...
...
Next Story

Drishyam 3 BO: ఒక్కరోజే 13 కోట్లు- 3 రోజుల్లో 100 కోట్లు దాటిన దృశ్యం 3 కలెక్షన్స్- మొత్తంగా ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Drishyam 3 Box Office Collection Day 3: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన దృశ్యం 3 ఒక్కరోజే 13 కోట్లు రాబట్టింది. మరి దృశ్యం 3 వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ ఎంతో చూద్దాం.

Published on: May 24, 2026, 11:47:10 IST
Advertisement

Drishyam 3 Movie 3 Days Worldwide Box Office Collection: భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త ట్రెండ్‌ సెట్ చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'దృశ్యం'. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన 'దృశ్యం 3' మే 21న మలయాళ సూపర్ స్టార్ పుట్టినరోజు కానుకగా థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు నుంచే భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం వారాంతంలో బాక్సాఫీస్ వద్ద మరింత పట్టు సాధించింది.

తమిళం, కన్నడ భాషలతో పోలిస్తే

ఒక్కరోజే 13 కోట్లు- 3 రోజుల్లో 100 కోట్లు దాటిన దృశ్యం 3 కలెక్షన్స్- మొత్తంగా ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ఒక్కరోజే 13 కోట్లు- 3 రోజుల్లో 100 కోట్లు దాటిన దృశ్యం 3 కలెక్షన్స్- మొత్తంగా ఎన్ని కోట్లు వచ్చాయంటే?

మలయాళంలో విడుదలైన ఈ మూడో భాగానికి తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఆదరణ లభిస్తోంది. సౌత్ ఇండియాలో తమిళం, కన్నడ భాషలతో పోలిస్తే తెలుగులోనే దృశ్యం 3 చిత్రానికి అత్యధిక వసూళ్లు రావడం విశేషంగా మారింది.

వీకెండ్‌లో వసూళ్ల జంప్

ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, 'దృశ్యం 3' మూడో రోజైన శనివారం (మే 23) ఒక్కరోజే భారతదేశంలో దాదాపు రూ. 13.70 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. శుక్రవారంతో పోలిస్తే శనివారం వసూళ్లలో 24 శాతం వృద్ధి కనిపించింది. రెండో రోజున ఈ చిత్రం రూ. 11.05 కోట్లు వసూలు చేయగా.. శనివారం నాటి కలెక్షన్లతో కలిపి దేశీయంగా 3 రోజుల్లో మొత్తం రూ. 40.60 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.

గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల మార్కు

దేశవ్యాప్తంగా ఉన్న 5,185 షోలలో ఈ చిత్రం సగటున 50.2 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఇక ఓవర్సీస్ (విదేశీ) మార్కెట్లోనూ మోహన్ లాల్ మాయాజాలం గట్టిగానే పనిచేస్తోంది. మూడో రోజున అంతర్జాతీయ మార్కెట్ నుంచి రూ. 25 కోట్లు రాబట్టడంతో, ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్స్ రూ. 70 కోట్లకు చేరాయి.

ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించిన దృశ్యం 3 చిత్రంలో మీనా, అన్సిబా హాసన్, ఎస్తర్ అనిల్, మురళీ గోపి తదితరులు తమ పాత పాత్రల్లోనే అలరించారు. మొదటి రెండు భాగాల కథకు కొనసాగింపుగానే ఈ మూడో భాగాన్ని రూపొందించారు. అయితే, ఈసారి సినిమాలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కంటే జార్జి కుట్టి పాత్ర, అతడి నిర్ణయాల వల్ల కుటుంబం ఎదుర్కొన్న పరిణామాలపైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టారు.

"ఈ సినిమా కేవలం ట్విస్టులతో మిమ్మల్ని థ్రిల్ చేయదు. జార్జికుట్టి తీసుకునే నిర్ణయాలు, వాటి పర్యవసానాలను మాత్రమే చూపిస్తుంది" అని ప్రముఖ సినీ సమీక్షకులు విశ్లేషిస్తున్నారు. ఈ కథ ముగింపులో 'దృశ్యం 4' కి సంబంధించిన హింట్ ఇవ్వడమే కాకుండా, ఐదో భాగం కూడా ఉండే అవకాశం ఉందని మోహన్‌ లాల్ ముందే క్లూ ఇచ్చారు.

ఇండోనేషియాలో రీమేక్

మరో అరుదైన ఘనత కూడా ఈ చిత్రానికి దక్కింది. 'దృశ్యం 3' అధికారికంగా ఇండోనేషియా భాషలో రీమేక్ అవుతోంది. అక్కడ ఈ చిత్రానికి 'అయా, అకు మౌ చెరితా...' (నాన్నా, నేను నీకో కథ చెప్పాలి...) అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఇండోనేషియా మార్కెట్ కోసం రీమేక్ అవుతున్న మొట్టమొదటి మలయాళ చిత్రం దృశ్యం 3 కావడం విశేషం. ఈ రీమేక్ చిత్రం 2026 ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe