బుల్లితెర జంట నివాసంలో అగ్ని ప్రమాదం- దివాళి ప్రమిద కారణం- కవల పిల్లలతో పరిగెత్తిన స్టార్ కపుల్- సెక్యురిటీ గార్డ్ మరణం
TV Actress Divyanka Tripathi Diwali Fire Accident: ముంబై అందేరీలోని రన్‌వాల్ టవర్‌లో దీపావళి పండుగ ముందు రోజు రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుల్లితెర స్టార్ కపుల్ దివ్యాంక త్రిపాఠి, వివేక్ కుటుంబం సురక్షితంగా బయటపడినప్పటికీ, భవనం సెక్యూరిటీ గార్డ్ ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం అలముకుంది.
TV Actress Divyanka Tripathi Diwali Fire Accident: వెలుగుల పండుగ దీపావళి వేళ ప్రముఖ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి, ఆమె భర్త వివేక్ దహియాల నివాసంలో తీవ్ర నిరాశ, ఆవేదన నిండాయి. ముంబై అందేరీ వెస్ట్‌లోని రన్‌వాల్ టవర్ 17వ అంతస్తులో శనివారం (నవంబర్ 7) రాత్రి పొద్దుపోయాక హఠాత్తుగా మంటలు చెలరేగాయి.

కవల పిల్లలతో సహా
ఈ ప్రమాదం నుంచి దివ్యాంక దంపతులు తమ కవల పిల్లలతో సహా క్షేమంగా బయటపడ్డారు. అయితే ఏళ్లుగా తమ ఇంట్లో ఒకరిగా మెలిగిన భవన సెక్యూరిటీ గార్డ్ ధన్‌పత్ మహతో (56) ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర విచారంలో మునిగిపోయింది.
పూజ ప్రమిదతో ప్రారంభమైన ప్రమాదం
ముంబై ఫైర్ బ్రీగేడ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రన్‌వాల్ టవర్ 'సి' వింగ్‌లోని 1702 ఫ్లాట్‌లో శనివారం రాత్రి 9:50 గంటల ప్రాంతంలో మంటలు ప్రారంభమయ్యాయి. ఫ్లాట్ యజమాని శరద్ అగర్వాల్ దంపతులు దీపావళి పూజ పూర్తయ్యాక ప్రమిద వెలిగించి విందు కోసం బయటకు వెళ్లారు.
ఇంట్లో ఉన్న వృద్ధులైన ఆయన తల్లిదండ్రులను సమయస్ఫూర్తితో పనిమనిషి లిఫ్ట్ ద్వారా కిందకు తీసుకువచ్చింది. హాలులో వెలుగుతున్న దియా నుంచే మంటలు వ్యాపించి అపార్ట్‌మెంట్ అంతటా దట్టమైన పొగ అలుముకుంది.
లిఫ్డ్ వాడటంతో మరణం
మంటలు వ్యాపిస్తున్న సమయంలో భవనంలో విధి నిర్వహణలో ఉన్న ధన్‌పత్ మహతో, మెట్ల మార్గానికి బదులుగా లిఫ్ట్ వాడటంతో దట్టమైన పొగలో చిక్కుకుపోయారు. లిఫ్ట్ లాబీలో స్పృహతప్పి పడివున్న ఆయనను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసి కోకిలాబెన్ ఆసుపత్రికి, ఆ తర్వాత కూపర్ ఆసుపత్రికి తరలించారు.
ఆదివారం (నవంబర్ 8) తెల్లవారుజామున 2 గంటల సమయంలో సెక్యూరిటీ గార్డ్ ధన్‌పత్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గత తొమ్మిదేళ్లుగా ఈ భవనంలో పనిచేస్తున్న ధన్‌పత్ అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారని నివాసితులు గుర్తుచేసుకున్నారు.
"మా పిల్లలను ఆశీర్వదించిన చేతులే లేవు.."
ఈ దురదృష్టకర సంఘటనపై దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియా సామాజిక మాధ్యమాల్లో ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. కవల పిల్లలు పుట్టిన తర్వాత తొలిసారి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ధన్‌పత్ అంకుల్ ఎంతో ప్రేమగా ఆశీర్వదించిన పాత వీడియోను వారు షేర్ చేశారు.
"కొన్ని నష్టాలు మిగిల్చే నిశ్శబ్దం ఎప్పటికీ వీడిపోదు. మా పిల్లలు పెరుగుతుంటే ఆయన చూస్తూ ఉంటారని, వారితో ఆడుకుంటారని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అవన్నీ ఒట్టి కలలుగానే మిగిలిపోతాయని అస్సలు ఊహించలేదు" అని నటీనటులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదం జరిగిన సమయంలో తాము బయటకు వెళ్లాల్సి ఉన్నా, ఆలస్యం కావడం వల్ల ఇంట్లోనే ఉన్నామని, దానివల్ల వెంటనే ప్రమాదాన్ని గ్రహించి పిల్లలు, ఇంట్లోని సిబ్బందితో సహా బయటపడ్డామని చెప్పారు.
వెలుగుల పండుగలో మిగిలిన నిశ్శబ్దం
రన్‌వాల్ టవర్‌లో విద్యుత్, గ్యాస్ సరఫరాలు మరుసటి రోజు పునరుద్ధరించినప్పటికీ, నివాసితుల మనస్సుల్లో మాత్రం విషాద ఛాయలు చెరిగిపోలేదు. మల్టీ-స్టోరీ అపార్ట్‌మెంట్లలో పండుగల సమయంలో దీపాలు వెలిగించేటప్పుడు చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
"ధన్‌పత్ అంకుల్ కేవలం భవనం గార్డ్ మాత్రమే కాదు, మా జీవితంలో ఒక భాగం. ఈ దీపావళికి మా ఇంట్లో వెలుగులు తగ్గాయి, ఒక అమూల్యమైన ప్రాణం పోవడంతో మా గుండెల్లో ఎప్పటికీ పూడ్చలేని చీకటి మిగిలిపోయింది" అని స్టార్ కపుల్ తమ నివాళి అందించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


