...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణి మరో దొంగ స్కెచ్- బాలు జైలు ఫ్రెండ్ ఎంట్రీ- బాలుకు తొడిపాశం పెట్టిన మీనా

Gunde Ninda Gudi Gantalu Serial August 20th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 20వ తేది ఎపిసోడ్‌లో ఓ కస్టమర్ బాగా ఆర్డర్స్ ఇచ్చి మలేషియాకు ఎక్స్‌పోర్ట్ చేయాలంటాడు. మలేషియా పేరు వినగానే అతన్ని తరిమేస్తాడు మనోజ్. అత్తా, మొగుడిని డబ్బుతో కొడతానని దొంగ డీల్ ప్లాన్ వేస్తుంది రోహిణి.

Published on: Aug 20, 2026, 07:39:11 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నీ భార్య వల్లే నువ్వు బాగుపడ్డావ్. ఆవిడ షాప్‌లో ఉంటేనే నీకు కస్టమర్స్ వస్తారని మణికంఠ అంటే.. తన గురించి ఇలా చెప్పడానికి ఎంత తీసుకున్నావ్ అని మనోజ్ అంటాడు.

100 ఏళ్లు బతుకుతారు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 20 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 20 ఎపిసోడ్

అమ్ముడు పోవడం నాకు అలవాటు లేదని మణికంఠ అంటాడు. ఇంతలో రోహిణి వస్తుంది. అబ్బా తలచుకోగానే వచ్చారు. 100 ఏళ్లు బతుకుతారు అని మణికంఠ అంటాడు. ఎవరిని ముంచడానికి అని మనోజ్ అంటాడు. మీ ఆవిడను పెట్టుకో కస్టమర్స్ వస్తారు. నాకో స్టూల్ కావాలి. చూశావా మీ ఆవిడ రాగానే ఫ్రెండ్‌ని కాస్తా కస్టమర్‌గా మారానాని, వెళ్తానని మణికంఠ అంటాడు.

రోహిణిని పట్టించుకోకుండా వెళ్తాడు మనోజ్. ఓ కస్టమర్ వస్తే ఏం కావాలని మనోజ్ అడుగుతాడు. చెబుతాను లిస్ట్ రాసుకోమని అతను అంటే.. మనోజ్ రాసుకుంటాడు. వాటిని ఎక్స్‌పోర్ట్ చేయమని, బిల్ చేయమని, వాటిని మలేషియా ఎక్స్‌పోర్ట్ చేయమని ఆ కస్టమర్ అంటాడు. మలేషియా మీద కోపంతో ఆ లిస్ట్ చింపేసి మలేషియా తప్పా ఎక్కడికైనా పంపిస్తానంటాడు మనోజ్.

ఇంత లాభం వస్తుంటే ఎందుకు పంపరని అతను అడుగుతాడు. మలేషియా అనే పేరే నన్ను దరిద్రంలా ఉంది. నాకు ఫ్రాడ్ వైఫ్ ఉందని మనోజ్ అంటాడు. దాంతో అతను వెళ్లిపోతాడు. అదంతా చూసిన రోహిణి మాట్లాడమని అంటుంది. మనోజ్ మాట్లాడనంటే నేను నీ భార్యనని రోహిణి అంటుంది. మా అమ్మ దగ్గరికి వెళ్లి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురా అని మనోజ్ అంటే రోహిణి షాకై పోతుంది.

అమ్మలా ఫోర్స్ చేయలేదు

ఎన్ని తప్పులు మా రవిగాడిలా వండిపెట్టావో తెలుసా. ఇక భరించలేనని మనోజ్ అంటాడు. మరోవైపు అరుణ్ దగ్గరికి సుమతి వెళ్తుంది. సుమతి గురించి పక్కనున్న పోలీస్ బాబాయ్‌కి చెబుతాడు అరుణ్. కష్టపడి పోలీస్ జాబ్ కొట్టావుగా. ఇంకాస్తా కష్టపడి భర్త పోస్ట్ కొట్టేయ్ అని పోలీస్ బాబాయ్ అంటాడు. ఇకనుంచి మీరు అలా రాకండి. మా అక్క చూసింది. మన విషయం చెప్పాను అని సుమతి చెబుతుంది.

మా అమ్మ, తమ్ముడు, బావ ఉన్నారు. వాళ్లు ఒప్పుకోవాలి. దానికంటే ముందు మా అక్కకు మిమ్మల్ని పరిచయం చేయాలని, గుడిలో కలుద్దామని సుమతి అంటుంది. ఇద్దరు బయలుదేరుతారు. మరోవైపు మనోజ్ అన్నమాటలు తలుచుకుంటుంది రోహిణి. విద్య మాట్లాడుతుంది. తన బాధ చెప్పుకుంటుంది. చిన్న అబద్ధాలే చెప్పాను. దాన్నే మోసం మోసం అని అంటారేంటని రోహిణి అంటుంది.

