వరల్డ్ వైడ్ గా డిజిటల్ ఆడియన్స్ మనసులు గెలుచుకున్న అత్యంత పాపులర్ సిరీస్ లో సీజన్ 2 వచ్చేసింది. క్రేజీ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ ఫాల్అవుట్ కొత్త సీజన్ ఓటీటీలో రిలీజైంది. ఇవాళ (డిసెంబర్ 17) నుంచి ఫాల్అవుట్ సీజన్ 2 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సీజన్ 2 స్టోరీ ఏంటీ? ఏ ఓటీటీలో ఉందో ఇక్కడ చూసేయండి.
ఫాల్అవుట్ సీజన్ 2 ఓటీటీ

పాపులర్ వెబ్ సిరీస్ ఫాల్అవుట్ సీజన్ 2 ఓటీటీలో అడుగుపెట్టింది. బుధవారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ గా తెరకెక్కిన ఫాల్అవుట్ సీజన్ 2 ఇదే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
8 ఎపిసోడ్లు
ఫాల్అవుట్ సీజన్ 2లో మొత్తం 8 ఎపిసోడ్లున్నాయి. సీజన్ 1 వచ్చిన 20 నెలల తర్వాత సీజన్ 2 ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ ప్రీమియర్ అవుతోంది. ఫస్ట్ సీజన్ లో అన్ని ఎపిసోడ్లు ఒకేసారి రిలీజ్ చేశారు. కానీ సెకండ్ సీజన్లో వారానికో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 16 నుంచి ఫిబ్రవరి 4 వరకు వారానికో ఎపిసోడ్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది. ఈ ఫాల్అవుట్ సీజన్ 2 ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఫాల్అవుట్ సీజన్ 2 స్టోరీ
ఈ పోస్ట్-అపోకలిప్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్ ఫాల్అవుట్ సీజన్ 2 అభిమానులలో సంచలనం రేకెత్తించడానికి వచ్చేసింది. టిమ్ కెయిన్, లియోనార్డ్ బోయార్స్కీల ప్రసిద్ధ వీడియో గేమ్ ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. ఫాల్అవుట్ సీజన్ 1 ముగింపులో బ్రదర్హుడ్ ఆఫ్ స్టీల్, మోల్డేవర్ న్యూ కాలిఫోర్నియా రిపబ్లిక్ రేడర్ల మధ్య యుద్ధం జరిగింది. ఇందులో నుంచి మ్యాగ్జిమస్ పవర్ ఆర్మర్ తో హాంక్ తప్పించుకుంటాడు.
న్యూ వేగాస్ ప్రయాణం
{{/usCountry}}ఈ పోస్ట్-అపోకలిప్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్ ఫాల్అవుట్ సీజన్ 2 అభిమానులలో సంచలనం రేకెత్తించడానికి వచ్చేసింది. టిమ్ కెయిన్, లియోనార్డ్ బోయార్స్కీల ప్రసిద్ధ వీడియో గేమ్ ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. ఫాల్అవుట్ సీజన్ 1 ముగింపులో బ్రదర్హుడ్ ఆఫ్ స్టీల్, మోల్డేవర్ న్యూ కాలిఫోర్నియా రిపబ్లిక్ రేడర్ల మధ్య యుద్ధం జరిగింది. ఇందులో నుంచి మ్యాగ్జిమస్ పవర్ ఆర్మర్ తో హాంక్ తప్పించుకుంటాడు.
న్యూ వేగాస్ ప్రయాణం
{{/usCountry}}ఫాల్అవుట్ సీజన్ 2లో లూసీ తండ్రి హాంక్ మెక్లీన్ న్యూ వేగాస్ అనే ప్రాంతానికి వెళ్తాడు. సీజన్ 2లో మొయిన్ గా లూసీ, ది ఘౌల్ కలిసి హాంక్ ను వెతుకుతూ వెళ్లడం చూట్టూ సాగుతుంది. మధ్యలో న్యూ వేగాస్ లోని అంతర్యుద్ధాలు ఇంట్రెస్ట్ రేకెత్తిస్తాయి. ఈ సీజన్ 2లో ఎల్లా పుర్నెల్, వాల్టన్ గాగిన్స్, ఆరోన్ మోటెన్ కీ రోల్స్ ప్లే చేశారు.