...
...
Next Story

హారర్, మదర్ సెంటిమెంట్‌తో ఎర్రచీర.. ఆ అనుభూతి తెలియాలంటే థియేటర్‌లోనే చూడాలన్న హీరో, డైరెక్టర్ సుమన్ బాబు

నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్ర పోషించిన హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఎర్రచీర. ది బిగినింగ్ అనేది క్యాప్షన్. ఈ సినిమాకు సుమన్ బాబు దర్శకత్వం వహించారు. తాజాగా ఎర్రచీర రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించిన సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Updated on: Dec 16, 2025, 13:43:11 IST
Advertisement

హాబేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం "ఎర్రచీర". ది బిగినింగ్ అనేది క్యాప్షన్. ఈ సినిమాలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్ర పోషించింది.

డైరెక్షన్‌తోపాటు హీరోగా

హారర్, మదర్ సెంటిమెంట్‌తో ఎర్రచీర.. ఆ అనుభూతి తెలియాలంటే థియేటర్‌లోనే చూడాలన్న హీరో, డైరెక్టర్ సుమన్ బాబు
హారర్, మదర్ సెంటిమెంట్‌తో ఎర్రచీర.. ఆ అనుభూతి తెలియాలంటే థియేటర్‌లోనే చూడాలన్న హీరో, డైరెక్టర్ సుమన్ బాబు

"ఎర్రచీర" మూవీకి సుమన్ బాబు దర్శకత్వం వహించారు. అలాగే, ఎర్రచీర సినిమాలో డైరెక్టర్ సుమన్ బాబు ముఖ్య పాత్ర అయిన హీరోగా చేశారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ కథతో ఈ ఎర్రచీర సినిమా తెరకెక్కినట్లు మేకర్స్ చెబుతున్నారు.

సెన్సార్ నుంచి ఏ సర్టిఫికేట్

అయితే ఈ సినిమాలో హారర్ సన్నివేశాలు ఎక్కువ ఉన్న కారణంగా ఈ సినిమా చూసిన సెన్సార్ వారు A సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా మేకర్స్ వెల్లడించారు. హార్ట్ పేషెంట్స్ ఈ సినిమానికి చూడటానికి వచ్చినప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని రావలసిందిగా చిత్ర దర్శకుడు సుమన్ బాబు కోరారు.

వచ్చే ఏడాది గ్రాండ్ రిలీజ్

తాజాగా ఎర్రచీర రిలీజ్ డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 06న ఎర్రచీర సినిమాను థియేటర్లలో గ్రాండ్‌గా విడులచేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంంగా ఎర్రచీర రిలీజ్ డేట్ అనౌన్స్‌మెట్ ప్రెస్ మీట్ నిర్వహించారు దర్శకనిర్మాతలు.

డివోషనల్ టచ్‌తో

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలో ఒకరైన ఎన్.వి.వి. సుబ్బారెడ్డి (సుభాష్) మాట్లాడుతూ.. "ఎర్రచర సినిమా కంటెంట్ డివోషనల్ టచ్‌తో ఉంది. ఈ సినిమాని ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలైట్‌గా నిలుస్తాయి" అని అన్నారు.

థియేటర్‌లోనే చూడాలి

ఇదిలా ఉంటే, ఎర్రచీర ది బిగినింగ్ సినిమాలో బేబి సాయి తేజస్విని, సుమన్ బాబుతోపాటు శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఎర్రచీర టెక్నిషియన్స్

ఇక ఎర్రచీర టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. మూవీకి గోపి విమల పుత్ర సంభాషణలు అందించగా.. సంగీతాన్ని ప్రమోద్ పులిగార్ల సమకూర్చారు. చందు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపడితే ఎడిటింగ్ పనులను వెంకట ప్రభు చూసుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe