...
...
Next Story

Raakasaa: పాప ప్రేమకు తలవంచే బ్రహ్మ రాక్షసుడు.. బ్లాక్‌బ‌స్ట‌ర్ రాకాస‌.. హారర్ థ్రిల్లర్ విజయానికి 5 కారణాలు

Raakaasa: హారర్ థ్రిల్లర్ రాకాస థియేటర్లలో అదరగొడుతోంది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాకాస విజయానికి 5 కారణాలు ఏంటో ఇక్కడ చూసేయండి.

Published on: Apr 7, 2026, 14:51:26 IST
Advertisement

చిన్న సినిమాగా వచ్చిన హారర్ థ్రిల్లర్ ‘రాకాస’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ మూవీ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. అటు సోషల్ మీడియాలో, ఇటు ఇంటర్నెట్ లో రాకాస గురించే డిస్కషన్ సాగుతోంది. మరి ఈ మూవీ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణాలు ఇక్కడ చూసేద్దాం.

పాప ఎమోషన్

బ్లాక్ బస్టర్ గా రాకాస (youtube)
బ్లాక్ బస్టర్ గా రాకాస (youtube)

అతనో బ్రహ్మ రాక్షసుడు. కొన్ని వందల ఏళ్లకు ఒకసారి బలి కోరతాడు. అప్పుడు ఊరి నుంచి ఒక మనిషిని పంపించాల్సిందే. అలాంటి రాక్షసుడు ఓ పాప ప్రేమ ముందు తలవంచాడనే పాయింట్ రాకాసను స్పెషల్ గా మార్చింది. బలిగా పంపించిన పాపను ఆ రాక్షసుడు చంపకుండా, తనే అన్నీ అయి పెంచుకుంటాడు. ఆ పాప చనిపోతే, ఆ బాధను మోస్తూనే ఉంటాడు. చివరకు ఆ పాప జ్ణాపకాలతోనే ఈ లోకాన్ని వదిలి వెళ్తాడు.

రాక్షసుడు, పాప మధ్య అనుబంధాన్ని రాకాస మూవీలో చాలా చక్కగా చూపించారు. ఎంతటి కఠినాత్ముడు అయినా పసి పాప మోము చూసి కరగాల్సిందే అనే విషయాన్ని బలంగా చాటారు.

ఫ్యూర్ కామెడీ

ఈ మధ్య కామెడీ అంటే డబుల్ మీనింగ్ డైలాగ్ లు, అసభ్యకర పదాలు, అర్థం పర్థం లేని హావభావాలు గా మారిపోయింది. కానీ రాకాస సినిమాలో మాత్రం ఫ్యూర్ కామెడీని చూడొచ్చు. అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీలకు ఫ్యామిలీలు ఈ సినిమాను చూడటానికి థియేటర్లకు వెళ్తున్నాయి. సంగీత్ శోభన్, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను కాంబినేషన్లో కామెడీ పేలింది.

ప్రమోషన్

హారర్ థ్రిల్లర్, అందులో ఎమోషన్ యాడ్ చేసి తీయడం అంత ఈజీ కాదు. చిన్న తేడా కొట్టినా సినిమా మొత్తం మీద ఎఫెక్ట్ పడుతుంది. కానీ లేడీ డైరెక్టర్ మానస శర్మకు ఈ విషయంలో ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను ఆమె ముందుకు నడిపించింది. చందమామ కథ లాంటి మూవీని నేటి జనరేషన్ కు తగ్గట్లుగా మలిచింది.

నేచురల్ యాక్టింగ్

ఇక రాకాస మూవీ విజయానికి మరో ప్లస్ పాయింట్ నేచురల్ యాక్టింగ్. సంగీత్ శోభన్ తన సహజమైన నటనతో అదరగొట్టాడు. అలవోకగా కామెడీ పండించాడు. తన టైమింగ్ తో అలరించాడు. గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్, నయన్ సారిక కూడా తమ సపోర్ట్ ను గొప్పగా అందించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks