First Time Review And Rating: తెలుగు చిత్రసీమలో వినూత్న ప్రయోగాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. వైవిధ్యమైన కథాంశాలతో వచ్చే చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనాలు సృష్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే బాటలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) బ్యాక్‌డ్రాప్‌తో హేమంత్ ఆర్ట్స్ పతాకంపై రూపొందిన తాజా చిత్రమే 'ఫస్ట్ టైమ్'.
మానవ మేథస్సుకు

కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పైనే ఆధారపడకుండా, మానవ మేథస్సుకు (Human Intelligence) విజువల్ పవర్‌ను జోడించి దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి ఈ ఫస్ట్ టైమ్ సినిమాను తెరకెక్కించారు. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ లవర్ సౌరభ్ ధింగ్రా హీరోగా ఈ సినిమాతో అరంగేట్రం చేశాడు. అనికా విక్రమన్ హీరోయిన్‌గా నటించింది.
ఫస్ట్ టైమ్ రివ్యూ
అలాగే, బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్‌గా యాక్ట్ చేశాడు. తెలుగు సైన్స్ ఫిక్షన్ లవ్ రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఫస్ట్ టైమ్ మూవీ ఇవాళ (మే 22) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ఫస్ట్ టైమ్ రివ్యూలో చూద్దాం.
కథ:
ఈ సినిమా కథ క్రీస్తు శకం 2304 (2304 AD)లో ప్రారంభమవుతుంది. అసలు కలియుగం ఎలా అంతమైంది? ఆ తర్వాత నూతన సృష్టి, సరికొత్త భారతదేశం ఎలా ఆవిర్భవించాయి? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో దర్శకుడు కథను నడిపించారు. భూమిపైకి వచ్చిన ఏలియన్లకు (గ్రహాంతరవాసులు) గతంలో జరిగిన సంఘటనలను వివరిస్తూ.. ఒక పవిత్రమైన స్త్రీ నూతన సృష్టికి ఎలా కారణమైందో కథలో చూపిస్తారు.
ఈ క్రమంలో హీరోయిన్ అనికా విక్రమన్‌ను దక్కించుకోవడానికి ఆమె బావ భూపాల్ రాజు, మరో విలన్ శివకుమార్ రామచంద్రవరపు, అలాగే అఖిల్ సార్థక్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి అనికా ఎలా తప్పించుకుంది? ఆమెకు సౌరభ్ ధింగ్రా ఎలా పరిచయమయ్యాడు? చివరకు నూతన భారత ప్రపంచం ఎలా ఏర్పడింది? కొత్త సృష్టికి అనికా విక్రమన్‌కు ఉన్న సంబంధం ఏంటీ? అనేది తెలియాలంటే ఫస్ట్ టైమ్ మూవీని చూడాల్సిందే.
విశ్లేషణ:
{{/usCountry}}ఈ క్రమంలో హీరోయిన్ అనికా విక్రమన్‌ను దక్కించుకోవడానికి ఆమె బావ భూపాల్ రాజు, మరో విలన్ శివకుమార్ రామచంద్రవరపు, అలాగే అఖిల్ సార్థక్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి అనికా ఎలా తప్పించుకుంది? ఆమెకు సౌరభ్ ధింగ్రా ఎలా పరిచయమయ్యాడు? చివరకు నూతన భారత ప్రపంచం ఎలా ఏర్పడింది? కొత్త సృష్టికి అనికా విక్రమన్‌కు ఉన్న సంబంధం ఏంటీ? అనేది తెలియాలంటే ఫస్ట్ టైమ్ మూవీని చూడాల్సిందే.
విశ్లేషణ:
{{/usCountry}}ఫస్ట్ టైమ్ మూవీ ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్. కొత్తగా ఒక ప్రపంచాన్ని సృష్టించేందుకు ఏలియన్స్, మానవులు ఏ విధంగా ఆలోచించారు, అందుకోసం ఏం చేశారు. దానికి ఎవరు కావాల్సి వచ్చింది అనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్. సినిమా ప్రారంభం నుంచి కథలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత అనికా విక్రమన్ పరిచయం, ఆమెతో సృష్టికి ముడిపడి ఉన్న సంబంధం వంటి విషయాలు ఇంట్రెస్ట్ కలిగిస్తాయి.
మరోవైపు భారత దేశాన్ని కాకుండా భారత ప్రపంచాన్ని సృష్టించాలని మానవాళి చేసే ప్రయత్నం సైతం ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు, విజువల్స్ మంచి థ్రిల్ ఇస్తాయి. కొన్ని సీన్స్ డైరెక్టర్ ఊహను ప్రశంసించేలా ఉన్నాయి. అయితే, ప్రథమార్ధంలో కొన్ని సాగదీత సీన్లు మైనస్‌గా అనిపిస్తాయి.
మంచి ట్విస్టుతో క్లైమాక్స్
ఇంటర్వెల్ ట్విస్ట్ పర్వాలేదు. సెకండాఫ్‌లో వచ్చే ఉత్కంఠభరిత సన్నివేశాలు ప్రేక్షకుడిని సీట్లకు కట్టిపడేస్తాయి. క్లైమాక్స్ మంచి ట్విస్టుతో ముగుస్తుంది. నిజానికి ఇది ఒక సరికొత్త ప్రయోగం అని చెప్పుకోవచ్చు. ఆ ప్రయోగాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా తెరకెక్కించడంలో దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి దాదాపుగా సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు.
మానవ మేధస్సుతో రూపొందించిన విజువల్స్ అదిరిపోయాయి. గ్రాఫిక్స్ సరికొత్త మాయజాలాన్ని చూపించాయి. ఎడిటింగ్ ఇంకాస్తా బెటర్‌గా చేసి ఉండాల్సింది. బీజీఎమ్ సన్నివేశానికి తగినట్లుగా మూడ్ సెట్ చేసింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. చిన్న బడ్జెట్‌లో ఇలాంటి అవుట్‌పుట్ రావడం మెచ్చుకోదగిన విషయమే.
కథకు బలం చేకూర్చిన నటీనటులు
తొలి చిత్రమే అయినా హీరో సౌరభ్ ధింగ్రా తెరపై చక్కని పరిణతితో నటించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్లలో మెప్పించాడు. అలాగే, హీరోయిన్ అనికా విక్రమన్ గ్లామర్‌తోనే కాకుండా తన నటనతోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో బిగ్ బాస్ అఖిల్ సార్థక్ ఒదిగిపోయాడు.
ఫైనల్‌గా చెప్పాలంటే?
విలన్లుగా భూపాల్ రాజు, శివకుమార్ తమ నటనతో మెప్పించారు. సీనియర్ నటీనటులు అన్నపూర్ణమ్మ, మైమ్ గోపి, అజయ్ రత్నం, గాయత్రి గుప్త తమ అనుభవంతో పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. 'ఢీ' పండు డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ మాస్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఫైనల్‌గా చెప్పాలంటే కొత్త తరహా సినిమాలను, విజువల్ ఎఫెక్ట్స్‌ను ఇష్టపడే వారికి 'ఫస్ట్ టైమ్' ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది.