Gunde Ninda Gudi Gantalu Serial Today Episode Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కామాక్షి రెండు లక్షలు పోయాయని ఇంట్లో ప్రభావతి పెద్ద గొడవ చేస్తుంది. మీనానే దొంగతనం చేసిందని నానా మాటలు అంటుంది. దాంతో ప్రభావతిపై సత్యం, రవి, శ్రుతి మండిపడతారు.
సంతోషించేది వాళ్లే

ప్రభావతిని వెనుకేసుకొచ్చిన రోహిణిని మందలిస్తాడు సత్యం. చదువుకున్నదానివి, మనోజ్, నువ్వు బాగుపడితే వాళ్లు సంతోషిస్తారు. కానీ, వాళ్లు ఏదైనా చేశారని నింద వచ్చినప్పుడల్లా సంతోషించేదానివి నువ్వు అవుతున్నావని పెద్ద కోడలిని అంటాడు సత్యం. తర్వాత మీనా, శ్రుతి, రవి మాట్లాడుకోవడం రోహిణి వింటుంది.
రోహిణి మాటలు వింటున్నది చూసిన మీనా కావాలనే రేపు ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్తాను, వాళ్లే ఎంక్వైరీ చేసి దొంగను పట్టుకుంటారని అంటుంది. అది విన్న రోహిణి భయంతో వణికిపోతుంది. పోలీసులు వస్తే నిజం అంతా తెలిసిపోతుందని కంగారుపడుతుంది. ఏం చేయాలో తెలియక గుణకు కాల్ చేస్తుంది. అదే సమయంలో దినేష్‌తో కలిసి గుణ మందు తాగుతుంటాడు.
గుణకు కాల్ చేసిన రోహిణి నీకు రెండు లక్షలు ఇచ్చేందుకు కామాక్షి ఇంట్లో దొంగతనం చేశాను. అది ఇంట్లో పెద్ద గొడవ అవుతోంది. దానివల్ల నేను ఇరుక్కుంటాను. దాంతోపాటు నువ్వు కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది. ఆ రెండు లక్షలు ఇప్పుడు నాకు ఇవ్వు, నీకు మళ్లీ ఇస్తానంటుంది. అవి దినేష్ ట్రీట్‌మెంట్ కోసం ఇచ్చేశాను కదా. లేవు అని గుణ అంటాడు.
బాలుపై గుణ, దినేష్ పగ
అయ్యో ఇచ్చేశావా. రేపు మీనా పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అంతే సంగతి. ఎలాగైన తనను ఆపు అని రోహిణి అంటుంది. వాళ్లతో తేల్చుకోవాల్సిన లెక్కలు ఉన్నాయి. నేను చూసుకుంటాను అని గుణ కాల్ కట్ చేస్తాడు. తర్వాత దినేష్‌కు జరిగింది చెప్పిన గుణ మీనాను కిడ్నాప్ చేస్తానని, అది అడ్డుపెట్టుకుని బాలుగాడిపై పగ తీర్చుకుంటాను, అంతేకాకుండా డబ్బు కూడా లాగుతాను అని గుణ అంటాడు.
{{/usCountry}}అయ్యో ఇచ్చేశావా. రేపు మీనా పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అంతే సంగతి. ఎలాగైన తనను ఆపు అని రోహిణి అంటుంది. వాళ్లతో తేల్చుకోవాల్సిన లెక్కలు ఉన్నాయి. నేను చూసుకుంటాను అని గుణ కాల్ కట్ చేస్తాడు. తర్వాత దినేష్‌కు జరిగింది చెప్పిన గుణ మీనాను కిడ్నాప్ చేస్తానని, అది అడ్డుపెట్టుకుని బాలుగాడిపై పగ తీర్చుకుంటాను, అంతేకాకుండా డబ్బు కూడా లాగుతాను అని గుణ అంటాడు.
{{/usCountry}}ఆ బాలు గాడి మీద నాకు కూడా కోపం ఉంది. నన్నే వాడు జైలుకు పంపించాడు. నేను కూడా నీకు హెల్ప్ చేస్తానంటాడు దినేష్. గుణ, దినేష్ కలిసి బాలుపై పగ తీర్చుకునేందుకు మీనాను కిడ్నాప్ చేసే ప్లాన్ చేస్తారు. మరోవైపు మీనా ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్తుంది. తర్వాత బాలు ఇంటికి వస్తాడు. మీనా అని పిలుస్తాడు. ఇంట్లో అంతా వస్తారు. మీనా గురించి బాలు అడిగితే.. ఇంట్లో లేదని శ్రుతి సమాధానం ఇస్తుంది.
దాంతో బాలు ఫోన్ చేస్తాడు. ఎంతకీ మీనా ఫోన్ తీయదు. వదినా ఫోన్ ఇంట్లోనే వదిలేసి పోయిందని రవి చెబుతాడు. పంపించేసిందా లేదా ఇంట్లోంచి గెంటేసిందా అని తల్లిని ఉద్దేశించి బాలు అంటాడు. నీ పెళ్లాం రెండు లక్షలు దొంగతనం చేసింది అని ప్రభావతి అంటుంది. దాంతో కోపంగా మొదటిసారి తల్లిని నోర్మూయ్ అని అంటాడు బాలు. దాంతో అంతా షాక్ అవుతారు.
కన్న తల్లని కూడా చూడను
సత్యం కూడా అవాక్కవుతాడు. నా భార్యను దొంగ అని ఎవరైన అంటే కన్న తల్లి అయినా చూడను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు బాలు. నువ్వు అసలు ఒక ఆడదానివేనా. ఇద్దరు కలిసి ఇంటిని, ఇంటి పత్రాలను, ఇంటి డబ్బుని, నగలని ఎంతగా మింగేశారో మర్చిపోయారా అని తల్లి ప్రభావతి, అన్న మనోజ్‌ను అంటాడు బాలు.
ఇప్పుడు నా భార్య ఎక్కడుందో వెతికి తీసుకొచ్చి అప్పుడు చెబుతాను అని బయటకు వెళ్లిపోతాడు బాలు. బాలు అన్నంత పని చేస్తాడు. దొంగతనం ఎవరు చేశారో కనుక్కుంటే నేను, విద్య దొరికిపోయినట్లే అని కంగారుపడుతుంది రోహిణి. గుణకు కాల్ చేసి తాను చెప్పింది ఏం చేశావ్. మీనాను ఆపావా. మీనా కోసం బాలు వెతుకుతున్నాడు అని రోహిణి చెబుతుంది.
మీనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా నేను ఆపుతాను. నువ్వేం కంగారుపడకు అని గుణ చెబుతాడు. మరోవైపు స్కూటీపై మీనా వెళ్తుంటే ఎదురుగా వ్యాన్ వచ్చి ఆగుతుంది. నలుగురు ముసుగు వేసుకుని వచ్చి మీనాను పట్టుకుని తీసుకెళ్తారు. అక్కడే ఉన్న వృద్ధ జంట చూస్తారు. మీనా కిడ్నాప్‌ను ఆపేందుకు ట్రై చేస్తారు. కానీ, ఆపలేకపోతారు.
మీనా కిడ్నాప్
మీనాను గుణ రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు. అలా బాలుపై గుణ, దినేష్ ప్రతీకారం తీర్చుకుంటారు. మరోవైపు మీనా కోసం బాలు రోడ్లపై వెతుకుతుంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.