డబ్బుతో కొడతా

కన్నతల్లినే చంపేశావ్, కొడుకుని దాచేశావ్. ఇవి చిన్న అబద్ధాలా అని విద్య అంటుంది. అలా చెప్పేటప్పుడు నేనెంత కుమిలిపోయానో తెలుసా. మనోజ్ ప్రేమకోసమేగా అని రోహిణి అంటుంది. అమ్మ పాటే పాడుతున్నాడని రోహిణి చెబుతుంది. నాకు కూడా మనోజ్ దద్దమ్మలాగే కనిపిస్తున్నాడు. ఇలాగే ఉంటే మనోజ్ దూరమైపోతాడు. మళ్లీ వాళ్లే తిరిగి నన్ను షాపుకు రమ్మనేలా చేస్తాను అని రోహిణి అంటుంది.

ఆ తల్లికొడుకులకు డబ్బంటే ప్రాణం కదా. వాళ్లిద్దరిని ఆ డబ్బుతోనే కొడతాను. బిజినెస్‌ను వాడుకుని మనోజ్‌కి దగ్గరవుతాను. ఆ తర్వాత అత్తయ్య దగ్గరికి తీసుకునేలా చేస్తాను. డబ్బుతో ఆడుకోవాలంటే డబ్బు ఉండాల్సిన అవసరం లేదు తెలివితేటలు ఉంటే చాలు అని మరో ప్లాన్ వేస్తుంది రోహిణి. రాత్రి బాలు, మీనా పిల్లల గురించి మాట్లాడుకుంటారు.

మనకంటూ ఓ గది ఉన్నాకా, తర్వాత పిల్లలు. మనకు పుట్టబోయే పిల్లలను నానమ్మ ప్రేమగా చూసుకోవాలని మీనా అంటుంది. అది జరగని పని అని బాలు అంటాడు. మీ కోరికలు గుర్రాలు అవుతున్నాయి. అది తగ్గించడానికి మీ అమ్మ పేరు చెప్పానని మీనా అంటుంది. బాలు చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని మీనా అడుగుతుంది.

రేయ్ ఫ్రాడ్ ఫ్రెండ్ నువ్వా

ఒకరి గురించి వాడో వింత మనిషి అని బాలు అంటాడు. ఇంతలో బాలుకు అన్‌నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది. అలా కాల్స్ చేసి వీడియోలు అసభ్యంగా చేస్తున్నారని మీనా అంటుంది. నేను దేన్ని లెక్కచేయనని వీడియో కాల్ లిఫ్ట్ చేస్తాడు బాలు. రేయ్ ఫ్రాడ్ నువ్వా. నా చిన్ననాటి స్నేహితుడు అని మీనాకు చెబుతాడు బాలు.

మొన్ననే సెంట్రల్ జైల్ నుంచి వచ్చాను. ఇప్పుడు రాజమండ్రిలోనే ఉన్నానని అంటాడు అతను. మీనా షాక్ అవుతుంది. ఇంకా ఫ్రాడ్ పనులు ఆపలేదా అని బాలు అంటే.. ఐ డోంట్ లైక్స్ ఫ్రాడ్.. బట్ ఫ్రాడ్ లైక్స్ మీ. ఫ్రాడ్ పనులే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయని చెబుతాడు అతను. ఏదైనా కెరీర్‌లో పెద్ద పని దొరికితే ఇవన్ని ఆపేస్తాను. నాకో వర్క్ చూడరా అని అతను అంటాడు.

సరేనని బాలు చెబుతాడు. కాల్ కట్ చేసి ఇక పడుకుందామని మీనాను కంగారుపెడతాడు బాలు. తన ఫ్రెండ్ గురించి చెబుతాడు బాలు. తర్వాత మీనాతో పాలు ఎంగిలి చేయించి తాగుతాడు. దాంతో బాలుకు తొడిపాశం పెడుతుంది మీనా. మరుసటి రోజు ఒక పెద్ద డీల్ వచ్చిందని, చాలా లాభం వస్తుందని ప్రభావతితో మనోజ్ చెబుతాడు.

రోహిణి దొంగ డీల్ ప్లాన్

అదే విషయం అందరిముందు చెప్పాలని అందరితో గొప్పగా చెబుతుంది ప్రభావతి. ఆ డీల్ రోహిణి వల్లే వచ్చింది కాబట్టి రోహిణి షో రూమ్‌కి రావాల్సి ఉంటుందని మనోజ్ విన్నవించుకుంటాడు. ప్రభావతి ఆలోచనలో పడుతుంది. అయితే ఆ దొంగ డీల్ ప్లాన్‌ను బాలు సెంట్రల్ జైలు ఫ్రాడ్ ఫ్రెండ్‌తోనే రోహిణి చేయడం, అలా రోహిణి చేస్తున్న విషయం బాలుకు తెలియడం జరుగుతాయి. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe