Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్‌లో శివకు జరిగిన అవమానంతోనే దొంగతనం చేశాడని, వాడికి డబ్బు మీద వ్యామోహం లేదని, అమ్మే విషయాన్ని పెద్దది చేసిందని తండ్రి సత్యంకు బాలు చెబుతాడు. అంతా విన్న సత్యం సైలెంట్‌గా ఉంటాడు. మనోజ్, రోహిణి శివను అంటే బాలు సపోర్ట్ చేస్తాడు.
నాకెందుకు శిక్ష

నేరం చేసిన వాడికి శిక్ష పడాలి, కానీ శిక్ష పడిన ప్రతివాడు నేరస్థుడు కాదు. వాడు చెడు సావాసాలతో బైక్ దొంగతనం చేశాడు. దానికి మా నాన్న చనిపోయాడు. గుణపాటం చెప్పాలని మళ్లీ దొంగతనం చేశాడు. ఈసారి శిక్ష నాకు పడింది. అది నేను చేసిన తప్పా, నాకు ఏది తెలియదు, తెలిసి నేను ఏది దాచలేదు, నాకెందుకు శిక్ష వేస్తున్నారు అని ఏడుస్తూ మీనా చెప్పుకుంటుంది.
ఇంతలో పోలీసులు వచ్చి దొంగతనం ఇంటి సమస్య శివపై కేసు వేయకుండా చూసుకుంటానని బాలు చెప్పాడని చెబుతారు. బాగా వైరల్ కావడంతో మీకు పైనుంచి ఒత్తిడి వస్తుంది. అందుకే మీ నుంచి కేసు లేదని ఒక లెటర్ తీసుకురమ్మని మా సర్ చెప్పారని కానిస్టేబుల్స్ చెబుతారు. దొంగతనం చేసినవాడు నాకు తెలియదు. వాడు కొట్టేశాడు. నేను కంప్లైంట్ రాసి ఇస్తాను. అలా చేయకుంటే కోపంతో వాడు నా గొంతు పిసికి చంపేస్తాడేమోనే అని ప్రభావతి అంటుంది.
బాలు, మీనా వద్దని వేడుకుంటారు. చిన్న పిల్లాడమ్మా, వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని బాలు అంటాడు. అయినా ప్రభావతి వినదు. కంప్లైంట్ రాసి ఇస్తుంది. అది తీసుకుని పోలీసులు వెళ్లిపోతారు. మీనా ఏడుస్తుంటుంది. ఎంత పని చేశావమ్మా. శివకు నేను ఎప్పుడో శిక్ష వేశాను. వాడు దొంగతనం చేశాడనే చేయి విరగ్గొట్టాను అని బాలు నిజం చెబుతాడు. సరే వాడి సంగతి నేను చూసుకుంటాను అని మీనాను లోపలికి వెళ్లిపోమంటాడు బాలు.
ఇంట్లోంచి వెళ్లిపోయిన ప్రభావతి
ఆగు ఇది నా ఇల్లు. ఇంట్లోకి వెళ్లేందుకు నేను ఒప్పుకోను అని ప్రభావతి అంటుంది. ఎందుకు ఒప్పుకోదు. నీ కొడుకు దొంగతనం చేశాడు. మరి నిన్ను నేను గెంటేయలేదే. ప్రతిసారి నా ఇల్లు అనకు. ఇది నా ఇల్లు. అలా ఒప్పుకుంటేనే ఇంట్లో ఉండనిస్తాను అని సత్యం మీనాకు సపోర్ట్ చేస్తూ ప్రభావతికి ఎదురుతిరుగుతాడు. దీనికోసం నన్ను గెంటేస్తారా. అది ఇంట్లో ఉండేందుకు వీళ్లేదని ప్రభావతి అంటుంది.
{{/usCountry}}ఆగు ఇది నా ఇల్లు. ఇంట్లోకి వెళ్లేందుకు నేను ఒప్పుకోను అని ప్రభావతి అంటుంది. ఎందుకు ఒప్పుకోదు. నీ కొడుకు దొంగతనం చేశాడు. మరి నిన్ను నేను గెంటేయలేదే. ప్రతిసారి నా ఇల్లు అనకు. ఇది నా ఇల్లు. అలా ఒప్పుకుంటేనే ఇంట్లో ఉండనిస్తాను అని సత్యం మీనాకు సపోర్ట్ చేస్తూ ప్రభావతికి ఎదురుతిరుగుతాడు. దీనికోసం నన్ను గెంటేస్తారా. అది ఇంట్లో ఉండేందుకు వీళ్లేదని ప్రభావతి అంటుంది.
{{/usCountry}}అది నీకు హక్కు లేదు. శివపై కంప్లైంట్ ఇచ్చే రైట్ ఉంది. కానీ, తనను రావద్దనే హక్కు లేదు. మీనా నా కోడలు. ఇంట్లోనే ఉంటుందని సత్యం అంటాడు. అది ఇంట్లో ఉంటే నేను ఇంట్లో ఉండనని ప్రభావతి అంటే.. అది నీ ఇష్టమని సత్యం అంటాడు. దాంతో పైకి వెళ్లి లగేజ్ తీసుకొచ్చుకుంటుంది ప్రభావతి. నాకన్నా దొంగోడి అక్క ఎక్కువైంది కదా అని లగేజ్‌తో సహా ఇంటి నుంచి వెళ్లిపోతుంది ప్రభావతి.
కామాక్షి ఇంటికి వెళ్తుంది ప్రభావతి. అయ్యయ్యో ఇంట్లోంచి గెంటేశారా. మీనాను గెంటేద్దామనుకుంటే నిన్నే గెంటేశారా. ఇప్పుడు నలుగురు స్టూడెంట్స్‌తో ఎలా బతుకుతావ్ అని కామాక్షి అంటుంది. దాంతో జరిగింది చెబుతుంది ప్రభావతి. గొప్పింటి కోడళ్లు అంటూ శ్రుతి, రోహిణి గురించి మాట్లాడుతుంది ప్రభావతి. వాళ్లు నువ్వు మూలన పడితే తొంగి కూడా చూడరు. నువ్వు గట్టిగా ఉన్నావ్ కాబట్టి సరిపోయింది లేకపోతే వాళ్లు ఎప్పుడో వేరు కాపురం పెట్టేసేవారు అని కామాక్షి అంటుంది.
మనిద్దరం వెళ్లిపోదామా
మీనా అలా కాదు. అందరు కలిసి ఉండాలని చూస్తుంది. అలాంటి మీనానే పంపించాలనుకున్నావ్ దేవుడు నిన్నే పంపించాడు అని కామాక్షి అంటుంది. మరోవైపు రాత్రి జరిగింది అంతా తలుచుకుని మీనా పడుకుని ఏడుస్తుంది. బాలు ఓదారుస్తాడు. అత్తయ్య ఎందుకు వెళ్లిపోవాలి, జరిగింది సరిపోలేదా అని మీనా అంటుంది. అమ్మావతి గురించి తెలిసి మరి పట్టించుకుంటున్నావా మీనావతి అని బాలు అంటాడు.
మావయ్య కూడా ఏం మాట్లాడలేకపోయారని మీనా అంటే.. నాన్న ఎప్పుడు న్యాయం వైపే నిలబడతారని బాలు అంటాడు. ఓ పని చేద్దామా. మనిద్దరం ఇంట్లోంచి వెళ్లిపోదామా. మనం ఇక్కడ ఉంటే గొడవలు అవుతాయి అని మీనా అంటుంది. ఇలా ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. ఏం కాదు అని బాలు నచ్చజెప్పుతాడు. ఇంట్లో నాన్న కోసం ఉంటున్నాను, ఆయనకు అండగా ఉండాలన్నదే కొడుకుగా నా ధర్మం అని బాలు అంటాడు.
మరుసటి రోజు ఉదయం శ్రుతి తల్లి శోభన వస్తుంది. కాస్తా దూరం రుద్ది వెళ్లిపోదామని శోభన అనుకుంటుంది. ఇంతలో రోహిణి వస్తుంది. ప్రభావతి అలిగి వెళ్లిపోయినట్లు చెబుతుంది. శివ గురించి నానా మాటలు అంటుంది శోభన. మీనా వస్తే ఆవిడకు నీళ్లు ఇవ్వమంటుంది రోహిణి. ఇప్పటివరకు ఇంటి విషయాలు బాగా చెబుతున్నావా. ఆవిడ దాహం తీరే ఉంటుందని మీనా సెటైర్లు వేస్తుంది.
శోభనపై సెటైర్లు
మీనాను ఇంట్లో ఉండనివ్వడం గురించి శోభన అంటే.. అందుకే ప్రభావతి అలిగి వెళ్లిపోయిందని రోహిణి చెబుతుంది. ఇంతలో బాలు వచ్చి మళ్లీ ఎన్ని లక్షల చెక్ తెచ్చారు. చెక్కులు పట్టుకుని ఇంటింటికి తిరుగుతారు కదా అని సెటైర్లు వేశాడు. రోహిణి తండ్రి జైలు గురించి చెప్పిందా అని బాలు అంటే.. తెలియదని శోభన అంటుంది. మీ ఆయన కూడా బల్ల కింద చేతులు బాగా పెడతారట కదా. ఓసారి సస్పెండ్ కూడా అయ్యారట గానీ వాళ్ల తప్పులను ఎత్తి చూపుతాడు బాలు.
రిటైర్ అయ్యే సమయంలో నాలాంటి వాడి చేతిలో పడి రోహిణి తండ్రిలాగే జైల్లో పడి చిప్పకూడు తినాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండమనండని హెచ్చరిస్తాడు బాలు. ఇలా పనిగట్టుకుని వచ్చి అనే బేవర్స్ బ్యాచ్ మా సర్కిల్‌లో లేదని గట్టిగా ఇస్తాడు బాలు. రోహిణి, శోభనను ఇద్దరిని కలిపి మీనా కూడా ఇచ్చిపడేస్తుంది. లంచగొండి కూతురుని చేసుకున్నందుకు మిమ్మల్ని కూడా ఉంటారుగా అని బాలు అంటాడు.
మీ ముందే ఇలా అంటున్నాడు అని శోభన అంటే.. అందరు నా ముందే అంటున్నారు. వింటున్నా. శ్రుతి పైన ఉంది వెళ్లండని ముందు చెప్పినప్పుడే గౌరవం దక్కేదిగా అని సత్యం అంటాడు. దాంతో శోభన పైకి వెళ్తుంది. ఇంటి గుట్టు ఎవరైనా చెబుతారా, నేను చెబుతానని ఎలా అనుకున్నావ్, నీ భర్త లాగే నాకు ఇంగిత జ్ఞానం లేదనుకున్నావా, అసలు మెదడే లేదనుకున్నావా అని రోహిణిని మందలిస్తాడు సత్యం.
మీ ఇల్లు మాకివ్వండి
దాంతో ఫోన్ చూసుకుంటూ రోహిణి బయటకు వెళ్తుంది. శ్రుతి దగ్గరికి వెళ్లి బంధువులు నానా మాటలు అంటున్నారని శోభన అంటుంది. దాంతో శ్రుతి సెటైర్లు వేస్తుంది. మీరు మా ఇంటికి రండని శోభన అంటే.. సరే వస్తాం. కానీ మేము వస్తే ఇల్లరికం అల్లుడు అంటారు. మీ ఇల్లు మాకి ఇచ్చి మీరు వేరేచోట ఉండండి అని షాక్ ఇస్తాడు రవి. శోభనకు రవి, శ్రుతి ఇద్దరు మాటలతో దుమ్ముదులుపుతారు.
మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని రవి అంటాడు. మీరు నన్ను అవమానిస్తున్నారని వెళ్లిపోతుంది శోభన. మీనాకు సుమతి కాల్ చేసి శివ వచ్చేవరకు అమ్మను పోలీస్ స్టేషన్‌లో ఉంచారని చెబుతుంది. దాంతో మీనా ఏడుస్తుంది. బాలు వస్తే జరిగింది చెబుతుంది.
అత్తయ్యను ఎలా తీసుకొస్తారు అని బాలు అంటాడు. పోలీస్ స్టేషన్‌కు బాలు, మీనా వెళ్తారు. పార్వతి ఏడుస్తుంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.