...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: సుమతి ప్రేమ పెళ్లికి ఒప్పుకున్న మీనా- రోహిణికి అగ్ని పరీక్ష-ఇంట్లో ఏటీఎం పంచాయతీ

Gunde Ninda Gudi Gantalu Serial August 18th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 18వ తేది ఎపిసోడ్‌లో సుమతిని అరుణ్ బైక్‌పై డ్రాప్ చేయడం చూసిన మీనా చెల్లిని నిలదీస్తుంది. ప్రేమ వ్యవహారం చెప్పడంతో పెళ్లికి మీనా ఒప్పుకుంటుంది. బ్రైడల్ మేకప్ చేసి వచ్చిన రోహిణిని డబ్బులు అడుగుతుంది ప్రభావతి.

Published on: Aug 18, 2026, 07:25:57 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అరుణ్ బైక్‌పై సుమతి వెళ్తుంది. ఇద్దరు షికార్లు కొడతారు. ఇంటికి కొంత దూరంలో సుమతిని అరుణ్ డ్రాప్ చేస్తాడు. అది మీనా చూస్తుంది. అయితే, హెల్మెట్ ఉండటం, సైడ్ నుంచి మీనా చూడటంతో అరుణ్ మీనాకు కనిపించడు.

చూస్తే గెంటేస్తుందిగా

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 18 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 18 ఎపిసోడ్

ఇంటి దగ్గరే డ్రాప్ చేసేవాన్నిగా అని అరుణ్ అంటే.. అయితే, వెంటనే మళ్లీ మీరే తీసుకెళ్లాలి. మా అమ్మ చూస్తే గెంటిస్తుందిగా అని సుమతి సెటైర్ వేస్తుంది. అరుణ్, సుమతి పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. అరుణ్ వెళ్లిపోతాడు. ఎవరితను, సుమతి దించేసి వెళ్లిపోయాడు అని మీనా డౌట్ పడుతుంది. ఇంట్లో పార్వతికి సుమతి అన్నం తినిపిస్తుంది.

ఇప్పుడు ఇబ్బంది లేదుగా. ఎప్పుడు చద్దన్నం తినకు అని సుమతి అంటుంది. మీనా వస్తుంది. రోహిణి గురించి పార్వతి అడిగితే.. అమ్మమ్మ అందరిని కలిపేసిందని చెబుతుంది మీనా. రోహిణి పొగరేమైనా తగ్గిందా అని సుమతి అంటే.. ఇదివరకులా ఊరుకోవడం లేదు నేను అని మీనా అంటుంది. తర్వాత పూలకొట్టు దగ్గర పని ఉందని పార్వతి వెళ్లిపోతుంది.

సుమతిని ఇవాళ బస్‌లోనే వచ్చావా అని మీనా అడుగుతుంది. నన్ను బండి మీద ఒకరు డ్రాప్ చేయడం చూశావా అక్కా అని సుమతి అంటుంది. మీరిద్దరు ప్రేమించుకుంటున్నారా అని మీనా అడుగుతుంది. నేనే అతని గురించి చెప్పాలనుకున్నా అని అరుణ్ మంచోడని, అందుకే ఇష్టపడ్డానని జరిగింది అంతా చెబుతుంది సుమతి.

అరుణ్‌తో సుమతి పెళ్లికి మీనా ఓకే

నీకు నచ్చాక బావ ఏమంటాడని మీనా అంటుంది. తర్వాత మీనా రాగానే భార్య కోసం ఎదురుచూస్తున్న బాలు కాఫీ పెట్టమని కిచెన్‌లోకి తీసుకెళ్తాడు. ప్రభావతి వచ్చి కుర్చీలో కూర్చుంటుంది. రోహిణి వస్తే ఆగమని.. ఎక్కడికెళ్లావని అడుగుతుంది. శ్రుతి చెప్పిన ఫంక్షన్‌కి వెళ్లానని, బ్రైడల్ మేకప్ చేశానని రోహిణి చెబుతుంది. ఎంత తీసుకున్నావని ప్రభా అడిగితే.. పాతికవేలు అని రోహిణి చెబుతుంది.

రోహిణిని డబ్బులు ఇవ్వమంటుంది ప్రభావతి. వాళ్లు ఆన్‌లైన్‌లో పంపిస్తామన్నారని రోహిణి చెబుతుంది. ఏది బ్యాగ్ చూపించు అని బలవంతంగా లాక్కుని చూస్తుంది ప్రభావతి. అదంతా బాలు, మీనా చూస్తారు. అత్తావతి అనుమానవతిగా మారింది. ఇకనుంచి పార్లరమ్మకు ప్రతిరోజు అగ్ని పరీక్షే అని బాలు అంటాడు. రోహిణి బ్యాగ్ అంతా వెతికిన ప్రభావతి ఏటీఎమ్ కార్డ్ ఇవ్వమంటుంది.

రోహిణి ఏటీఎమ్ కార్డు తీసుకున్న అత్త

రోహిణి ఇస్తుంది. ఏటీఎమ్ పిన్ నెంబర్ అడుగుతుంది. మీ అబ్బాయి పుట్టినరోజు 1992 అని చెబుతుంది రోహిణి. తెలుగులో చెప్పమని ప్రభావతి అంటుంది. నా పాలిట మహాంకాళిలా తయారయిందని రోహిణి కోపంగా చూస్తుంది. అత్తయ్యను ఇక్కడే చంపేసేలా చూస్తుంది రోహిణి అని మీనా అంటుంది. డబ్బులు రాగానే చెప్పమని ప్రభావతి అంటుంది.

రోహిణి వెళ్లిపోతుంది. రోహిణి డబ్బులు అన్యాయంగా లాక్కోవడం తప్పు కదండి అని బాలుతో మీనా అంటుంది. రాత్రిపూట అడగ్గానే కార్డ్ ఇచ్చింది. ఇది నిజంగా ఏటీఎమ్ కార్డేనా అని రోహిణిపై డౌట్ పడిన ప్రభావతి ఓసారి చెక్ చేయాలని అనుకుంటుంది. ఇంతలో మనోజ్ వస్తే నీకు పెళ్లామా, తల్లి ముఖ్యమా అని ప్రభావతి అడిగితే.. నువ్వేనని అంటాడు.

మనోజ్ మనసులోనే తన మనసు గురించి సెటైర్లు వేసుకుంటాడు. అది షో రూమ్‌కి వచ్చిందా, బయట ఏమైనా కలిసిందా అని ఆరాలు తీస్తుంది ప్రభావతి. లేదని మనోజ్ అంటాడు. ఎప్పుడైనా దాన్ని కలిసినట్లు తెలిస్తే దాన్ని జీవితంలో శాశ్వతంగా లేకుండా చేస్తాను. ఒళ్లు దగ్గరపెట్టుకుని దానికి దూరంగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి.

నా కష్టాన్ని దోచుకోవడం తప్పు కాదా

గదిలోకి మనోజ్ వెళ్తాడు. రోహిణిని తిన్నావా అని అడిగితే.. రోహిణి కోపంగా తిన్నా. మీ అమ్మ తిట్లన్ని తిన్నానని అంటుంది. మనోజ్, రోహిణి ఇద్దరు గొడవ పడతారు. అత్త కండిషన్‌తో తన కాళ్లు చేతులు కట్టేశారు అని రోహిణి అంటుంది. నేరుగా పాయింట్‌కు రమ్మని మనోజ్ అంటే.. శ్రుతి ఆఫర్ ఇచ్చిన ఫంక్షన్‌కు వచ్చిన డబ్బులు మీ అమ్మ లాగేసుకుందని, నా కష్టాన్ని దోచేసుకుందని, అది తప్పు కాదా అని రోహిణి నిలదీస్తుంది.

మా అమ్మ తప్పు చేయదు. నా వరకు మా అమ్మ ఎప్పుడు దేవతే. ఇలా ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వకని మనోజ్ కోపంగా వెళ్లిపోతాడు. మరోవైపు శ్రుతికి రోహిణి ఏటీఎమ్ కార్డ్ తీసుకోవడం గురించి రవి, శ్రుతికి చెబుతారు బాలు, మీనా. మనోజ్‌కు చెప్పి చూద్దామని బాలు అంటే.. రవి కాల్ చేసి పిలుస్తాడు. మనోజ్ వస్తాడు. మనోజ్‌ను కొట్టబోయి ఆగి.. దోమ అంటాడు.

వదిన ఏటీఎమ్ కార్డ్ అమ్మ తీసుకుందని రవి చెబితే.. తెలుసురా. అయితే ఏంటీ అని మనోజ్ అంటాడు. ఎవరు కష్టపడింది వాళ్లే తీసుకోవాలిగా అని బాలు అంటే.. అది అమ్మ రోహిణి చూసుకుంటారు నీకేంటీ నొప్పి అని మనోజ్ అంటాడు. దాంతో కోపంగా వెళ్లి గోడను తంతాడు బాలు. ఫలానా దాన్ని తన్నలేక గోడను తన్నానని బాలు అంటాడు.

పార్లరమ్మ వల్లే బాగుపడ్డావ్

రోహిణి నీకు ముందే అంతా చెప్పారని అన్నారుగా. ఇప్పుడెందుకు లైట్ తీసుకుంటున్నారని శ్రుతి అంటుంది. పార్లరమ్మ నీతో ఉండటం వల్లే నువ్వు బాగుపడ్డావ్. అది ఒప్పుకుంటావా అని బాలు అడుగుతాడు.

మరుసటి రోజు ఉదయం ఒక బౌల్‌లో అందరిని ఏటీఎమ్ కార్డులు వేయమంటాడు బాలు. అంతా వేస్తారు. పార్లరమ్మా ఏటీఎమ్ కార్డ్ అమ్మ తీసుకుందని సత్యంకు చెబుతాడు బాలు. ఇదేం పని బుద్ధుందా నీకు అని ప్రభావతిని తిడతాడు సత్యం.

అత్తాకోడళ్ల ఏటీఎమ్ కార్డు పంచాయతీ

రోహిణి డబ్బులు మీరెలా తీసుకుంటారని మీనా అంటే.. కట్టుకున్న మొగుడిని నేనే అడగట్లేదు మీకెందుకు అని మనోజ్ అంటాడు. తన కార్డ్ తనకిచ్చేయ్ కార్డావతి అని బాలు రచ్చ చేస్తాడు. నువ్వు చాలా తెలివిగా నా కాపురంలో చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలి కాచుకుంటున్నావ్ అని బాలుపై రోహిణి పెద్ద నింద వేస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe