Devudu Varamandisthe: రిస్క్ నుంచి దేవుడు వరమందిస్తే సాంగ్ రిలీజ్- వారికి బంపర్ ఆఫర్- రీల్స్ చేయండి నగదు గెలవండి అంటూ!
Risk Devudu Varamandisthe Song Release And Contest: తెలుగులో వస్తున్న సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా'రిస్క్'. సందీప్ అశ్వ నటించిన ఈ సినిమా నుంచి దేవుడు వరమందిస్తే సాంగ్‌ను హిట్ డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంటెస్ట్ నిర్వహిస్తూ వారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు మేకర్స్.
Risk Devudu Varamandisthe Song Release And Contest: టాలీవుడ్‌లో ఒకప్పుడు చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో అలరించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన సరికొత్త అవతారంలో మెగా ఫోన్ పట్టి, దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ 'రిస్క్'.

జూన్ 26న రిస్క్ రిలీజ్
జీకే మిరాకిల్స్ బ్యానర్‌పై సందీప్ అశ్వ, సాన్యా ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రిస్క్ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. యూత్‌ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.
ప్రామిసింగ్ కంటెంట్
ఇప్పటికే విడుదలైన రిస్క్ మూవీ ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. కంటెంట్ చాలా ప్రామిసింగ్‌గా ఉండటంతో ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి.
త్రినాథ్ రావు నక్కిన చేతుల మీదుగా సాంగ్ లాంచ్
ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్, ఈ సినిమాలోని మోస్ట్ అవేటెడ్ మెలోడీ సాంగ్ “దేవుడు వరమందిస్తే”ను తాజాగా విడుదల చేసింది. టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన ఈ ప్రత్యేకమైన పాటను లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.
ఇన్‌స్టా, యూట్యూబ్ షార్ట్స్‌లలో
మెలోడీ కింగ్ ఘంటాడి కృష్ణ కంపోజ్ చేసిన ఈ సాంగ్ వినసొంపుగా ఉండటంతో శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ పాటకు అప్పుడే మంచి వ్యూస్ వస్తున్నాయి.
ప్రమోషనల్ ఈవెంట్‌లో నిర్మాతలు
ఈ ప్రమోషనల్ ఈవెంట్‌లో దర్శకుడు ఘంటాడి కృష్ణ, హీరో సందీప్ అశ్వలతో పాటు నిర్మాతలు రావి సురేష్ రెడ్డి, గుర్రం నర్సింహులు, సహ నిర్మాత గడ్డం రవి కుమార్, కో-డైరెక్టర్ బన్సీ కోయల్ కార్ తదితరులు పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.
రీల్స్ చేయండి.. నగదు బహుమతులు గెలవండి!
రిస్క్ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ ఒక వినూత్నమైన కాంటెస్ట్‌ను అనౌన్స్ చేసింది. “దేవుడు వరమందిస్తే” సాంగ్‌కు ఉన్న హుక్ స్టెప్‌ను బేస్ చేసుకుని డ్యాన్స్ వీడియోలు లేదా క్రియేటివ్ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
కచ్చితంగా వాడాల్సిన హ్యాష్ ట్యాగ్స్
వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు #DevuduVaramandisthe, #RISKMovie, #SandeepAshwa అనే హ్యాష్ ట్యాగ్‌లను కచ్చితంగా వాడాలి. ఈ రీల్స్‌లో బెస్ట్‌గా నిలిచిన వీడియోలను సెలెక్ట్ చేసి, సదరు క్రియేటర్లకు చిత్ర యూనిట్ ప్రత్యేక నగదు బహుమతులను అందజేయనుంది.
లవ్, సస్పెన్స్ ఎలిమెంట్స్
ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా లవ్, ఫ్రెండ్‌షిప్, యూత్ ఎమోషన్స్, ఊహించని సస్పెన్స్ ఎలిమెంట్స్ కలగలిపి ఈ సినిమాను రూపొందించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను కూడా ఈ 'రిస్క్' కంటెంట్ థ్రిల్ చేస్తుందని మేకర్స్ నమ్మకంగా చెప్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


