Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ప్రభావతి, మనోజ్ డైట్ ఫుడ్‌లో శ్రుతి ఆముదం కలుపుతుంది. అది ఇద్దరు తింటారు. రాత్రి మనోజ్ కడుపులో గుడగుడలు మొదలవుతాయి. అవి విన్న రోహిణి నిద్ర లేచి మనోజ్‌ను లేపుతుంది.
మనోజ్ గుడగుడ సమస్య

నీ కడుపులో చెరువు గట్టు తెగినట్లు సౌండ్ వస్తోందని రోహిణి అంటుంది. అవును అని, ఏదో అవుతుందని బాత్రూమ్‌కు పరుగెత్తుతాడు మనోజ్. లూస్ మోషన్స్‌తో బాత్రూమ్‌కు వెళ్తూ వస్తూనే ఉంటాడు మనోజ్. చూసి చూసి రోహిణి పడుకుంటుంది. ఇక నా వల్ల కాదని హాల్లోకి వెళ్లిపోతాడు మనోజ్. మరోవైపు ప్రభావతికి కూడా గుడగుడలు మొదలవుతాయి.
సత్యం విని లేపుతాడు. నీ పొట్టలోనుంచి శబ్ధాలు వస్తున్నాయని సత్యం అంటాడు. గట్టు తెగింది గోదావరికి కాదు నాకు అని మనోజ్ లాగే ప్రభావతి బాత్రూమ్‌కు పరుగెత్తుతుంది. సత్యం కూడా చూసి చూసి పడుకుంటాడు. చేసేది లేక ప్రభావతి కూడా హాల్లోకి వస్తుంది. ఏరులై పారుతుందని, జలపాతం పారుతున్నట్లుందని ఇద్దరు మాట్లాడుకుంటారు.
ఇంతలో బాలు దొంగ దొంగ అనుకుంటూ హాల్లోకి వస్తాడు. దాంతో అందరూ హాల్లోకి వస్తారు. వచ్చింది దొంగలు కాదు, తిప్పలు అని ప్రభావతి అంటుంది. గుడ గుడ సౌండ్ విని ఎక్కడో వాటర్ లీకేజ్ అవుతుందని బాలు అంటాడు. తమ ఇద్దరికి లూస్ మోషన్స్ అవుతుందని, పేగులు మెలిపెట్టి తిప్పుతుందని మనోజ్, ప్రభావతి అంటారు.
తల్లికొడుకుల బాత్రూమ్ కష్టాలు
అందరూ చూస్తుండగానే మళ్లీ బాత్రూమ్లోకి పరుగెత్తుతారు. వాళ్లు చెప్పిన డైట్ చేసినట్లుగా మీనా చెబుతుంది. మొదటి రోజుగా అరగనట్టుందని రోహిణి అంటుంది. ట్యాంక్‌లో నీళ్లు అయిపోయాయనని మనోజ్ అంటాడు. బాలు చాలా మెల్లిగా వెళ్లి మోటర్ ఆన్ చేస్తాడు. ప్రభావతి, మనోజ్ ఇద్దరు అవస్థలు పడతారు. వారి ఇద్దరికి ప్లంబర్‌ను తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తానంటాడు బాలు.
{{/usCountry}}అందరూ చూస్తుండగానే మళ్లీ బాత్రూమ్లోకి పరుగెత్తుతారు. వాళ్లు చెప్పిన డైట్ చేసినట్లుగా మీనా చెబుతుంది. మొదటి రోజుగా అరగనట్టుందని రోహిణి అంటుంది. ట్యాంక్‌లో నీళ్లు అయిపోయాయనని మనోజ్ అంటాడు. బాలు చాలా మెల్లిగా వెళ్లి మోటర్ ఆన్ చేస్తాడు. ప్రభావతి, మనోజ్ ఇద్దరు అవస్థలు పడతారు. వారి ఇద్దరికి ప్లంబర్‌ను తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తానంటాడు బాలు.
{{/usCountry}}వీళ్లు తెల్లారేదాకా బతికి ఉంటారా అని సత్యం అంటాడు. వంటింటి చిట్కా ఏదోటి ఉండే ఉంటుంది. మా అమ్మని అడిగి చేస్తానని మీనా కిచెన్‌లోకి వెళ్తుంది. శ్రుతి కూడా వెళ్తుంది. ప్రభావతి, మనోజ్‌కి అలా జరగడానికి కారణం నేను. డైట్ పుడ్‌లో ఆముదం కలిపాను. చింతామణితో చేతులు కలిపిందని కోపంతో చేశాను అని శ్రుతి అంటుంది.
కొంచెం అయితే ప్రాణాలు పోయేవి. ఇంకెవరికి చెప్పకు. ఆముదం తాగితే కడుపు అంతా ఖాళీ అయిపోతుందని మీనా అంటుంది. తల్లి పార్వతికి కాల్ చేసి చిట్కా తెలుసుకుని అది చేస్తుంది మీనా. నువ్వు ఏకంగా పైకి పంపించే ప్లాన్ వేశావ్. నువ్వు ఎవరికి చెప్పకు ఇదంతా డైట్ ప్లాన్‌పైన తోసేద్దాం అని మీనా అంటుంది. ప్రభావతి, మనోజ్‌కు వంటింటి చిట్కాతో చేసింది ఇస్తుంది మీనా.
చచ్చి బతికిన ప్రభావతి, మనోజ్- కాపాడిన మీనాపై నిందలు
ఇద్దరు తాగుతారు అది. ఇద్దరు శబ్ధం తగ్గిందని అంటారు. మీనా వల్లే తగ్గిందని సత్యం అంటే.. మాకు మోషన్స్ కావడానికి కారణం మీనానే అని, మా డైట్ ఫుడ్‌లో ఏదో కలిపిందని మీనాను నిందిస్తుంది ప్రభావతి. మీకు అసలు బుద్ధుందా. కాస్తా ఎనర్జీ రాగానే మీ బుద్ధి చూపించారు. మీకు అసలు అంటూ అత్తపై తెగ ఫైర్ అవుతుంది శ్రుతి.
చావు నుంచి తప్పిస్తే ఎన్నేనా మాట్లాడుతారని బాలు అంటాడు. తినింది హెల్తీ ఫుడ్డే కదా. ఏదో కలిపితేనే ఇలా అవుతుందని మనోజ్ అంటాడు. ఆ కలిపారు. ల్యాబ్‌లో టెస్ట్ చేయించండి. బుర్ర బుద్ధి జ్ఞానం ఏవి లేవు అని మనోజ్‌పై కూడా అరుస్తుంది శ్రుతి. మీరిద్దరు ఇక జన్మలో మారరా. మీరు ఏదోనా స్పెషల్ చేయమనండి అప్పుడు చెబుతాను అని మీనా కూడా ఫైర్ అవుతుంది.
ఇక నుంచి డైట్ లేదు ఏం లేదని సత్యం అంటాడు. రవి కూడా అంటాడు. ఇంక ఎంతమంది అంటారని రోహిణి అంటే.. మధ్యలో నీ సన్నాయి నొక్కులు ఏంటీ. మీ ఆయనకు డైట్ ప్రిపేర్ చేయకుండా తప్పించుకున్నావ్ కదా. నీకు మాట్లాడే హక్కే లేదు అని మీనా విరుచుకుపడుతుంది. మీ ఇద్దరి మోహానికి డైట్ అవసరమా అని బాలు తిట్టి పంపించేస్తాడు.
గుడికి అరుణ్, తల్లి
ఇంకోసారి అంటే ఆముదం పోస్తానని శ్రుతి అంటే.. మీనా నోరుమూసి పట్టుకెళ్తుంది. సత్యం నవ్వుతాడు. మరోవైపు సుమతి పూల షాపుకి తల్లితో అరుణ్ వెళ్తాడు. సుమతి గురించి పార్వతికి గొప్పగా చెబుతుంది అరుణ్ తల్లి. సుమతిని అరుణ్ ప్రేమగా చూడటం పార్వతి గమనిస్తుంది. పార్వతి పూలు కట్టి ఇస్తుంది. డబ్బులు వద్దంటుంది.
సుమతిని అర్చన జరిపించమని చెప్పి పంపిస్తుంది పార్వతి. అప్పుడే అక్కడికి బాలు, మీనా కూడా వస్తారు. డెకరేషన్‌కి ఆర్డర్స్ బాగా వస్తున్నాయి, మనుషులు దూరంగా ఉండటం వల్ల ఇబ్బంది అవుతుంది. నువ్వే ఒక మనిషిని పెట్టుకుని నువ్వే ఆర్డర్లు తీసుకుని పూలు సప్లై చేయమ్మా అని మీనా అంటుంది. సరేనని పార్వతి అంటుంది.
సుమతి గురించి అడిగితే జరిగింది చెబుతుంది పార్వతి. బాలుతో సుమతికి మంచి సంబంధం చూడమని పార్వతి అడుగుతుంది. బాలు, మీనా గుళ్లోకి వెళ్తారు. సుమతి అర్చన చేపిస్తుంది. అక్కా చెల్లెళ్ల గురించి పంతులు గొప్పగా చెబుతాడు. మరోవైపు బాలు, మీనా ఎవరితోనో మాట్లాడుతుంటారు. సుమతి వాళ్లు వెళ్లిపోయాక అమ్మవారి దగ్గరికి బాలు, మీనా వస్తారు.
