Gunde Ninda Gudi Gantalu Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో పెద్ద ట్విస్టే ఎదురైంది. అది అటు తిరిగి ఇటు తిరిగి రోహిణి మెడకు చుట్టుకునేలా ఉంది. కామాక్షి నగలతో సుందరి ఉడాయించడం, ఆ అబ్బాయి మటన్ కొట్టు మాణిక్యం అల్లుడే కావడం ఇక్కడ అసలు ట్విస్ట్.
అత్తకు మీనా, శృతి మాటకు మాట

బాలు స్టార్ట్ చేసిన డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి మీనా చెక్కు రాసే సీన్ తో సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రారంభమైంది. ప్రభావతి దెప్పిపొడవడంతో మీనా, శృతి ఆమెకు తమదైన స్టైల్లో గడ్డి పెడతారు. అటు రోహిణి, మనోజ్ లకు కూడా తలంటు పడుతుంది. దీంతో ఏం మాట్లాడాలో తెలియక అందరూ బిక్కమొహాలు వేస్తారు.
మనోజ్‌ను చితకబాదిన రోహిణి
రూమ్ లోకి వెళ్లగానే మనోజ్ ను రోహిణికి చితకబాదుతుంది. ఇంటికి తగిలించిన అతని డిగ్రీలు ఉన్న నేమ్ బోర్డుతో కొడుతుంది. ఇన్ని డిగ్రీలు చదివి ఏం లాభం.. ఇంత కూడా ముందు జాగ్రత్త, తెలివి లేదు.. జీఎస్టీ కట్టాలని తెలియదా.. రూ.3 లక్షలు అప్పు అయింది అంటూ రోహిణి రెచ్చిపోతుంది. నీకంటే బాలు చాలా నయం.. చదువుకోకపోయినా అన్నింట్లోనూ జాగ్రత్తగా ఉంటాడు అని కూడా అంటుంది. దీంతో మనోజ్ లబోదిబోమంటాడు.
సుమతికి ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీస్ అరుణ్
మరోవైపు రోడ్డుపై స్కూటీపై వెళ్తున్న సుమతిని ట్రాఫిక్ పోలీస్ అరుణ్ ఆపుతాడు. హెల్మెట్ ఏదంటూ ప్రశ్నిస్తాడు. నేను మీకు తెలుసు కదా.. హాస్పిటల్లో కలిశాను.. మీ అమ్మగారికి ఎలా ఉంది అంటూ సుమతి అడుగుతుంది.
బాగానే ఉంది కానీ.. తెలిసిన వాళ్లయినా నేను డ్యూటీలో ఉన్నప్పుడు పట్టించుకోను.. ఫైన్ కట్టాల్సిందే అని అరుణ్ అంటాడు. రూ.1000 కట్టమంటాడు. అన్ని డబ్బులా అని సుమతి అంటే.. నేనే కడతాను అని అరుణ్ అంటాడు. అవసరం లేదు.. నేనే కడతానంటూ సుమతి డబ్బులు ఇచ్చి వెళ్లిపోతుంది. డ్యూటీలో ఉంటే సార్ వాళ్ల అమ్మగారికి కూడా ఓసారి ఫైన్ వేశాడని పక్కనే ఉన్న కానిస్టేబుల్ చెబుతాడు.
సుందరికి కామాక్షి నగలు.. ఇంటికి సత్యం, ప్రభావతి, బాలు, మీనా
{{/usCountry}}బాగానే ఉంది కానీ.. తెలిసిన వాళ్లయినా నేను డ్యూటీలో ఉన్నప్పుడు పట్టించుకోను.. ఫైన్ కట్టాల్సిందే అని అరుణ్ అంటాడు. రూ.1000 కట్టమంటాడు. అన్ని డబ్బులా అని సుమతి అంటే.. నేనే కడతాను అని అరుణ్ అంటాడు. అవసరం లేదు.. నేనే కడతానంటూ సుమతి డబ్బులు ఇచ్చి వెళ్లిపోతుంది. డ్యూటీలో ఉంటే సార్ వాళ్ల అమ్మగారికి కూడా ఓసారి ఫైన్ వేశాడని పక్కనే ఉన్న కానిస్టేబుల్ చెబుతాడు.
సుందరికి కామాక్షి నగలు.. ఇంటికి సత్యం, ప్రభావతి, బాలు, మీనా
{{/usCountry}}ఇటు సుందరిని పెళ్లి చూపుల కోసం కామాక్షి రెడీ చేస్తుంది. తన నగలన్నీ ఆమెకు వేస్తుంది. వాటిని ఎలా కొన్నానో కూడా ఆమెకు చెబుతుంది. ఆ నగలు చూసి సుందరి మురిసిపోతుంది. అప్పుడే ఇంటికి సత్యం, ప్రభావతి, బాలు, మీనా వస్తారు. సుందరి రెడీ అయిందా.. ఓసారి పంపిస్తే రిహార్సల్ చేస్తానని బాలు సరదాగా అంటాడు. రెడీ అయితే వెళ్లి తీసుకురా అని కామాక్షిని పంపిస్తాడు రంగా.
కామాక్షి బంగారంతో ఉడాయించిన సుందరి
లోనికి వెళ్లిన కామాక్షి అక్కడ ఓ లెటర్ ఉండటం చూసి గట్టిగా అరుస్తుంది. నాకీ సంబంధం ఇష్టం లేదు.. మరో అబ్బాయిని ప్రేమించాను.. నాకోసం వెతకొద్దు అని అందులో రాసి ఉంటుంది.
తన నగలన్నీ తీసుకొని సుందరి ఉడాయించిందని కామాక్షి లబోదిబోమని ఏడుస్తుంది. పెళ్లి చూపులకు ముందు అమ్మాయి పారిపోయిందని తెలిస్తే పరువు పోతుందని రంగా భయపడుతుంటే.. కామాక్షి మాత్రం తన నగలు పోయాయని ఏడుస్తుంది.
సుందరిని వెతుక్కుంటూ హాస్టల్‌కు బాలు, మీనా
ఏమీ భయపడొద్దని, సుందరిని తాను వెతికి పట్టుకొస్తానని మీనాను తీసుకొని వెళ్తాడు బాలు. ఎక్కడని వెతుకుతామని మీనా అంటే ఆమెను నేరుగా సుందరి హాస్టల్ కు తీసుకెళ్తాడు బాలు. అక్కడ ఆమె రూమ్మేట్ స్వప్నను పిలిపిస్తాడు. సుందరి గురించి వివరాలు అడిగితే మొదట ఆమె చెప్పదు. కానీ మీనా రంగంలోకి దిగి సార్ సీఐడీ నుంచి వచ్చాడు.. చెప్పకపోతే నిన్ను సీఐడీ ఆఫీసుకు తీసుకెళ్తాడని బెదిరిస్తుంది.
మాణిక్యం అక్క కొడుకుతోనే సుందరి జంప్
ఇటు సీరియల్లో పెద్ద ట్విస్ట్ వస్తుంది. సుందరి లేచిపోయింది మటన్ కొట్టు మాణిక్యం అక్కడ కొడుకుతోనే అని తేలుతుంది. అబ్బాయి పారిపోవడంతో ఆ తల్లిదండ్రులు కూడా బాధపడుతుంటే మాణిక్యం వచ్చి ఓదారుస్తాడు. అమ్మాయి పెదనాన్నకు సంబంధించిన వివరాలు ఉన్నాయని అబ్బాయి తల్లి చెబుతుంది.
తాను వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకుంటానని మాణిక్యం చెబుతాడు. అయితే బాలుకి సంబంధం ఉన్న అమ్మాయితోనే తన అల్లుడు లేచిపోయాడని అప్పుడు మాణిక్యానికి తెలియదు. ఇది తర్వాతి ఎపిసోడ్లలో ఎలాంటి ట్విస్ట్ ఇస్తుంది.. రోహిణిని ఎలా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందన్నది తేలనుంది.
కిశోర్ వివరాలు బాలుకి చెప్పిన స్వప్న
మరోవైపు మీనా బెదిరింపులకు భయపడిన స్వప్న ఆ అబ్బాయి వివరాలు చెబుతుంది. అబ్బాయి పేరు కిశోర్ అని, ప్రస్తుతం వాళ్లు ఓ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారని వెల్లడిస్తుంది. ఆ వివరాలతో కామాక్షి ఇంటికి వెళ్తారు బాలు, మీనా. అక్కడ కామాక్షి వెంట పడి కొడుతుంటాడు రంగా. ఆ అబ్బాయితో రోజూ ఫోన్ లో సుందరి మాట్లాడే విషయం ముందే తెలిసినా చెప్పలేదని రంగా అంటాడు. అమ్మాయి ఎక్కడ ఉందో తెలిసిందని బాలు, మీనా చెబుతారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.