Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణి తప్పించుకునేందుకు మరో కట్టుకథ చెబుతుంది. మలేషియా నుంచి వచ్చిన నేను మనోజ్‌ను చూసి ప్రేమించానని, కామాక్షి పిన్ని ఇంట్లో అత్తయ్య డబ్బున్న వ్యక్తితో పెళ్లి చేయాలనుకుంటుందని తెలిసిందని, అందుకే మలేషియాలో నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పానని రోహిణి అంటుంది.
కాపురం నిలబెట్టుకునేందుకు

పెళ్లయిన తర్వాత ఎందుకు నిజం చెప్పలేదని సత్యం అంటే.. కాపురం నిలబెట్టుకోవాలని చెప్పాని, డబ్బు కోసం అత్తయ్య ఫోర్స్ చేసేసరికి ఇదంతా చేయాల్సి వచ్చిందని రోహిణి అంటుంది. దాంతో వెళ్లి రోహిణిని మరోసారి కొడుతుంది ప్రభావతి. ఆరోజు తండ్రి చనిపోయాడని కళ్లు తిరిగి పడిపోయావ్ చూడు అందుకు అని కొడుతుంది ప్రభావతి.
మరి నీ తండ్రి బతికు ఉన్నాడా లేడా అని ప్రభావతి అంటుంది. నేను కూడా మా నాన్నను పట్టించుకోలేదు. ఇటీవలే ఆయన చనిపోయాడని తెలిసిందని రోహిణి అంటుంది. హమ్మయ్య ఇక తండ్రి పాత్ర రాదన్నమాట అని సుశీల అంటుంది. ఒకటే టికెట్ మీద ఓటీటీ సినిమాలన్నీ చూసినట్లుందని బాలు సెటైర్ వేస్తాడు. 25 లక్షలు మా నాన్న పంపాడని చెప్పి మన డబ్బు మనకే చూపించిందని ప్రభావతి అంటుంది.
దీనంతంటికి కారణం ప్రభావతి అత్యాశ. ఆ రూట్‌లో వెళ్లి రోహిణి విజయం సాధించిందని సుశీల అంటుంది. కానీ, మనోజ్ పని చేయకపోయినా, ఆ అప్పులన్నీ నేనే తీర్చాను అని రోహిణి అంటుంది. మరి నీకు నాన్న లేడుగా తాకట్టు పెట్టిన ఇల్లు విడిపించడానికి అన్ని లక్షలు ఎలా వచ్చాయ్ వదినా అని రవి అడుగుతాడు. పార్లర్ అమ్మేశాను అని నిజం చెబుతుంది రోహిణి.
ఈ సంగతి నాకు తెలుసు
అంతా నోరెళ్లబెడతారు. ఏంటీ.. ఇంకా ఎన్ని బాంబులు వేస్తావే. నువ్వు అసలు ఆడదానివేనా అని ప్రభావతి తిడుతుంది. ఈ సంగతి నాకు తెలుసు అని సత్యం అంటాడు. అంతా షాక్ అవుతారు. నాకూ తెలుసు. నేనే నాన్నకు చెప్పాను అని బాలు అంటాడు. మరి పార్లర్ పెడుతున్నాడనేది ఏంటని ప్రభావతి అడుగుతుంది. లేదు పార్లర్లో నేను ఒక ఎంప్లాయ్‌గా చేస్తున్నాను అని రోహిణి అంటుంది.
{{/usCountry}}అంతా నోరెళ్లబెడతారు. ఏంటీ.. ఇంకా ఎన్ని బాంబులు వేస్తావే. నువ్వు అసలు ఆడదానివేనా అని ప్రభావతి తిడుతుంది. ఈ సంగతి నాకు తెలుసు అని సత్యం అంటాడు. అంతా షాక్ అవుతారు. నాకూ తెలుసు. నేనే నాన్నకు చెప్పాను అని బాలు అంటాడు. మరి పార్లర్ పెడుతున్నాడనేది ఏంటని ప్రభావతి అడుగుతుంది. లేదు పార్లర్లో నేను ఒక ఎంప్లాయ్‌గా చేస్తున్నాను అని రోహిణి అంటుంది.
{{/usCountry}}ఇంకెన్నీ అబద్ధాలు చెబుతావ్ రోహిణి. అత్తయ్యకు కోపం వస్తుందంటే రాదా అని పార్లర్ అమ్మేయడం గురించి అంటుంది మీనా. ఇంతేనా ఇంకేమైనా దాచిందా అని సత్యం అంటాడు. ఇందులో కూడా నిజాలు ఉన్నాయా లేదా అని బాలు అంటాడు. ఇకనుంచైనా మనోజ్‌తో, ఇంట్లోవాళ్లతో నిజాయితీగా ఉండటం నేర్చుకో అని సత్యం అంటే.. నాకు నమ్మకం లేదని బాలు, నాకు సంబంధం లేదని ప్రభావతి అంటుంది.
మీనాను హారతి పళ్లెం తీసుకురమ్మన్న సుశీల.. ఇకనుంచి భర్తకు, అత్తమామలకు, అత్తింటికి ఎలాంటి అబద్ధం చెప్పనని, ఎలాంటి మోసం చేయనని హారతి మీద ప్రమాణం చేయమని అంటుంది. ఇకనుంచి నిజాయతీగా ఉంటు మంచి కోడలిగా, మంచి భార్యగా ఉంటాను అని హారతి ఆర్పేసి ప్రమాణం చేస్తుంది రోహిణి. సుశీల చెప్పడంతో అత్తమామల కాళ్లపై పడి క్షమాపణ కోరుతుంది రోహిణి.
మీనా గొప్పదనం మెచ్చుకున్న ప్రభావతి
కానీ, ప్రభావతి సాటిస్‌ఫై కాదు. తర్వాత మీ అమ్మను ఎందుకు రమ్మన్నారు. ఆ మోసగత్తె కోట్లు తెస్తుందనుకున్నాను. ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఆ మీనా దగ్గర ఇలాంటి అబద్ధాలు, మోసాలు ఏనాడు చూల్లేదు. దీని నిజస్వరూపం బయటపడ్డాకా ప్రపంచంలో అందరితోపాటు మీనా మంచిదానిలా, గొప్పదానిలా కనిపిస్తుందని ప్రభావతి అంటుంది.
మీనా స్వచ్ఛమైన మనసు నీకు ఇప్పటికైనా అర్థమైనందుకు సంతోషమని సత్యం అంటాడు. ఈ మోసగత్తె సంగతి బయటపడ్డాక ఎవరిని ఎంతలో ఉంచాలో అని అర్థమైందని ప్రభావతి అంటుంది. ఇంతలో సత్యం రావచ్చ అని డోర్ కొడుతుంది సుశీల. ఈ వయసులో మనేమైనా డ్యూయెట్ పాడుకుంటామా ఏంటీ అని ప్రభావతి అంటుంది.
ఆస్తుల కోసం రోహిణి మీద ఒత్తిడి తెచ్చావ్. దానివల్లే రోహిణి ఇలా చేసింది. బయటి వాళ్ల సొమ్ము కోసం ఆశపడితే ఇలాగే ఉంటుంది. బాలుగాడు స్వశక్తితో ముందుకు పోతున్నాడని సుశీల అంటుంది. మనోజ్ మనసు విరిగేలా రోహిణిపై ఫిర్యాదులు చేయకని ప్రభావతితో అనేసి సుశీల వెళ్తుంది. మరోవైపు రోహిణి ఏడుస్తుంది. సుగుణ కడుపులో పుట్టినందుకు ఫీల్ అవుతుంది.
వాడి గుండె బతకాలని
మనోజ్ వస్తే థ్యాంక్స్ అని చెబుతుంది. నేను చేసిన తప్పులో సగభాగం పంచుకున్నందుకు అని రోహిణి అంటుంది. అలా చెప్పకుంటే నా పరువే ఇంకా పోతుంది. ఎవరు కొట్టొద్దని కండిషన్ పెట్టావుగా. ఏమనకూడదనే చెప్పానని మనోజ్ అంటాడు. నీకు కూడా అబద్ధాలే చెప్పాను. నా మీద నాకే అసహ్యం వేస్తుందని రోహిణి అంటుంది.
నీ మాటల్లో కనిపించినంత అసహ్యం నీ మొహంలో కనిపించట్లేదు. నీ నాటకాల ముందు నేను డ్రామా కూడా వేయడానికి పనికిరాను అని మనోజ్ అంటాడు. నువ్వు అలా అనకు తట్టుకోలేను అని రోహిణి అంటే.. మరి నువ్వు చేసినదానికి నేను తట్టుకోగలనా. వాడిది ఏ గుండెరా. వాడి గుండె బతకాలి అని బాలుగాడు ఏడిపిస్తాడని మనోజ్ అంటాడు.
మనోజ్‌ను ఏడుస్తూ తెగ బతిమిలాడుతుంది. ఇది కూడా నిజమేనా.. బాలు గాడు చెప్పినట్లు పార్ట్ 2నా. నా బర్త్ డేకి గిఫ్ట్‌గా ఇచ్చిన తాయిత్తు నన్ను బ్లఫ్ చేయడానికేగా అని మనోజ్ అడుగుతాడు. అంటే అది డబ్బుల్లేక అని రోహిణి అంటుంది. టాటూ కూడా డమ్మీనే కదా అని మనోజ్ అంటాడు. పెద్ద పెద్ద డిగ్రీల బోర్డ్ పెట్టుకుని మోసపోబడును అని మెడలో బోర్డ్ పెట్టుకునే తిరిగే మనోజ్‌ను అని బాధతో అరుస్తాడు.
చందమామలోని మచ్చే పార్లరమ్మా
దాంతో టాటూ మోసమా అంటూ చెరిపేసేందుకు పిచ్చిపిచ్చిగా ట్రై చేస్తుంది రోహిణి. మనోజ్ ఆపుతాడు. అందరికంటే ఎక్కువ మోసపోయింది నేను. నాకైనా చెప్పాలిగా అని మనోజ్ అంటాడు. భయపడ్డాను అని, నువ్వు గొప్ప పొజిషన్‌కు వెళ్లాక చెప్పాలనుకున్నాను అని రోహిణి అంటుంది. ఇప్పుడు నువ్వేం చెప్పిన నమ్మలేను, నిన్నే కాదు ఎవరిని నమ్మలేను అని మనోజ్ అంటాడు.
కేవలం నేను డబ్బున్న అమ్మాయిని అయితేనే పెళ్లి చేసుకునేవాడివా. అందుకే అవైడ్ చేస్తున్నావా అని రోహిణి అంటే.. అలా అయితే అబద్ధం చెప్పేవాన్నే కాదని మనోజ్ వెళ్లిపోతాడు. మరోవైపు డాబాపై చందమామను చూపిస్తూ అంది మనిల్లు అయితే అందులో మచ్చ పార్లరమ్మరా అని బాలు అంటాడు. అప్పుడే మనోజ్ పైకి వచ్చి ఆగుతాడు.
పార్లరమ్మ కథలో అసలైన భాగం దాచిందని తన అనుమానం అని బాలు అంటాడు. రోహిణి ఇంకా దాచిందా అని మనోజ్ అనుకుంటాడు. నా సిక్త్స్ సెన్స్ చెబుతుంది. వాళ్ల నాన్న పరమదుర్మార్గుడు అని చెప్పి ఫొటో చూపించింది కానీ అమ్మ ఫొటో చూపించలేదు. మనల్ని ఏమార్చింది అని బాలు అంటాడు. అన్నయ్య చెప్పింది నిజమేనంటారు రవి, శ్రుతి.
భార్యను మనోజ్ కాపాడాడు, ఇంకో పార్ట్ ఉంది
ఇదంతా ఒకెత్తు అయితే ఇవన్నీ ముందే తెలుసని అన్నాడు మాస్క్ మ్యాన్ మనోజ్. అన్ని తెలిసినవాడు బారుకు వెళ్లి ఫుల్లుగా ఎందుకు తాగాడు అని బాలు అంటాడు. కరెక్ట్ రోహిణి గురించి అప్పుడే తెలిసి తట్టుకోలేక తాగాడని శ్రుతి అంటుంది. ఎస్ మనిద్దరం కరెక్ట్ మ్యాటర్‌లో ఉన్నాం డబ్బుడమ్మా అని బాలు అంటాడు. రవి కూడా అదేనంటాడు.
భార్యను మనోజ్ గాడు కాపాడాడు. ఇంత జరిగిన పార్లరమ్మ కథలో ఇంకో పార్ట్ ఉందని బాలు అంటాడు. అదంతా విన్న మనోజ్ గదిలోకి వెళ్తాడు. రోహిణి ఎంత పిలిచిన పట్టించుకోడు. మనోజ్ పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం బయట అందరూ కూర్చుని తినేందుకు సుశీల ఏర్పాటు చేస్తుంది. ఇంటి గుట్టు ఏదైనా బాలునే కనిపెడతాడని శ్రుతి అంటే.. అది మనసులో దాచుకోవచ్చుగా అని మీనా అంటుంది.
వాడు చేసిందే కరెక్ట్ అమ్మా. వాడి భయం వల్లే సగం తప్పులు ఆగిపోతున్నాయని సత్యం అంటాడు. ప్రభావతి, మనోజ్, రోహిణిలను తినడానికి పిలుస్తాడు బాలు. మలేషియా గురించి ప్రభావతి దగ్గర పాట పాడుతూ సెటైర్లు వేస్తాడు. మీనా ఆపుతుంది. అందరం కిందకూర్చుని తినండని చెప్పి మీనాను వడ్డించమంటుంది సుశీల. అంతా టిఫిన్ చేస్తారు.
ముగ్గురు కోడళ్లను ఒకేలా చూడాలి
మనోజ్, రోహిణి మాత్రం ఎడామొహం, పెడమొహంలా ఉంటారు. ఇప్పటికైనా ముగ్గురు కోడళ్లని ఒకేలా చూడాలని గుణపాఠం నేర్చుకున్నావా అని సుశీల అంటుంది. అది ముగ్గురు కొడుకులనే ఒకేలా చూడదని సత్యం అంటాడు. రోహిణికి సేవలు చేయాలనేది, పెద్ద కొడుకును బాగా చూసుకుని మా ఆయన్ను తక్కువ చూసేవారని, మా పుట్టింటి గురించి తక్కువ చేసేవారు, ఇప్పుడేమంటారు అత్తయ్య అని మంటపెడుతుంది మీనా.
ఇప్పుడు రోహిణికి ఏముంది. 40 లక్షల డబ్బు మింగితే దాన్ని కూడా దాచారని మీనా అంటుంది. ఇప్పటికైనా నేలమీద నడవమని బాలు అంటాడు. లేదు ఆంటీ మారదు అని శ్రుతి, రవి అంటారు. 30 ఏళ్లుగా మారనిది ఇప్పుడు మారుతుందా అని సత్యం అంటాడు. అందరూ ఏదోటి అంటే.. ఆపండని ప్రభావతి గట్టిగా అరుస్తుంది.
కాకపోతే ఎవరు ఏమనరు. అంతా అలా అన్నట్లు ప్రభావతి ఊహించుకుంటుంది. అదే చెబుతుంది ప్రభావతి. పగటి కల అని రవి అంటాడు. ఒక దరిద్రాన్ని ఎదురుగా పెట్టుకుని తింటే మింగుడు పడటం లేదని ప్రభావతి అంటుంది. తర్వాత అందరిని దేవుడు దగ్గరకి రమ్మని జంటలుగా నిలబడమంటుంది సుశీల. మనోజ్ నిలబడకుంటే వారిస్తుంది.
ఇంట్లోకి విగ్రహం
వంద గుంజీలు తీయమను తీస్తానని మనోజ్ అంటే.. నేనే తీస్తాను దగ్గరికి జరుగు అని రోహిణి అంటుంది. చేసిన పాపాలు వంద గుంజీలతో పోవని మనోజ్ అంటాడు. మనసుకు అయిన గాయం తగ్గడానికి టైమ్ పడుతుందని సత్యం అంటాడు. బాలు చెవిలో ఏదో చెబుతుంది సుశీల. బాలు సిగ్గుపడతాడు. ఆ బుడ్డోడిని తీసుకెళ్లు అని సుశీల అంటుంది.
ఎవరని రవి అంటే.. అందరికంటే చిన్నోడివి నువ్వేరా అని సుశీల అంటుంది. రవిని బయటకు తీసుకెళ్తాడు బాలు. ఏం చేయబోతున్నారని ప్రభావతి అడిగితే.. వీళ్ల భుజాలపైన బరువు పెట్టబోతున్నానని సుశీల అంటుంది. బాలు, రవి ఏదో ముసుగు కప్పి రహస్యంగా ఉంచిన విగ్రహం లాంటిది తీసుకొస్తారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.