...
...
Next Story

10 నెలల తర్వాత ఓటీటీలోకి మమ్ముట్టి మలయాళ థ్రిల్లర్- దొరికిన పర్సుతో మిస్సింగ్ లేడీ కేసు- మైండ్ బ్లాక్ ట్విస్ట్

ఓటీటీలోకి మరో మలయాళ థ్రిల్లర్ వచ్చేస్తోంది. థియేటర్లో రిలీజైన 10 నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుండటం గమనార్హం. ఇందులో స్టార్ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించాడు.

Updated on: Dec 12, 2025, 08:50:59 IST
Advertisement

ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఇక ఇందులోనూ థ్రిల్లర్లది మరో రేంజ్. ఇప్పుడు అలాంటి మరో మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి రాబోతుంది. మమ్ముట్టి హీరోగా నటించిన ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు. థియేటర్లలో రిలీజైన 10 నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వస్తుంది.

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ ఓటీటీ

ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ (x)
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ (x)

మమ్ముట్టి హీరోగా యాక్ట్ చేసిన మలయాళ థ్రిల్లర్ డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్. ఇది ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు అనౌన్స్ మెంట్ రానే వచ్చింది. డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా డిసెంబర్ 19 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

10 నెలల తర్వాత

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా 10 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుండటం గమనార్హం. ఇది 2025 జనవరి 23న థియేటర్లలో రిలీజైంది. ఇందులో మమ్ముట్టి, గోకుల్ సురేష్, సుష్మిత భట్ తదితరులు నటించారు. దీనికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్టర్. ఈ సినిమాను మమ్ముట్టి కంపెనీ బ్యానర్ పై స్వయంగా మమ్ముట్టి నిర్మించారు. డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మూవీకి క్రిటిక్స్ నుంచి మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి.

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ కథ

ఓ దొరికిన లేడీస్ పర్స్ ఓనర్ ఎవరు? అని కనిపెట్టేందుకు డొమినిక్, విక్కీ రంగంలోకి దిగుతారు. ఆ క్రమంలోనే అప్పటికే మిస్సయిన పూజ అనే అమ్మాయితో ఈ పర్స్ కు కనెక్షన్ ఉందని కనిపెడతారు. ఇంకా ఎంక్వైరీ చేస్తుంటే పూజ బాయ్ ఫ్రెండ్ కార్తీక్ కూడా కనిపించడం లేదని తెలుస్తుంది. చివరకు పూజ హత్య విషయం బయటపడుతుంది. ఇక్కడ వచ్చే ఓ ట్విస్ట్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుంది.

మరి పూజను హత్య చేసింది ఎవరు? కార్తీక్ ఏమయ్యాడు? ఆ ట్విస్ట్ ఏంటీ? అన్నది డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks