Gunde Ninda Gudi Gantalu Serial Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రోమోలో బ్రహ్మముడి సీరియల్ యాక్టర్ కిరణ్ ద్వారా 30 లక్షలు మోసం చేసిన వ్యక్తిని పట్టుకోవాలని బాలు, మీనా ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలోని కిరణ్‌ను కలిసి మీనా తన ఫ్లవర్ డెకరేషన్ గురించి చెబుతుంది.
మీ వల్ల నాకు గౌరవం లేదు

కిరణ్ చెల్లి పెళ్లి డెకరేషన్ కోసం చింతామణి, మీనా ఇద్దరు పోటీ పడుతుంటారు. మరోవైపు పోకిరీల నుంచి విద్యను కాపాడబోయి తన చెంపదెబ్బ తింటాడు బాలు ఫ్రెండ్ తమ్ముడు. ఇంకోవైపు మీ వల్ల నామీద ఇంట్లోవాళ్లకు భయం లేకుండా పోయిందని, గౌరవం ఉండట్లేదని మనోజ్, రోహిణిని తిడుతుంది ప్రభావతి.
ఇదివరకు హాల్లో పులిలా కూర్చొనేదాన్ని, మీ వల్ల ఇలా కూర్చొన్నా అని అంటుంది ప్రభావతి. దీనంతటికి కారణం బాలు, మీనా అని చాడీలు చెప్పేందుకు ప్రయత్నిస్తుంది రోహిణి. ఆ మాటలు మీనా వింటుంది. తర్వాత రోహిణిని పిలుచుకుని మీనా నిలదీస్తుంది. నా వల్ల మీకు ఇబ్బందులు వస్తున్నాయా, మీరు చేసే పనుల వల్ల ఇలా జరుగుతుందా అని బుద్ధి చెప్పేందుకు ప్రయత్నిస్తుంది మీనా.
చూస్తుంటే ఇప్పుడు కూడా ఇంకో సమస్యలో చిక్కుకునేలా ఉన్నావని మీనా అంటుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ అని రోహిణి అంటుంది. గుణ అనే అతని దగ్గర నువ్వేమైనా అప్పు చేశావా అని మీనా అడుగుతుంది. దానికి రోహిణి షాక్ అయిపోతుంది. పక్కనే శ్రుతి కూడా ఉంటుంది. గుణ గురించి మీకు ఎలా తెలుసు అని రోహిణి అడుగుతుంది.
భయపడిన రోహిణి
మా తమ్ముడు ఇంతకుముందు పని చేసింది అతని దగ్గరే. అత్తయ్య దగ్గర మా తమ్ముడు బ్యాగ్ కొట్టేయడానికి కారణం కూడా వాడే అని మీనా అంటుంది. ఇప్పుడు ఈ విషయం కూడా బయటపడితే నా పరిస్థితి ఏంటీ అని రోహిణి మనసులో అనుకుంటూ భయపడిపోతుంది. పైకి మాత్రం వాడి దగ్గర ఎలాంటి అప్పు చేయలేదని చెబుతుంది రోహిణి.
{{/usCountry}}మా తమ్ముడు ఇంతకుముందు పని చేసింది అతని దగ్గరే. అత్తయ్య దగ్గర మా తమ్ముడు బ్యాగ్ కొట్టేయడానికి కారణం కూడా వాడే అని మీనా అంటుంది. ఇప్పుడు ఈ విషయం కూడా బయటపడితే నా పరిస్థితి ఏంటీ అని రోహిణి మనసులో అనుకుంటూ భయపడిపోతుంది. పైకి మాత్రం వాడి దగ్గర ఎలాంటి అప్పు చేయలేదని చెబుతుంది రోహిణి.
{{/usCountry}}మరి అలాంటప్పుడు ఎందుకు అతన్ని రెగ్యులర్‌గా కలుస్తావ్ అని మీనా అడుగుతుంది. దానికి మరింత షాక్ అయిన రోహిణి అతనికి తెలిసిన కస్టమర్స్ చాలా ఉన్నారు. వారికోసమే అతని దగ్గరికి వెళ్తుంటాను అని రోహిణి కవర్ చేస్తుంది రోహిణి. అలాంటివాడితో ఎలాంటి సంబంధం లేకపోవడమే మంచిది, వాడు మనకే రివర్స్ అవుతాడు. మా తమ్ముడిని దొంగతనం చేయమని చెప్పింది వాడే, అందరికి తెలిసేలా చేసింది వాడేనని మీనా అంటుంది.
సరే జాగ్రత్తగా ఉంటానని చెప్పి రోహిణి వెళ్లిపోతుంది. నాకెందుకు రోహిణి అబద్ధం చెబుతుందనిపిస్తుంది, మొన్న కూడా కల్పన వచ్చి చెప్పేవరకు నిజం ఒప్పుకోలేదని శ్రుతి డౌట్ పడుతుంది. తర్వాత రాత్రి ఇంటి డాబాపైన మనోజ్‌తో బాలు, రవి మాట్లాడుతుంటారు. గుణ అనేవాడి దగ్గర వదిన అప్పు చేస్తుందట అని మనోజ్‌తో అంటాడు రవి. రోహిణి ఏంటీ, రౌడీ దగ్గర అప్పు చేయడం ఏంటీ అని మనోజ్ సీరియస్ అవుతాడు.
బాలు చెప్పినట్లు చేసిన మనోజ్
ఇంతకుముందు తనకున్న అప్పుల గురించి నీకు తెలియదా అని బాలు అంటాడు. దాంతో మనోజ్ కోపగించుకుంటాడు. తర్వాత మనోజ్‌ను కూల్ చేసిన బాలు మరి అలాంటి రౌడీ దగ్గరకు పార్లరమ్మా ఎందుకు రోజు వెళ్తుంది. రోజు వాడిని ఎందుకు కలుస్తుందని అంటాడు. ఇంతకుముందు గుణ దగ్గర శివ పనిచేసేవాడు. అక్కడ పార్లరమ్మా రావడం రోజు చూసేవాడట అని బాలు నిజం చెబుతాడు.
పార్లరమ్మా వాళ్లు అసలు కోటీశ్వరులో కాదో నాకు ముందునుంచే అనుమానంగా ఉంది. ఓసారి నువ్వు అది చెక్ చేసుకో అని బాలు అంటాడు. బాలు చెక్ చేసుకోమ్మని చెప్పడంతో వెళ్లి రోహిణిని నిలదీస్తాడు మనోజ్. నిజంగా మీ నాన్న మలేషియాలో పెద్ద బిజినెస్ మ్యానా. మలేషియాలో మీది పెద్ద ఫ్యామిలీనా. అంటే బిలినీయర్స్ అందరూ మీ చుట్టాలా అక్కడ. నువ్వు ఆ గుణ దగ్గర అప్పు చేశావా అని అన్నింటి గురించి రోహిణిని నిలదీస్తాడు భర్త మనోజ్.
దాంతో రోహిణి షాక్ అయిపోతుంది. ఏం చెప్పాలో తెలియక నీళ్లు మింగుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.