...
...
Next Story

గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ పాస్ చూశారా.. పాస్ కాదు ఇది పాస్‌పోర్ట్.. క్యూఆర్ కోడ్, రూట్ మ్యాప్స్ సహా ఎన్నో..

రాజమౌళి, మహేష్ బాబు మూవీ గ్లోబ్‌ట్రాటర్ నిర్వహించబోయే ఈవెంట్ పాస్‌ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ చిన్న బుక్‌లెట్ రూపంలో పాస్‌పోర్ట్ లాగే ఇది ఉండటం విశేషం. అందులో సూచనలు, క్యూఆర్ కోడ్ లాంటివి ఉన్నాయి.

Published on: Nov 13, 2025, 21:13:35 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ ఈ శనివారం (నవంబర్ 15) రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న విషయం తెలుసు కదా. ఈ ఈవెంట్ కోసం మహేష్, రాజమౌళి ఫ్యాన్స్ అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి పాస్ ఉంటే రావాలని రాజమౌళి ఇప్పటికే స్పష్టం చేయగా.. ఆ పాస్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.

గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ పాస్‌పోర్ట్

గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ పాస్ చూశారా.. పాస్ కాదు ఇది పాస్‌పోర్ట్.. క్యూఆర్ కోడ్, రూట్ మ్యాప్స్ సహా ఎన్నో..
గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ పాస్ చూశారా.. పాస్ కాదు ఇది పాస్‌పోర్ట్.. క్యూఆర్ కోడ్, రూట్ మ్యాప్స్ సహా ఎన్నో..

రాజమౌళి ఏం చేసినా ప్రత్యేకమే కదా. తన నెక్ట్స్ మూవీ గ్లోబ్‌ట్రాటర్ బిగ్ రివీల్ అంటూ ఓ పెద్ద ఈవెంట్ ప్లాన్ చేశాడు. ఇదే విచిత్రం అనుకుంటే.. దీనికి పాస్ తప్పనిసరి అంటూ పాస్‌పోర్ట్ మాదిరిగా ఉన్న పాస్ తీసుకొచ్చాడు. దానిపైన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ పాస్‌పోర్ట్ అని రాసి ఉంది.

ఇక లోపల ఈవెంట్ డేట్, ఆ తర్వాత మహేష్, రాజమౌళి, ప్రియాంకా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫొటోలు, వచ్చే అభిమానులకు సూచనలు, చివరి పేజీలో రూట్ మ్యాప్, వివిధ సూచనలు చూపించే క్యూఆర్ కోడ్ ఉంచారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈవెంట్ పాస్ కాదు పాస్‌పోర్ట్ అంటూ పలువురు వీటిని షేర్ చేసుకుంటున్నారు.

గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్.. రాజమౌళి మెసేజ్

ఇక ఈ గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ కోసం రావాలనుకునే వారికి డైరెక్టర్ రాజమౌళి ఓ ప్రత్యేకమైన వీడియో ద్వారా పలు కీలకమైన సూచనలు చేసిన విషయం తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో నవంబర్ 15న జరగబోయే ఈ ఈవెంట్ ను చూడటానికి వచ్చే వారి దగ్గర కచ్చితంగా ఫిజికల్ పాస్ ఉండాల్సిందే అని స్పష్టం చేశాడు. నేరుగా వచ్చేస్తే పంపిస్తారు.. లేదంటే ఆన్‌లైన్ లో పాసులు ఉన్నాయి అనే ప్రచారాలను నమ్మొద్దనీ సూచించాడు.

రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ఈ గ్లోబ్‌ట్రాటర్ మూవీ నుంచి ఇప్పటికే కుంభ, మందాకిని పాత్రల లుక్స్ రిలీజైన విషయం తెలిసిందే. కుంభ అనే విలన్ పాత్రలో సుకుమారన్, మందాకిని పాత్రలో ప్రియాంకా ఫస్ట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. దీంతో మహేష్ బాబు లుక్ పై ఆసక్తి నెలకొంది.

అంతేకాదు ఈ బిగ్ ఈవెంట్ లో అసలు ఏం రివీల్ చేయబోతున్నారో అని కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఇది తేలిపోనుంది. శనివారం (నవంబర్ 15) సాయంత్రం 7 గంటల నుంచి ఈ ఈవెంట్ ను జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks