Today OTT: ఓటీటీలోకి విపరీతమైన కంటెంట్ వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో డిజిటల్ సినీ లవర్స్ డిఫరెంట్ సినిమాలను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇవాళ అలాంటి ఓ డిఫరెంట్ మూవీనే స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రమే ‘గర్ల్స్ లైక్ గర్ల్స్’.
గర్ల్స్ లైక్ గర్ల్స్ ఓటీటీ

ఓటీటీలో హాలీవుడ్ మూవీస్ కు క్రేజ్ ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా హారర్, క్రైమ్, రొమాంటిక్ థ్రిల్లర్లను ఆడియన్స్ ఎప్పుడూ వాచ్ చేస్తారు. ఈ క్రమంలోనే ఇవాళ (జూలై 7) రొమాంటిక్ థ్రిల్లర్ ‘గర్ల్స్ లైక్ గర్ల్స్’ స్ట్రీమింగ్ లోకి అడుగుపెడుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
స్ట్రీమింగ్ ఇలా
గర్ల్స్ లైక్ గర్ల్స్ మూవీ స్ట్రీమింగ్ లో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది కానీ ఇప్పుడు కేవలం రెంట్ బేసిస్ లో మాత్రం అందుబాటులోకి రానుంది. అంటే ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూడాలంటే రెంట్ కోసం మనీ పే చేయాల్సిందే.
అమెరికన్ కమింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన గర్ల్స్ లైక్ గర్ల్స్ మూవీ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. దీనికి హేలీ కియోకో డైరెక్టర్. ఇందులో మాయా డి కోస్టా, మైరా మాలోయ్ ప్రధాన పాత్రలు పోషించారు.
గర్ల్స్ లైక్ గర్ల్స్ స్టోరీ
ఇద్దరు అమ్మాయిల లవ్, రొమాన్స్.. మధ్యలో ఓ అబ్బాయి ట్విస్ట్ చుట్టూ సాగే కథనే గర్ల్స్ లైక్ గర్ల్స్ మూవీ. కోలే, సోవియా మధ్య ఫ్రెండ్స్ కారణంగా పరిచయం ఏర్పడుతుంది. సోనియాకు అప్పటికే లవర్ ఉంటాడు. కానీ క్రమంగా కోలే, సోనియాలు ప్రాణ స్నేహితులుగా మారుతారు.
{{/usCountry}}ఇద్దరు అమ్మాయిల లవ్, రొమాన్స్.. మధ్యలో ఓ అబ్బాయి ట్విస్ట్ చుట్టూ సాగే కథనే గర్ల్స్ లైక్ గర్ల్స్ మూవీ. కోలే, సోవియా మధ్య ఫ్రెండ్స్ కారణంగా పరిచయం ఏర్పడుతుంది. సోనియాకు అప్పటికే లవర్ ఉంటాడు. కానీ క్రమంగా కోలే, సోనియాలు ప్రాణ స్నేహితులుగా మారుతారు.
{{/usCountry}}ఒక రోజు కోలే తన తల్లి మరణం గురించి బాధపడుతూ సోనియాకు చెప్తుంది. అప్పుడు వీళ్లు ఇంకా దగ్గర అవుతారు. ముద్దు పెట్టుకుంటారు. కానీ భయంతో కోలేకు సోనియా దూరంగా ఉండటం స్టార్ట్ చేస్తుంది.
ఆ సీక్రెట్ బయటపడి
అదే సమయంలో కోలే కు సంబంధించిన ఓ వ్యక్తిగత రహస్యం ట్రెంటన్ ద్వారా అందరికీ తెలుస్తుంది. అయితే దీనికి సోనియానే దానికి కారణమని కోలే నమ్ముతుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అసలు కోలేకు సంబంధించిన ఆ సీక్రెట్ ఏంటీ? సోనియా, కోలే కలుసుకున్నారా? అసలు ఏమైంది? అనేది గర్ల్స్ లైక్ గర్ల్స్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.