...
...
Next Story

OTT Crime Thriller: ఓటీటీలోకి 300 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్- హీరోను మించిన విలన్ నటన- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Drishyam 3 The Conclusion OTT Streaming: బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లతో సునామీ సృష్టిస్తున్న అజయ్ దేవగన్ దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. హీరోను మించిన విలన్ యాక్టింగ్‌తో వచ్చిన దృశ్యం 3లో శ్రియా శరణ్ నటించింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: Oct 12, 2026, 05:19:54 IST
Advertisement

Drishyam 3 The Conclusion OTT Release: బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తున్న అజయ్ దేవగన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా 'దృశ్యం 3' (Drishyam: The Conclusion) ఓటీటీ రిలీజ్‌పై స్పష్టత వచ్చింది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, తొలి రోజు నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

శ్రియా శరణ్ క్రైమ్ థ్రిల్లర్

ఓటీటీలోకి 300 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్- హీరోను మించిన విలన్ నటన- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి 300 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్- హీరోను మించిన విలన్ నటన- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

శ్రియా శరణ్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 3 సినిమాను థియేటర్లలో చూసిన వీక్షకులు ఒకవైపు సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన వార్తల కోసం డిజిటల్ ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రూ. 300 కోట్ల వైపు బాక్సాఫీస్ సునామీ!

బాక్సాఫీస్ రేసులో దృశ్యం ది కంక్లూజన్ సాధిస్తున్న కలెక్షన్లు ట్రేడ్ వర్గాలను సైతం విస్తుపోవులా చేస్తున్నాయి. మొదటి రోజునే ఏకంగా రూ. 62 కోట్ల బంపర్ ఓపెనింగ్ సాధించిన ఈ సినిమా, వర్కింగ్ డేస్‌లోనూ అదే జోరును కొనసాగించింది. రెండో వారంలో అడుగుపెట్టిన తర్వాత కూడా వసూళ్ల వేగం తగ్గలేదు.

రెండో శనివారం ఒక్క రోజే రూ. 26 కోట్లకు పైగా రాబట్టింది. ఆదివారం నాటికి దేశీయంగా నికర వసూళ్లు రూ. 294 కోట్లు దాటగా, రాత్రి నాటికి రూ. 300 కోట్ల మార్కును సునాయసంగా అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమా రూ. 420 కోట్ల కలెక్షన్ల మార్కుకు చేరువలో ఉంది.

సరికొత్త కథనంతో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్!

మొదటి భాగానికి జీతు జోసెఫ్ దర్శకత్వం వహించగా, ఆ తర్వాత దర్శకుడు అభిషేక్ పాఠక్ బాధ్యతలు స్వీకరించి రెండు, మూడు భాగాలను అత్యంత ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు. మలయాళ మూలకథతో సంబంధం లేకుండా, పూర్తి కొత్త స్క్రీన్‌ప్లేతో ఈ మూడో భాగాన్ని తెరకెక్కించడం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది.

దృశ్యం 3 చిత్రంలో జైదీప్ ఆహ్లావత్ పోషించిన రాజ్‌వీర్ సింగ్ తోమర్ పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ప్రథమార్థంలో అజయ్ దేవగన్‌ను సైతం దాటేసేలా జైదీప్ తన నటనతో మెప్పించారు. అంటే, తన నటనతో హీరోను దాటేశాడు విలన్. "క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెడతాయి" అని విమర్శకులు కొనియాడారు.

దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్

థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్న ఈ చిత్రం దృశ్యం 3 ఓటీటీలోకి వచ్చాక మరింత మంది ప్రేక్షకులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది. సినిమా ప్రారంభంలో వచ్చే ఓపెనింగ్ క్రెడిట్స్‌లోనే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ లోగో కనిపించడంతో ఈ విషయం అధికారికంగా స్పష్టమైంది.

థియేటర్లలో విడుదలైన 6 నుంచి 8 వారాల తర్వాతే చిత్రాలను ఓటీటీలోకి తీసుకురావడం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ప్రామాణిక నియమం. ఈ లెక్కన నవంబర్ 13 నుంచి నవంబర్ 27 నెట్‌ఫ్లిక్స్‌లో దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ కలెక్షన్స్, తదితర కారణాలతో దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks