Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ న్యూసెన్స్ చేయడంతో ఆటోలో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తారు పోలీసులు. దాంతో మణికంఠ తలపట్టుకుంటాడు.

మరోవైపు రోహిణిని అన్నం తినమని విద్య అంటుంది. నాకు వద్దని రోహిణి అంటుంది. ఖాళీ కడుపుతో యుద్ధాలు గెలవలేవు అని విద్య అంటే.. మనోజ్ తిన్నాడో లేదో అని రోహిణి అంటుంది. ఎప్పుడో తిని ఉంటాడని విద్య అంటుంది. మనోజ్‌కు ఫోన్ చేయమని విద్య అంటే.. తనే చేయాలని, తనకు ప్రేమ ఉంటే తనే వెతుక్కుంటూ వస్తాడని రోహిణి అంటుంది.
ఇగో ప్రేమలతో పని జరగదు
ఈ ఇగో ప్రేమలతో పని జరగదని విద్య అంటుంది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఏమవుతుంది, దూరమయ్యాకా కాల్ చేసుంటే బాగుండనిపిస్తుందని విద్య అంటుంది. నేను మనోజ్‌ను నిజంగానే ప్రేమించాను. ఏది ఏమైనా మనోజ్‌ను మాత్రం దూరం చేసుకోనని రోహిణి అంటుంది. ముందు తిను తర్వాత కాల్ చేయాలా వద్దా ఆలోచించు అని విద్య అంటుంది.
పోలీస్ స్టేషన్‌లో కింద కూర్చుని గోల చేస్తుంటాడు మనోజ్. నేను నెల్లూరి సీతారెడ్డితో మాట్లాడాలని రచ్చ చేస్తాడు. రోహిణి నన్ను మోసం చేసింది తెలుసా అని మనోజ్ అంటాడు. దాంతో అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రోహిణి గన్ పట్టుకొచ్చి మనోజ్‌ను కాలుస్తానంటుంది. ఈ గుండెల్లో కాల్చు రోహిణి, నువ్వే అక్కడున్నావ్. నువ్వే చచ్చిపోతావ్ అని మనోజ్ అంటాడు.
వీడు నా కాపురం కూల్చేలా ఉన్నాడు సర్ అని పోలీస్ రోహిణి అంటే తాగున్నాడని, పట్టించుకోకని అరుణ్ అంటాడు. ఇంతలో మనోజ్‌ను కొట్టిన పోలీస్ ఇదివరకు మనోజ్‌ను మూడు చెంపదెబ్బలు కొట్టిన విషయం చెబుతాడు. దాంతో అరుణ్ కూడా మనోజ్‌ను కొడతాడు. తను పెద్ద బిజినెస్ మ్యాన్ గొడవ చేస్తాడు మనోజ్. నా తమ్ముడు పెద్ద కరుడుగట్టిన రౌడీ. వాడికి ఫోన్ చేస్తే మీ అందరిని లోపల వేస్తాడని మనోజ్ అంటాడు.
మనోజ్‌ను కొట్టిన పోలీస్ రోహిణి
మనోజ్ ఇంకా వాగడంతో షర్ట్ విప్పి కూర్చోబెట్టమంటాడు అరుణ్. మనోజ్ షర్ట్ విప్పుతాడు. ఎందుకు చీట్ చేశావ్ రోహిణి అని మనోజ్ అనడంతో లేడి పోలీస్ తెగ కొడుతుంది. మరోవైపు సత్యం ఇంటికి వెళ్లి మనోజ్‌ను పోలీసులు తీసుకెళ్లారని చెబుతాడు. రోహిణి మోసం చేసింది, బారుకు రమ్మంది, మనోజ్ తాగింది, పోలీసులతో గొడవ పడింది, వాళ్లు తీసుకెళ్లింది మణికంఠ చెబుతాడు.
{{/usCountry}}మనోజ్ ఇంకా వాగడంతో షర్ట్ విప్పి కూర్చోబెట్టమంటాడు అరుణ్. మనోజ్ షర్ట్ విప్పుతాడు. ఎందుకు చీట్ చేశావ్ రోహిణి అని మనోజ్ అనడంతో లేడి పోలీస్ తెగ కొడుతుంది. మరోవైపు సత్యం ఇంటికి వెళ్లి మనోజ్‌ను పోలీసులు తీసుకెళ్లారని చెబుతాడు. రోహిణి మోసం చేసింది, బారుకు రమ్మంది, మనోజ్ తాగింది, పోలీసులతో గొడవ పడింది, వాళ్లు తీసుకెళ్లింది మణికంఠ చెబుతాడు.
{{/usCountry}}దాంతో బాలు, సత్యం పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు. మరోవైపు పోలీసుల జులుం నశించాలి, పోలీసులు డౌన్ డౌన్ అని మనోజ్ అరుస్తాడు. అరుణ్ లాఠీతో వచ్చి కొట్టబోతాడు. మీకు నా తమ్ముడే కరెక్ట్ అని మనోజ్ అంటాడు. పోలీస్ స్టేషన్‌లో మనోజ్ ఉన్న విధానం చూసి సత్యం, బాలు షాక్ అవుతారు. రోహిణి ఇక్కడే ఉందని మనోజ్ వాగుతాడు.
ఇంతలో బాలుకు తెలిసిన పోలీస్ వచ్చి అడిగితే వాడికి తాగుడు అలవాటు లేదని, ఇంట్లో సమస్య అని బాలు చెబుతాడు. అరుణ్ వస్తాడు. బాలు, అరుణ్ ఒకరినొకరు అనుకుంటారు. వాడు నీ అన్న అని ఇప్పుడే తెలిసింది. మీ ఇంట్లో అంతా ఇంతేనా అని అరుణ్ అంటాడు. మనోజ్ మనస్థాపంతో ఇలా చేశాడు. వాడు ఎప్పుడు తాగడు, ఎవరితో గొడవ పెట్టుకోడని సత్యం చెబుతాడు.
కోర్టుకు పంపిస్తే ఇంకోసారి చేయడు
నాకు అర్థమైంది సర్. నేను చాలా చెప్పి చూశాను. కానీ, వీడు బాగా ఓవర్ చేస్తున్నాడు. కేసు రాసి కోర్టుకు పంపిస్తే తప్ప ఇంకోసారి ఇలా చేయడని అరుణ్ అంటాడు. నేను సారీ మాత్రమే అడిగాను అని మనోజ్ అంటాడు. వాడు నిజంగానే అమాయకుడు. వాడి కెపాసిటీకి మించి తాగాడు. అందుకే ఇలా చేస్తున్నాడు. వదిలేస్తే తీసుకెళ్లిపోతామని బాలు అంటాడు.
కుదరదని అరుణ్ అంటాడు. మా లేడి కానిస్టేబుల్‌ని చాలా ఏడిపించాడని తెలిసిన కానిస్టేబుల్ అంటాడు. అలా చేయడని బాలు అంటే.. తనపేరు కూడా రోహిణి అని మణికంఠ చెబుతాడు. ఇవన్నీ చూస్తూ నేను ఎలా బతకాలిరా అని సత్యం ఏడుస్తూ అంటాడు. మీరు చూస్తే డీసెంట్‌గా ఉన్నారు. ఇలాంటి కొడుకులను కన్నారేంటీ సర్ అని అరుణ్ అంటాడు.
మా నాన్న జోలికి వెళ్లొద్దు అని బాలు అంటే.. రేయ్ నాకు సంస్కారం తెలుసురా. ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్లకిస్తాను. మీ అన్నయ్య మీద కేసు పెట్టాను. కోర్టుకెళ్లి తెచ్చుకో అని అరుణ్ కౌంటర్ ఇస్తాడు. రేయ్ బాలు నువ్వు అందరిని కొట్టరా. రోహిణి పారిపోయిందా అని మనోజ్ అంటాడు. మీ సీఐ గారు లేరా అని అడిగితే.. లేరు రేపొస్తారని వేరే కానిస్టేబుల్ చెబుతాడు.
సత్యం కన్నీళ్లకు కరిగిన అరుణ్, పోలీసులు
నువ్వు గొడవ చేస్తే వీడిని లోపల వేస్తానని అరుణ్ అనడంతో బాలును బయటకు వెళ్లమంటాడు సత్యం. బాలును మణికంఠ తీసుకెళ్తాడు. మనోజ్ గురించి చెప్పి వాడి వేదన గురించి సత్యం చెబుతాడు. ఇదంతా తట్టుకునే శక్తి తనకు లేదని సత్యం కన్నీళ్లు పెట్టుకుని మనోజ్ తరఫున సత్యం క్షమాపణ అడుగుతాడు. అదంతా చూసిన ఎస్సై అరుణ్‌ను పిలుస్తాడు.
ఆ తండ్రి బాధ చూడలేకపోతున్నా. పంపించేయ్ అని ఎస్సై అంటాడు. నేను అదే అనుకుంటున్నా అని అరుణ్ అంటాడు. దాంతో బాలుకు తెలిసిన కానిస్టేబుల్ షర్ట్ ఇచ్చి కేసు లేదు ఏది లేదు అలా బెదిరించారు అంతే అని చెబుతాడు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అని మనోజ్‌కు షర్ట్ వేసి తీసుకెళ్తాడు సత్యం. సారీ గురించి మనోజ్ అడిగితే.. నాకు చెప్పారని సత్యం అంటాడు.
బాలు వస్తాడు. రేయ్ నాన్నకు సారీ చెప్పారట. నువ్వు కొడతానని బెదిరించావా అని మనోజ్ అంటే.. అవునురా. నీ తప్పు లేదుగా అని బాలు అంటాడు. నువ్వు అప్పుడప్పుడు మంచోడివిరా అని మనోజ్ ముద్దు పెట్టుకున్నట్లు చేత్తో అంటాడు. మనోజ్‌ను తీసుకెళ్తాడు. లేడి కానిస్టేబుల్ రోహిణి అలాగే మనోజ్‌ను చూస్తుంది.
భర్త ఒప్పుకుంటే వెళ్తాను సర్
అతనికి తన భార్య మీదున్న ప్రేమ చూసి ఫిదా అయ్యాను సర్. ఎంత ప్రేమ ఉంటే అంతలా తాగి పిచ్చోడవుతాడు. ఆమె మోసం చేసి ఉండకూడదని కానిస్టేబుల్ రోహిణి అంటుంది. ఆమెకు బదులు నువ్వెళ్లు మరి అని మరో కానిస్టేబుల్ అంటే.. ఊరుకోండి సర్ మా ఆయన ఎక్కడ ఒప్పుకుంటాడు అని అంటుంది. భర్త ఒప్పుకుంటే మనోజ్‌తో వెళ్లేందుకు కానిస్టేబుల్ రోహిణి రెడీనే అన్నట్లు చెబుతుంది.
మనోజ్‌ను ఇంటికి తీసుకెళ్తారు. నేను బ్యాచిలర్‌ని ఇక ఫ్రీ బర్డ్‌ని అని మనోజ్ అంటాడు. ఇంట్లో కూడా పోలీస్ స్టేషన్‌లో కూర్చున్నట్లు కూర్చుంటాడు. లేపి కుర్చీలో కర్చొబెడతారు. సోఫా కింద మనోజ్ వెతికితే.. అమ్మ కోసం అని మనోజ్ అంటాడు. మీనా వచ్చి కేసు లేకుండా బయటపడ్డారు సంతోషం అని అంటుంది. మనోజ్‌ను తన గదిలో పడుకోబెడతాడు బాలు.
రోహిణి అబద్ధాల గురించే మనోజ్ వాగుతూనే ఉంటాడు. సత్యం తలపట్టుకుని కూర్చుంటాడు. నా కుటుంబం ముక్కలు అయిపోతున్నట్లు భయంగా ఉందని, పడుకుంటే నిద్ర రావట్లేదు. శాశ్వతంగా పడుకుంటే తప్పా మనశ్శాంతి దొరకదని చచ్చిపోతే బాగుండు అన్నట్లుగా అంటాడు సత్యం. అన్ని సమస్యలకు పరిష్కారం కావాలంటే మా అమ్మ రావాలని సత్యం అంటాడు.
సుశీల ఎంట్రీ
నేను కూడా అదే అనుకున్నా అని బాలు అంటాడు. నేను వెళ్లి తీసుకొస్తానని సత్యం వెళ్లిపోతాడు. అంటే సుశీల ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. అర్ధరాత్రి మనోజ్ లేచి రోహిణి చేసిన మోసం గురించి ఏడుస్తాడు. గుండె పగిలిపోతుంది తెలుసా, జీవితం మీద ఆశ చచ్చిపోయిందని కుమిలి కుమిలి ఏడుస్తాడు మనోజ్. కిందకు వెళ్లి అమ్మా అని పిలుస్తాడు. అత్తయ్య ఇంట్లో లేరని మీనా అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.