పెళ్లి చేసుకుంటానన్న పోలీస్
సుమతి ప్రసాదం తీసుకొస్తానని అంటే.. అరుణ్ కూడా వస్తానని చెబుతాడు. అన్నింటికి థ్యాంక్స్ చెబుతాడు అరుణ్. మా అమ్మ పెళ్లి చేసుకోమ్మని గొడవ చేస్తుంది. నాకు నచ్చిన అమ్మాయి దొరికింది. నా ఎదురుగానే ఉంది. అది మీరే అని సుమతికి మ్యారేజ్ ప్రపోజ్ చేస్తాడు అరుణ్. నువ్వు ఒప్పుకుంటే మన పెళ్లి జరుగుతుందని అరుణ్ అంటాడు.
ఇంతలో నేను ఒప్పుకోను అని బాలు గట్టిగా అరుస్తాడు. ఎందుకు అని మీనా అంటే.. నేనుండగా హుండీలో నువ్వు డబ్బు వేయడం ఒప్పుకోను అని బాలునే డబ్బులు వేయబోతాడు. పర్స్ ఖాళీ అని చెబుతాడు. సరే అప్పుగా ఇస్తాను, తర్వాత ఇవ్వండని మీనా డబ్బు ఇస్తుంది. బాలు హుండీలో డబ్బు వేస్తాడు.
మరోవైపు నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని, మా తమ్ముడు చదువుకుని ఉద్యోగం వచ్చే వరకు చేసుకోను. మా అమ్మను చూసుకోవాలని సుమతి అంటుంది. పెళ్లి అయ్యాక కూడా చూసుకోవచ్చు. బాగా ఆలోచించుకునే మీ నిర్ణయం చెప్పండని అరుణ్ అంటాడు. ఫోన్ రావడంతో అరుణ్ వెళ్లిపోతాడు. సుమతిని మీనా, బాలు కలుస్తారు.
ఇన్‌డైరెక్ట్‌గా ఒప్పుకున్న బాలు
నీకు వచ్చే మొగుడు నాకన్నా బాగా చదువుకున్నవాడు, మంచి ఉద్యోగం చేసేవాడు రావాలని కోరుకున్నా అని బాలు అంటాడు. మొన్న హాస్పిటల్‌లో కలిసిన వాళ్లు వచ్చారని, పరిచయం చేస్తానని సుమతి అంటుంది. టైమ్ లేదని మీనా అంటుంది. ఆమెకు పెళ్లి చేసే కొడుకు ఉన్నాడో అడుగు పెళ్లి చేద్దామని బాలు ఇన్‌డైరెక్ట్‌గా అరుణ్ పెళ్లికి ఒప్పుకుంటాడు.
అరుణ్ తల్లికి సుమతి ప్రసాదం ఇస్తుంది. సీఐ రమ్మన్నారని అరుణ్ వెళ్తానంటే.. తల్లిని ఆటో ఎక్కిస్తానని సుమతి అంటుంది. ఇంతలో బారు కారు ముందు వైపు ఒకతని బైక్ పార్క్ చేస్తాడు. వెనుకాల అరుణ్ బైక్ ఉంటుంది. అప్పుడే అరుణ్ బైక్ తీస్తుంటాడు. అరుణ్ బైక్ వైపు కారు వస్తుంది. ఏయ్ అని అరుణ్ అరుస్తాడు. బాలు కారు దిగుతాడు.
బాలు, అరుణ్ కోపంగా చూసుకుంటారు. నీకు త్వరగానే ఉద్యోగం వచ్చిందే, ఆరు నెలలు అయిన పోతుందనుకున్నా అని బాలు అంటాడు. నీకోసమే ఈ డ్రెస్ నా మీదకు వచ్చింది. కనీసం నిన్ను 6 నెలలు జైల్లో ఉంచే కేసులో బుక్ చేయాలన్నదే నా కోరిక. ఇకనుంచి అడుగడుగునా జాగ్రత్తగా ఉండు అని అరుణ్ అంటాడు.
బాలుతో గొడవ
ఈ యూనిఫామ్ మళ్లీ ఊడిపోకుండా కాపాడుకో అని బాలు మీదకు వెళ్తాడు. మీనా ఆపుతుంది. నిన్ను వదలనురా అని అరుణ్ అంటాడు. బాలును మీనా తీసుకెళ్లిపోతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.