజశ్రీ నాయర్ తదితరులు నటించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More