Tollywood: లక్ష్మణ్ ఆరోగ్య గ్రామానికి ఏడాది పూర్తి.. సినీ నటీనటులు హాజరు.. సినీ బృందాలకు ఉచిత ఆహారం అందిస్తామని ప్రకటన
Lakshman Arogyagramam First Anniversary: కల్తీ ఆహారం, ఉరుకుల పరుగుల జీవనశైలితో సతమతమవుతున్న నేటి సమాజానికి ప్రకృతి సహజ ఆహార ప్రాధాన్యతను చాటుతూ 'లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం' మొదటి వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్, సినీ నటీనటులు, ఇతర ప్రముఖులు హాజరై నిర్వాహకులను అభినందించారు.
Lakshman Arogyagramam First Anniversary: మారుతున్న జీవనశైలి.. పెరుగుతున్న ఆహార కల్తీ.. శారీరక శ్రమకు దూరమవుతున్న నేటి తరం.. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన జీవన విధానం ప్రాధాన్యతను చాటుతూ ముందుకు సాగుతున్న ‘లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం’ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది.

సంపూర్ణ ఆరోగ్యం నుంచి మానసిక శ్రేయస్సు వరకు
ఆహారపు అలవాట్ల నుంచి ప్రకృతి వ్యవసాయం వరకు.. సంపూర్ణ ఆరోగ్యం నుంచి మానసిక శ్రేయస్సు వరకు ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఈ ఆరోగ్య గ్రామం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, అరుణోదయ విమలక్క, సుమన్ టీవీ వ్యవస్థాపకుడు సుమన్ దూది ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినీ రంగం నుంచి నటుడు, కమెడియన్ సప్తగిరి, కిరాక్ ఆర్‌పీ, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, వందేమాతరం శ్రీనివాస్, కరాటే కళ్యాణి తదితరులు పాల్గొని లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు.
ఆహారపు అలవాట్లే ఆరోగ్యానికి పునాది
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గుతున్న నేపథ్యంలో సమతుల్య ఆహారం, పోషక విలువలు కలిగిన భోజనం, క్రమబద్ధమైన జీవనశైలి ఎంత అవసరమో చాటిచెప్పడమే ఈ ఆరోగ్య గ్రామం ప్రధాన ఉద్దేశం. అనారోగ్యం వచ్చిన తర్వాత చికిత్స కోసం పరుగులు తీయడం కంటే.. ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకునే అలవాట్లను పెంపొందించుకోవాలనే సందేశాన్ని ఈ వేదిక అందిస్తోంది.
లక్ష్మణ్ పూడి స్థాపించిన ఈ ఆరోగ్య గ్రామం ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైంది. సహజ జీవన విధానం, ఆరోగ్యకరమైన ఆహారం, ప్రకృతికి దగ్గరగా ఉండే అలవాట్లను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు, ఆరోగ్యంపై అవగాహనను దైనందిన జీవితంలో భాగం చేయాలన్నది నిర్వాహకుల ఆలోచన.
ఏ. వి. రంగనాథ్ కామెంట్స్
ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో ఆహార కల్తీ తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకుండా ప్రజలకు ఆహారం అందించడం హానికరమని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తదుపరి తరాలకు అందించే సంపదలో స్వచ్ఛమైన నీరు, నాణ్యమైన ఆహారం అత్యంత ముఖ్యమైనవని రంగనాథ్ పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం, పోషకాహారానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేసే ఆరోగ్య కేంద్రాలు సమాజానికి మేలు చేస్తాయని తెలిపారు. ముఖ్యంగా జెన్‌జీ యువత ఆహారపు అలవాట్లు, కాలుష్య నియంత్రణ, మంచినీటి వినియోగం వంటి అంశాలపై అవగాహన పెంచుకుని బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
మరిన్ని ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు
ఆరోగ్యం అంటే కేవలం అనారోగ్యం లేకపోవడం మాత్రమే కాదు.. శారీరక, మానసిక శ్రేయస్సును కాపాడుకోవడం కూడా. ఈ దిశగా సమతుల్య ఆహారం, ఆరోగ్య సంరక్షణ, వ్యాధుల నివారణ, జీవనశైలిలో అవసరమైన మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలని లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రయాణంలో భాగమైన వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆరోగ్య అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
సినీ రంగానికీ ప్రత్యేక ఆహ్వానం
సినిమా రంగం ద్వారా ఆరోగ్య సందేశాన్ని మరింత మందికి వేగంగా తీసుకెళ్లవచ్చని లక్ష్మణ్ పూడి అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమలోని చిన్న నిర్మాతలు, నూతన దర్శకులు తమ సినిమా ప్రెస్ మీట్లు, టీజర్ లాంచ్‌లు, ఇతర వేడుకలను ఇక్కడ నిర్వహించుకోవడానికి అవసరమైన వేదిక, సదుపాయాలను ఉచితంగా కల్పిస్తామని ప్రకటించారు.
ఇక్కడికి వచ్చే సినీ బృందాలకు ఉచితంగా ప్రకృతి సిద్ధమైన సాత్వికాహారాన్ని అందిస్తామని తెలిపారు. వినోద రంగాన్ని సాధనంగా చేసుకుని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


