Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో సుమతి చేసిన పనికి బాధపడుతూ, ఏడుస్తూ భర్త ఫొటోతో చెప్పుకుంటుంది పార్వతి. దానిమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. చివరికి ఇలా బాధపెడుతుందని అనుకోలేదని పార్వతి అంటుంది. సుమతి వచ్చాక అడిగి నచ్చజెబుదామని శివ అంటాడు.
సుమతిని కొట్టిన పార్వతి

ఇంతలో సుమతి, మీనా వస్తారు. రాగానే సుమతిని కొడుతుంది పార్వతి. అరుణ్ గురించి బాలు చెప్పిందంతా చెబుతుంది పార్వతి. అరుణ్ వాళ్ల అమ్మను కలిశాం కదా. అలాంటి ఆవిడ కొడుకు తప్పు చేస్తాడనుకోలేం కదా. వెంటనే ఆయన చెప్పింది నమ్మితే ఎలా అని మీనా అంటుంది. ఒకటిరెండు సార్లు కలిసినంతమాత్రానా మంచిదని తేల్చితే ఎలా అని పార్వతి అంటుంది.
అరుణ్ గురించి మీకు పూర్తిగా తెలియదు. నన్ను చెప్పనివ్వు. వాళ్లిద్దరి మధ్య గొడవ ఉండొచ్చు. అలా అని అతను చెడ్డవాడు అవుతాడా అని సుమతి అంటుంది. సుమతికి అతనిలో నచ్చింది ఏంటీ, అతనితో సుమతి సంతోషంగా బతకగలదా అనేది ఆలోచిద్దామని మీనా అంటుంది. అతను వద్దని అల్లుడు అంత కచ్చితంగా చెబుతున్నారు. అతన్ని కాదని ఎలా చేస్తామే అని పార్వతి అంటుంది.
ఆయనతో నేను మాట్లాడుతాను. ఆయనకు నిదానంగా చెబితే వింటారని మీనా అంటుంది. అల్లుడు గారు అతని మంచివాడు కాదని చెబుతున్నారు. నువ్వు అతన్ని పెళ్లి చేసుకోడానికి వీళ్లేదని పార్వతి అంటుంది. బాలు బావ ఏం చేసిన మన మంచికోసమే చేస్తారు. నేను కిడ్నాప్ అయినప్పుడు ఏం చేశాడో చూశావుగా. మనకోసం ఎంతదూరమైన వెళ్తాడు. అలాంటి బావ మాటలు తేలిగ్గా తీసుకోడానికి లేదని శివ అంటాడు.
బావకు నచ్చనంతా మాత్రానా
రేయ్ అరుణ్ మంచివాడురా. బావకు నచ్చనంత మాత్రానా మంచివాడు కాకుండా పోతాడా అని సుమతి అంటుంది. పార్వతి తిడుతుంది. మీనా ఆపుతుంది. సుమతిని పక్కకు తీసుకెళ్లి మీనా మాట్లాడుతుంది. అతను మంచివాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా అని సుమతి అంటే.. నమ్ముతున్నాను. నేనంటే చాలా ఇష్టం. చాలా బాగా చూసుకుంటారని సుమతి అంటుంది.
{{/usCountry}}రేయ్ అరుణ్ మంచివాడురా. బావకు నచ్చనంత మాత్రానా మంచివాడు కాకుండా పోతాడా అని సుమతి అంటుంది. పార్వతి తిడుతుంది. మీనా ఆపుతుంది. సుమతిని పక్కకు తీసుకెళ్లి మీనా మాట్లాడుతుంది. అతను మంచివాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా అని సుమతి అంటే.. నమ్ముతున్నాను. నేనంటే చాలా ఇష్టం. చాలా బాగా చూసుకుంటారని సుమతి అంటుంది.
{{/usCountry}}పెళ్లికి రెండు కుటుంబాల అంగీకారం కావాలి. ఇప్పుడు ఆయన, అమ్మ కోపంగా ఉన్నారు. కొన్నిరోజులు నువ్వు సైలెంట్‌గా ఉండు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ కోపాలు పోయాక ఆయనతో మాట్లాడి చూస్తాను. అవసరమైతే అరుణ్‌తో కూడా మాట్లాడతాను. అతను ఎలాంటివాడు, ఎలా చూసుకుంటాడో తెలుసుకుంటాను. నీకు నచ్చినవాడితోనే పెళ్లి జరగాలని అనుకుంటున్నాను. కానీ, అప్పుడు అమ్మ కళ్లలో నీళ్లు ఉండకూడదు, బావ మనసులో బాధ ఉండకూడదు అని మీనా అంటుంది.
థ్యాంక్స్ అక్కా.. ఇప్పుడు కూడా నాకు నువ్వు తోడుగా ఉన్నావని హగ్ చేసుకుంటుంది సుమతి. మరోవైపు మనోజ్ దగ్గరికి పార్క్ ఫ్రెండ్ వస్తాడు. రోహిణిని తీసుకురావడం గురించి అడుగుతాడు. అమ్మ పర్మిషన్ ఇవ్వలేదని, ఇంకొన్ని రోజుల్లో కోపం పోతుందని మనోజ్ అంటాడు. ఇద్దరు లంచ్ చేద్దామనుకుంటారు. ఎవరి బిల్ వారే కట్టుకోవాలని మనోజ్ అంటాడు.
మనోజ్‌కు కొత్త భయం
ఇంతలో ఫుడ్ ఆర్డర్ వస్తుంది. రోహిణి మేడమ్ ఆర్డర్ పెట్టిందని అతను చెబుతాడు. వావ్ నీ గురించి ఆలోచించి ఫుడ్ ఆర్డర్ పెట్టింది. నువ్వే ఆలోచించట్లేదని పార్క్ ఫ్రెండ్ అంటాడు. ఇద్దరం తిందామని అంటే.. ఇది నాకు మాత్రమే. నువ్వేమైనా ఆర్డర్ పెట్టుకో అని మనోజ్ అంటాడు. ఇప్పుడు ఆర్డర్ పెడితే చాలా టైమ్ అవుతుంది. అర్థం చేసుకో బ్రో అని బతిమిలాడితే మనోజ్ ఒప్పుకుంటాడు.
ఇద్దరు కలిసి తింటారు. ఫ్రెండ్‌కి కాకులకు పెట్టినట్లు మనోజ్ తిండి పెడతాడు. నాకు చాలా ఆకలిగా ఉంది. నాకే సరిపోదని మనోజ్ అంటాడు. రోహిణి గురించి పార్క్ ఫ్రెండ్ మాట్లాడుతాడు. కలిసి ఉండాలంటాడు. బయటి పరిస్థితులు అస్సలు బాగాలేవు. నా ఫ్రెండ్ భార్య భర్త కోసం చూసి చూసి ఇంకోకరితో వెళ్లిపోయింది. భర్తలు ప్రేమగా చూసుకోకుంటే భార్యలు ఏం చేస్తారు అని ఫ్రెండ్ అంటాడు.
దాంతో మనోజ్ షాక్ అయి భయపడతాడు. తిండి కూడా తినడు. ఆ ఫుడ్‌ని మనోజ్ ఫ్రెండ్ తింటాడు. వీళ్లకు వేరేవాళ్లు ఎక్కడి నుంచి వస్తారని మనోజ్ అడిగితే.. బెస్టీస్ అంటూ తిరుగుతారుగా. ఇప్పుడు నా ఫ్రెండ్ మతిలేనివాడు అయ్యాడని ఫ్రెండ్ చెబుతాడు. రోడ్డుపై పిచ్చిగా తిరిగేవాన్ని చూపించి అతనే నా ఫ్రెండ్ అంటాడు. ఇంకొన్ని రోజుల్లో నువ్వు కూడా అలాగే అవుతావ్ అంటాడు మనోజ్ ఫ్రెండ్.
వేరే వ్యక్తితో బైక్‌పై రోహిణి
దాంతో మనోజ్ పిచ్చోడిలా మారినట్లు ఊహించుకుంటాడు. వేరే వ్యక్తి బైక్‌పై రోహిణి వెళ్తుంటే.. వెనకాలే నా భార్య అంటూ పరుగెత్తుతాడు మనోజ్. నా భార్య ఎవరితోనే వెళ్లిపోతుంది అంటూ మతిలేనోడిలా అరుస్తూ పరుగెత్తుతాడు. అది తలుచుకుని భయపడిపోతాడు మనోజ్. మరోవైపు రవి, శ్రుతి మాట్లాడుకుంటారు. రిజైన్ చేయడం గురించి శ్రుతి అడిగితే.. ఎప్పటికప్పుడు చేసేది కాదని రవి అంటాడు.
పొద్దున అంత ఇష్యూ అయింది. అక్కడ వర్క్ చేయొద్దని నేను క్లియర్‌గా చెప్పానుగా. నువ్వెందుకు నీతూ దగ్గర బానిసలా వర్క్ చేయాలని శ్రుతి కోప్పడుతుంది. అక్కడ నేను బానిసను కాదు చెఫ్‌ని, నాకు గౌరవం ఉందని రవి అంటాడు. ఇద్దరు వాదించుకుంటారు. బిజినెస్‌ను అన్నింట్లో ముందుకు తీసుకెళ్తారు. సక్సెస్ క్రెడిట్ వాళ్లే తీసుకుంటారు. ఆ సక్సెస్‌లో మన పాత్ర ఉండొచ్చు. కానీ మనవల్లే సక్సెస్ వచ్చిందనుకోకూడదని రవి అంటాడు.
రెస్టారెంట్ సక్సెస్ కావాలంటే ఫుడ్ బాగుండాలి. అక్కడ రిజైన్ చేయి. కొత్త రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామని శ్రుతి అంటుంది. మీ వాళ్ల దగ్గరి నుంచి డబ్బు తీసుకోను. నాకు నామోషిగా ఉంటుందని రవి అంటాడు. నా పేరంట్స్ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. బ్యాంక్ లోన్ తీసుకుంటాను. నా ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకుంటాను అని శ్రుతి అంటుంది.
శ్రుతి కొత్త రెస్టారెంట్
ఇప్పుడు మనం ఇదివరకే అప్పుల్లో ఉన్నాం. ఇప్పుడు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీతూ సాలరీ పెంచుతానంటుంది. ఆరు నెలల్లో 50 లక్షలు కావాలి. ఈ సమయంలో బిజినెస్ అంటూ వెళ్లడం కరెక్ట్ కాదని రవి అంటాడు. జీతంతో అంత డబ్బు ఎలా వస్తుంది. బిజినెస్ చేస్తే డబ్బు ఎక్కువ వస్తుంది. వినడానికి రిస్కీగా ఉన్నా వర్కౌట్ అవుతుందని శ్రుతి అంటుంది.
వాళ్లు మనమీద నమ్మకం పెట్టుకున్నారు. మనం రిజైన్ చేస్తే నష్టం వస్తుంది. ఇప్పటికిప్పుడు రెస్టారెంట్ బిజినెస్ పెట్టడం చాలా కష్టమని రవి అంటాడు. సరే నా సేవింగ్స్‌తో రెస్టారెంట్ స్టార్ట్ చేస్తాను. అందులో చెఫ్‌గా వర్క్ చేయి. నీకు సాలరీ ఇస్తాను. నీకు నమ్మకం వచ్చాకే పార్టనర్ అవు. అప్పటివరకు సాలరీ ఇస్తాను అని శ్రుతి అంటుంది.
చెబితే వినవేంటని రవి కోప్పడతాడు. ఆ మాటలు ప్రభావతి వింటుంది. ఏమైందని అడుగుతుంది. ఏం కాలేదని రవి అంటాడు. నిజంగా ఏం లేదా అని ప్రభావతి అంటుంది. మా మధ్య ఏదైనా సమస్య ఉంటే తప్పా మీకు నిద్రపట్టదా. ఆంటీ ప్లీజ్ వెళ్లండి అని కోపంగా ప్రభావతి మొహంపైనే డోర్ వేసి అవమానిస్తుంది శ్రుతి.
పూలమ్ముకునేదే మంచిదనిపిస్తుంది
దీనికి పొగరు బాగా ఎక్కువైంది. ఏం అడిగినా సరిగ్గా సమాధానం చెప్పదు. దీనికన్నా ఆ పూలమ్ముకునేదే చాలా మంచిదనిపిస్తుంది అప్పుడప్పుడు అని ప్రభావతి అనుకుంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.