OTT Horror: ఇటీవలి కాలంలో భారతీయ ఓటీటీ వీక్షకులు, ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కొరియన్ మైండ్-బెండింగ్ థ్రిల్లర్లు, హారర్ సినిమాలపై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా అలాంటి ఓ వణికించే కొరియన్ హారర్ థ్రిల్లర్ తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమానే ‘ఘోస్ట్ ట్రైన్’.
ఘోస్ట్ ట్రైన్ ఓటీటీ

కేవలం దెయ్యాల ముఖాలు చూపించడమే కాకుండా విభిన్నమైన అట్మాస్ఫియర్, సైకాలాజికల్ గ్రిప్, గూస్‌బంప్స్ తెప్పించే సౌండ్ డిజైనింగ్‌తో భయపెట్టడం కొరియన్ చిత్రాల ప్రత్యేకత. ఈ హారర్ థ్రిల్లర్ ఘోస్ట్ ట్రైన్ కూడా అలాంటిదే. ఈ సినిమా తాజాగా ప్రముఖ డిజిటల్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లోకి వచ్చేసింది. ఒరిజినల్ కొరియన్ భాషతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.
అసలు కథేంటి?
పాపులారిటీ, వ్యూస్ కోసం ఏమైనా చేసే దా-క్యుంగ్ (జూ హ్యూన్-యంగ్) అనే ఒక హారర్ యూట్యూబర్ చుట్టూ ఈ ఘోస్ట్ ట్రైన్ సినిమా కథ తిరుగుతుంది. తన ఛానెల్‌లో వ్యూయర్ షిప్ పూర్తిగా పడిపోవడంతో, కొత్త కంటెంట్ కోసం క్యుంగ్ చూస్తుంది. విచిత్రమైన మిస్టరీలు, వరుస మనుషుల అదృశ్యాలకు పేరుగాంచిన 'గ్వాంగ్లిమ్' అనే హంటెడ్ సబ్‌వే రైల్వే స్టేషన్‌కు వెళ్తుంది.
అక్కడ దాగి ఉన్న నిజమైన దెయ్యాల కథలను సేకరించడానికి ఆ స్టేషన్ మాస్టర్ (జెయోన్ బే-సూ) ను క్యుంగ్ కలుస్తుంది. ఆ స్టేషన్ మాస్టర్ ఒక్కో వింత అనుభవాన్ని, అక్కడ మనుషులు మాయమైన తీరును వివరించే క్రమంలో దా-క్యుంగ్ ఎలాంటి భయానక పరిణామాలను ఎదుర్కొంది అనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం.
ఎందుకు చూడాలి?
దర్శకుడు తక్ సే-వూంగ్ తెరకెక్కించిన ఈ ఘోస్ట్ ట్రైన్ చిత్రంలో హారర్ ఆంథాలజీ తరహా నెరేషన్ కనిపిస్తుంది. ప్రతి కథ ఒక విభిన్నమైన భయాన్ని ఆవిష్కరిస్తూ చివరి వరకు ఉత్కంఠ కొనసాగేలా చేస్తుంది. కొన్ని కథలు అయితే వెన్నులో వణుకు పుట్టిస్తాయి. క్లోజ్డ్ స్పేసెస్, చీకటి నిండిన సబ్‌వే టన్నెల్స్ నేపథ్యం ఈ దృశ్యాలను మరింత భయంకరంగా మార్చాయి. నటి జూ హ్యూన్-యంగ్, జెయోన్ బే-సూలతో పాటు పాప్ స్టార్ చోయ్ బో-మిన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
{{/usCountry}}దర్శకుడు తక్ సే-వూంగ్ తెరకెక్కించిన ఈ ఘోస్ట్ ట్రైన్ చిత్రంలో హారర్ ఆంథాలజీ తరహా నెరేషన్ కనిపిస్తుంది. ప్రతి కథ ఒక విభిన్నమైన భయాన్ని ఆవిష్కరిస్తూ చివరి వరకు ఉత్కంఠ కొనసాగేలా చేస్తుంది. కొన్ని కథలు అయితే వెన్నులో వణుకు పుట్టిస్తాయి. క్లోజ్డ్ స్పేసెస్, చీకటి నిండిన సబ్‌వే టన్నెల్స్ నేపథ్యం ఈ దృశ్యాలను మరింత భయంకరంగా మార్చాయి. నటి జూ హ్యూన్-యంగ్, జెయోన్ బే-సూలతో పాటు పాప్ స్టార్ చోయ్ బో-మిన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
{{/usCountry}}రొటీన్ దెయ్యం సినిమాలకు భిన్నంగా అర్బన్ లెజెండ్స్, డార్క్ మిస్టరీస్, సైకాలాజికల్ థ్రిల్లర్లను ఇష్టపడే తెలుగు వీక్షకులకు ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ 'ఘోస్ట్ ట్రైన్' ఒక పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ కూడా సహజంగా కుదరడంతో డార్క్ థ్రిల్లర్ ప్రేమికులు ఈ రాత్రికి దీనిని వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవచ్చు.