Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సత్యం ఇంకా ఇంటికి రాలేదని ప్రభావతి బాధగా ఎదురుచూస్తుంటుంది. బాలు సెటైర్లు వేస్తాడు. ఇంతలో సత్యం వస్తాడు. ప్రభావతి తెగ సంతోషిస్తుంది. ఉద్యోగం దొరికిందని సత్యం చెబుతాడు. ఏం జాబ్ అని అడుగుతారు. పార్కులో పిల్లలకు నీతి కథలు చెప్పాలని సత్యం చెబుతాడు.
జీతం ఎంతిస్తున్నారు

మంచి ఉద్యోగమే. జీతం ఎంతిస్తున్నారని ప్రభావతి అడుగుతుంది. రోజు ఓ గంట నీతి కథలు చెబితే ఎంత ఇస్తారు. న్యాయంగా ఇస్తే చాలు, నా వయసుకు తగిన ఉద్యోగం ఇది అని సత్యం అంటాడు. పూర్తి జాబ్ దొరికే వరకు ఇది. ఇది చేస్తూనే అది వెతుక్కుంటా అని సత్యం అంటాడు. సీరియస్‌గా ట్రై చేయి నాన్న దొరుకుతుందని మనోజ్ అంటే బాలు పంచ్‌లు వేస్తాడు. నేను చేసేది రోజుకో గంట మాత్రమే. దీనిపై గొడవ అవసరం లేదు అని సత్యం అంటాడు.
కట్ చేస్తే పిల్లలకు సత్యం నీతి కథలు చెబుతాడు. పంచ తంత్రం కథలు చెబుతాడు. పిల్లలకు చెబుతుంటే తల్లిదండ్రులు కూడా వచ్చి వింటారు. ఇలాంటి కథలు చెప్పేవాళ్లు కరువైపోయారు. అలాంటిది ఇంతమంది పిల్లలను పోగేసి చెబుతున్నారు. పైగా ఫ్రీగా చెబుతున్నారు అని ఒకావిడ అంటుంది. దాంతో సత్యం అనుమానిస్తాడు. ఫ్రీగానా మరి అడ్వాన్స్ ఎలా వచ్చిందని సత్యం అనుకుంటాడు.
ఇంతలో రంగా వస్తాడు. నాకు పనిపాట లేదని నాకు ఫ్రీగా డబ్బు ఇచ్చావా. స్నేహంలో దాపరికాలు ఉండవు అని సత్యం అంటాడు. నీకు బాలు లాంటి కొడుకు ఉండటం అదృష్టంరా అని ఇదంతా బాలు ప్లాన్ పని అని, నువ్ కష్టపడకూడదని ఇలా చేశాడని రంగా నిజం చెప్పేస్తాడు. చింటు వాళ్ల ఊరికి ట్రిప్ కోసం బాలు వెళ్తాడు. ప్యాసెంజర్స్‌ను దింపిన తర్వాత చింటు వాళ్ల ఇంటికి వెళ్తాడు బాలు. ఇంటికి తాళం వేసి ఉంటుంది.
సుగుణకు బాలు కాల్
చింటు వాళ్ల అమ్మమ్మకు ఒంట్లో బాగుండటం లేదు. హాస్పిటల్‌కు వెళ్లినట్లున్నారని వాళ్ల చెల్లి వచ్చి చెబుతుంది. ఓసారి కాల్ చేద్దామని సుగుణకు కాల్ చేస్తాడు బాలు. అప్పుడే రోహిణి, విద్య తల్లి ఇంటికి వెళ్తారు. తను చెప్పినట్లే మాట్లాడమని కాల్ లిఫ్ట్ చేయమంటుంది రోహిణి. సుగుణ కాల్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మా నేను మీ ఇంటి బయటే ఉన్నాను. మీరెక్కడ ఉన్నారని బాలు అడుగుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు.
{{/usCountry}}చింటు వాళ్ల అమ్మమ్మకు ఒంట్లో బాగుండటం లేదు. హాస్పిటల్‌కు వెళ్లినట్లున్నారని వాళ్ల చెల్లి వచ్చి చెబుతుంది. ఓసారి కాల్ చేద్దామని సుగుణకు కాల్ చేస్తాడు బాలు. అప్పుడే రోహిణి, విద్య తల్లి ఇంటికి వెళ్తారు. తను చెప్పినట్లే మాట్లాడమని కాల్ లిఫ్ట్ చేయమంటుంది రోహిణి. సుగుణ కాల్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మా నేను మీ ఇంటి బయటే ఉన్నాను. మీరెక్కడ ఉన్నారని బాలు అడుగుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు.
{{/usCountry}}విద్య వెళ్లి చెక్ చేసి వస్తుంది. లేడని చెబుతుంది. ఇప్పుడు అక్కడ ఉండటం లేదు, వేరే ఊరికి వచ్చామని చెబుతుంది సుగుణ. ఏ ఊరు, ఎక్కడ అని బాలు అడిగితే.. సుగుణను కోపంగా మాట్లాడమని రోహిణి చెబుతుంది. దాంతో బాలుపై తెగ కోప్పడుతుంది సుగుణ. బాలు బాధపడుతాడు. తను అలా మాట్లాడే మనిషి కాదు. నాకు ఎక్కడో తేడా కొడుతుందని బాలు డౌట్ పడతాడు.
మరోవైపు మీనా ఇంట్లో వంట చేస్తుంది. బాలు వెళ్లి ఇంటికి నువ్వు అన్నపూర్ణ అని అంటాడు. తర్వాత సుగుణ వేరే ఊరికి వెళ్లడం గురించి, సుగుణ అన్న మాటలు అన్ని చెబుతాడు బాలు. అప్పుడే రోహిణి వస్తుంది. బాలు మాటలు వింటుంది రోహిణి. సుగుణ అలా మాట్లాడటంపై బాలు, మీనా ఇద్దరు డౌట్ పడతారు. నాకెందుకో చింటు జీవితంలో ఏదో రహస్యం ఉంది. అది మనకు తెలియకూడదని వాళ్లు అనుకుంటున్నారు. దుబాయిలో ఉన్న వాళ్ల అమ్మే ఇలా చేస్తుందనుకుంటా. ఆవిడ ఇక్కడే ఉండి ఉంటుందని బాలు అంటాడు.
సుశీలతో ఎంక్వైరీ
నా సంగతులు ఇతనికెలా తెలుస్తున్నాయని రోహిణి భయపడుతుంది. వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలు. మన షీల డార్లింగ్ ఉండే పక్క ఊరిలో వాళ్ల చెల్లి ఉంటుంది కదా. షీలాతో ఎంక్వైరీ చేయిద్దామని బాలు అంటాడు. నేను ఎంత పరుగెత్తుతున్నా పట్టుకుంటునే ఉంటున్నాడు. దొరకకూడదు. ఏ ఒక్క చిన్న క్లూ కూడా దొరకకూడదు అని రోహిణి అనుకుంటుంది. సత్యం ఇంటికి వస్తాడు. మీనా నీళ్లు ఇస్తుంది.
అంతా వస్తారు. ఎన్నో రోజులు కథలు చెబితే 3 లక్షలు వస్తాయని ప్రభావతి అంటుంది. కథలు చెప్పడమే కదా చాలా ఈజీ పని అని మనోజ్ అంటాడు. బాలు వచ్చి సెటైర్లు వేస్తాడు. సత్యం డల్‌గా ఉండటంతో ఏమైంది అని అడుగుతాడు బాలు. నీ కష్టాన్ని నా కష్టార్జీతంగా చెప్పుకోవాలంటే చాలా కష్టంగా ఉందిరా అని బాలును చాలా ప్రేమగా హగ్ చేసుకుంటాడు సత్యం. అంతా షాక్ అవుతారు.
మా నాన్న నీ కొడుకుగా పుడుతాననేవాడురా. అప్పుడప్పుడు నీ రూపంలో నాకు నాన్న పుట్టాడనిపించేది. కానీ ఈసారి చాలా నమ్మకంగా అనిపిస్తుంది. మా నాన్న మళ్లీ పుట్టాడురా. నాన్నకే నాన్న. నాకు పని కల్పించి ఆ పనికి నువ్వే డబ్బులు ఇప్పిస్తున్నావ్. ఎందుకురా ఇంత ప్రేమ నేనంటే.. వీళ్లకే ఎక్కువ చేశాను కదరా. నీకే తక్కువ చేశాను అని సత్యం అంటాడు. అమ్మ పక్కన పెడితే అమ్మ ప్రేమ కూడా నువ్వే చూపించావుగా నాన్న అని బాలు ఎమోషనల్‌గా చెబుతాడు.
మనోజ్‌ను కొట్టిన ప్రభావతి
తండ్రి చూపించిన ప్రేమను చాలా గొప్పగా చెబుతాడు బాలు. అమ్మ స్థానం నీదే నాన్న స్థానం నీదే అని బాలు అంటాడు. దాంతో ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అలా అందరిని బాలు ఏడిపించేస్తాడు. నీ జీతాన్ని నా జీతంగా చెప్పుకోలేనురా. నీ అప్పు తీర్చడమనేది సాకు మాత్రమేరా. నువ్వు గర్వ పడేలా పని చేయనివ్వరా అని సత్యం వెళ్లిపోతాడు. అంతా ఎమోషనల్‌గా ఉంటారు.
మా నాన్న పిచ్చిగానీ, ఆయనేమైనా ఐఏఎస్ చదివాడా. ఈ వయసులో సెక్యురిటీ గార్డ్ లాంటి ఉద్యోగాలు తప్పా ఇంకేం దొరుకుతాయ్ అని మనోజ్ హేళనగా అంటాడు. దాంతో ప్రభావతి వచ్చి కోపంగా మనోజ్ చెంప చెల్లుమనిపిస్తుంది. సచ్చినోడా. వాడికి నాకు ఒక్క క్షణం కూడా పడదురా. కానీ, కన్నతల్లిని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో వాడిని చూసి నేర్చుకో. నేను చేసిన అప్పును తీర్చేందుకు నా భర్త ఉద్యోగం చేస్తానంటే ఎగతాళి చేస్తావా అని తిడుతుంది ప్రభావతి.
చెప్పు తెగేదాకా కొడతా.. ఊర కుక్క అని మనోజ్ దుమ్ము దులిపి పోతుంది ప్రభావతి. సత్యం చేసినదాన్ని మంచి అనుభూతిగా అనిపించిందని మీనాతో చెబుతాడు బాలు. మీ తండ్రికొడుకుల బంధం చూసి ఒక్కసారి కుళ్లుకున్నాను. ఇంట్లో అందరు కుళ్లుకున్నారు అని మీనా చెబుతుంది. ఇద్దరు సత్యం గురించి, బంధాల గురించి మాట్లాడుకుంటారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.