Gunde Ninda Gudi Gantalu Serial Episode Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తల్లి సుశీలను ఇంటికి తీసుకొస్తాడు సత్యం. మనోజ్‌ను తిట్టి రోహిణి కాల్ చేయమని చెబుతుంది సుశీల. మనోజ్ కాల్ చేసిన రోహిణి లిఫ్ట్ చేయదు. బాలు తన ఫోన్ నెంబర్ నుంచి కాల్ చేయమంటాడు.
నా తల ఎత్తుకోనివ్వకుండా చేసింది

కానీ, సుశీల వద్దంటుంది. మనోజ్ ఫోన్ నుంచే కాల్ చేయాలని సుశీల అంటుంది. మరి నీ భార్య సంగతి ఏంట్రా అని సత్యంను అడుగుతుంది సుశీల. ముందు రోహిణి రానివ్వు, వచ్చాక తనను రమ్మంటాను. లేకుంటే ఇప్పుడే రానివ్వకుండా చేస్తుందని సత్యం అంటాడు. నేనుండగా అలా జరగనిస్తానా. నువ్వైతే కాల్ చేసి రమ్మను అని సుశీల అంటుంది.
ప్రభావతికి సత్యం కాల్ చేసి ఇంకా ఎన్ని రోజులు అక్కడుంటావ్ అని అడుగుతాడు. నా ఇంట్లో నా తల ఎత్తుకోనివ్వకుండా చేసింది అది అని రోహిణిని తిడుతుంది ప్రభావతి. రోహిణి ఇంటి కోడలు. అలా వదిలేయలేం కదా. అన్ని సమస్యలు తీర్చడానికే మా అమ్మ వచ్చింది. నిన్ను రమ్మంటుంది అని సత్యం అంటాడు.
రోహిణిని ఇంటికి పిలిచిన మనోజ్
అత్తయ్య ఎప్పుడొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు అని ప్రభావతి అడిగితే.. నేనే తీసుకొచ్చాను. త్వరగా ఇంటికి రా అని సత్యం అంటాడు. సరేనని ప్రభావతి అంటుంది. మనోజ్ మళ్లీ కాల్ చేయడంతో రోహిణి లిఫ్ట్ చేస్తుంది. నానమ్మ వచ్చిందని, నీతో మాట్లాడాలని అంటుందని మనోజ్ చెబుతాడు. దేని గురించి అని రోహిణి అంటుంది.
హా నువ్వు చేసినదాని గురించి, త్వరగా ఇంటికి రమ్మని పిలుస్తాడు మనోజ్. దాంతో రోహిణి సరేనని అంటుంది. సత్యం ఇంటికి అత్తా ప్రభావతి, కోడలు రోహిణి ఒకేసారి వస్తారు. ఇద్దరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఇంట్లోకి వెళ్తారు. సత్యం ఇంట్లో అందరికి సుశీల పంచాయితీ చెబుతుంది. అందరిముందు రోహిణి చేసిన తప్పుల గురించి చెబుతూ తిడుతుంది ప్రభావతి.
బలమైన కారణం ఉంటుందిగా
{{/usCountry}}హా నువ్వు చేసినదాని గురించి, త్వరగా ఇంటికి రమ్మని పిలుస్తాడు మనోజ్. దాంతో రోహిణి సరేనని అంటుంది. సత్యం ఇంటికి అత్తా ప్రభావతి, కోడలు రోహిణి ఒకేసారి వస్తారు. ఇద్దరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఇంట్లోకి వెళ్తారు. సత్యం ఇంట్లో అందరికి సుశీల పంచాయితీ చెబుతుంది. అందరిముందు రోహిణి చేసిన తప్పుల గురించి చెబుతూ తిడుతుంది ప్రభావతి.
బలమైన కారణం ఉంటుందిగా
{{/usCountry}}సరే నీ కోడలు తప్పు చేసింది. అబద్ధాలు చెప్పింది. అందుకు ఏదో బలమైన కారణం ఉంటుంది కదా అని సుశీల అంటుంది. మోసం చేయడం దాని నైజం అని అర్థమయ్యాక కారణం ఎలా అడగాలి అత్తయ్య అని ప్రభావతి అంటుంది. మనోజ్‌ను వదులుకోలేకే అత్తయ్యకు అబద్ధం చెప్పినట్లు రోహిణి నిజం ఒప్పుకుంటుంది. దాంతో కోటీశ్వరుడి కూతురున్న ఒకే ఒక్క మాట పట్టుకుని కనీసం తల్లిదండ్రులు ఎవరో చూల్లేదు అని ప్రభావతిదే తప్పు అన్నట్లుగా అత్త సుశీల అంటుంది.
అత్తయ్య రోహిణిని బాగా నమ్మారు. రోహిణి కూడా బాగా నమ్మించింది అని మీనా అంటుంది. కామాక్షి అత్త మేకప్ వేసుకున్నట్లు అబద్ధానికి అందంగా మేకప్ వేయకూడదు. ఆ మేకప్ ఏదో ఒకరోజు ఇలా బయటకు పోతుందని బాలు అంటాడు. దాంతో కుర్చీలోనుంచి లేచి.. ఏమే దరిద్రపుగొట్టుదానా.. నిన్ను నా ఎదురుగా చూస్తుంటే.. నా ఒళ్లు భగభగ మండిపోతుందే అని రోహిణిని కొడుతుంది.
అత్తముందే కోడలిని బాదిన ప్రభావతి
అత్తముందే కోడలు రోహిణిని ఎడాపెడా వాయిస్తుంది ప్రభావతి. దానికి అంతా షాక్ అవుతారు. ప్రభావతిని ఆపుతారు. ప్రభావతిపై సుశీల సీరియస్ అవుతుంది. నేనుండగా అలా చేయి చేసుకుంటావా. నేను వచ్చింది ఎందుకు అందరికి సర్ది చెప్పడానికేగా అని అంటుంది. దీనంతటికి పరిష్కారం చెబుతానంటుంది సుశీల.
రోహిణి చేసిన తప్పును ఒప్పుకుని ఇంకెప్పుడు మోసం చేయనని హారతి మీద ప్రమాణం చేయమని సుశీల అంటుంది. హారతి ఆర్పి ఇంకెప్పుడు మోసం చేయనని, అబద్ధాలు చెప్పనని రోహిణి దొంగ ప్రమాణం చేస్తుంది. తర్వాత జరిగింది కవర్ చేసుకుంటూ చెబుతుంది.
పార్లర్ అమ్మేశాను
మరి తాకట్టు నుంచి ఇల్లు విడిపించడానికి అన్ని లక్షలు ఎలా వచ్చాయి వదినా అని రవి అడుగుతాడు. పార్లర్ అమ్మేశాను అని రోహిణి నిజం చెబుతుంది. దానికి సత్యం ఫ్యామిలీ షాక్‌తో అవాక్కవుతుంది. ఇంకా ఎన్ని బాంబులు వేస్తావే.. అసలు నువ్వు ఆడదానివేనా.. అని మరింత చిర్రెత్తిపోతుంది ప్రభావతి.
ఇంతేనా ఇంకేమైనా దాచిందా అని సత్యం కూడా డౌట్‌గా అడుగుతాడు. మనోజ్‌ను అడగమన్నట్లుగా సత్యం అంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.