Parvathy: మెగాస్టార్ డైలాగ్‌ను తప్పుబట్టిన హీరోయిన్ పార్వతి, రేప్ చేస్తామని బెదిరింపులు- మళ్లీ అదే మాట అంటానంటూ!

Parvathy Thiruvothu On Rape Threatening: జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ స్టార్ హీరోయిన్ పార్వతి తిరువోతుకు వచ్చిన రేప్, చావు బెదిరింపులపై తాజాగా చెప్పుకొచ్చారు. ఓ సినిమాలో మెగాస్టార్ చెప్పిన డైలాగ్స్‌ను తప్పుబట్టినందుకు ట్రోలింగ్, బెదిరింపులకు దిగినట్లుగా పార్వతి వెల్లడించారు. అసలు ఏమైందంటే..?

Published on: Jun 14, 2026, 06:50:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Parvathy Thiruvothu On Rape Threatening: సినిమా పరిశ్రమలో మహిళలపై జరిగే వివక్ష, వెండితెరపై చూపించే మహిళా వ్యతిరేకతపై గళమెత్తే అతికొద్ది మంది నటీమణులలో మలయాళ హీరోయిన్ పార్వతి తిరువోతు ఒకరు.

మెగాస్టార్ డైలాగ్‌ను తప్పుబట్టిన హీరోయిన్ పార్వతి, రేప్ చేస్తామని బెదిరింపులు- మళ్లీ అదే మాట అంటానంటూ!
మెగాస్టార్ డైలాగ్‌ను తప్పుబట్టిన హీరోయిన్ పార్వతి, రేప్ చేస్తామని బెదిరింపులు- మళ్లీ అదే మాట అంటానంటూ!

మెగాస్టార్ సినిమాపై వ్యాఖ్యలు

చియాన్ విక్రమ్ సరసన నటించిన 'తంగలాన్', అలాగే 'బెంగళూరు డేస్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన ఈ జాతీయ అవార్డు గ్రహీత.. గతంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సినిమాపై చేసిన వ్యాఖ్యల వల్ల భయంకరమైన వేధింపులను ఎదుర్కొన్నారు.

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆనాటి చేదు జ్ఞాపకాలను, ఆ తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో వచ్చిన విప్లవాత్మక మార్పులను పార్వతి తిరువోతు గుర్తుచేసుకున్నారు. 2016లో మమ్ముట్టి నటించిన 'కసబా' చిత్రంలోని ఒక సీన్‌లో మహిళలను కించపరిచేలా ఉన్న డైలాగులను పార్వతి బహిరంగంగా తప్పుబట్టారు.

రేప్ చేస్తామని బెదిరింపులు

అంతటి పెద్ద హీరో (మెగాస్టార్ మమ్ముట్టి) అలాంటి డైలాగులు చెప్పడాన్ని ప్రశ్నించినందుకు సోషల్ మీడియాలో పార్వతిపై కొందరు నెటిజన్లు దారుణమైన ట్రోలింగ్‌కు దిగారు. ఏకంగా అత్యాచారం చేస్తామని, చంపేస్తామని బెదిరింపులు రావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.

ఆ పోరాటం నా ఒక్కదానిది కాదు

ఈ వివాదం, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై పార్వతి తిరువోతు స్పందిస్తూ.. "ఆ బెదిరింపులు వచ్చిన 20 రోజుల తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ఆ పోరాటం నా ఒక్కదాని కోసం కాదు, మహిళలందరి కోసం. ఆ సమయంలో మహిళలంతా ఏకమైన తీరు నన్ను ఆశ్చర్యపరిచింది" అని అన్నారు.

"పరిశ్రమలోని కొందరు పురుషులు కూడా నాకు మద్దతుగా నిలిచారు. ఇది కేవలం పార్వతి మాట్లాడిన మాటల గురించి కాదు, ఒక మహిళ తన అభిప్రాయాన్ని బలంగా చెప్పడం, దానికి కట్టుబడి ఉండటం గురించని వారు గుర్తించారు" అని జూమ్ ఇంటర్వ్యూలో పార్వతి తిరువోతు పేర్కొన్నారు.

బాయ్‌కాట్ చేసినా హిట్టు ఇచ్చారు!

ఆ వివాదం నడుస్తున్న సమయంలోనే పార్వతి నటించిన 'ఉయరే' సినిమా విడుదలైంది. అప్పట్లో కొందరు 'బాయ్‌కాట్ పార్వతి' (పార్వతిని బహిష్కరించండి) అంటూ నెగెటివ్ ట్రెండ్ చేశారు.

దీనిపై ఆమె మాట్లాడుతూ.. "కేరళ వీక్షకుల ఒక గొప్ప గుణం ఏంటంటే.. వారు మిమ్మల్ని ఎంతగా ప్రేమించినా, ద్వేషించినా.. మీరు మంచి నటన కనబరిస్తే మాత్రం కచ్చితంగా ఆదరిస్తారు. నన్ను కొందరు ద్వేషించినా, నా సినిమాను మాత్రం భారీ హిట్ చేశారు" అని చెప్పుకొచ్చారు.

"భవిష్యత్తులో మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేస్తారా అని నన్ను చాలా మంది అడుగుతుంటారు. నేను ఎప్పుడూ నా ఆత్మసాక్షికి, నిజాయితీకి కట్టుబడే మాట్లాడతాను. 2017 నుంచి మలయాళ చిత్ర పరిశ్రమలో (మహిళల భద్రత విషయంలో) వచ్చిన మార్పులు నిజంగా అద్భుతం" అని తప్పుగా అనిపిస్తే ప్రశ్నిస్తానని పార్వతి తిరువోతు పేర్కొన్నారు.

హృతిక్ రోషన్ నిర్మాణంలో క్రేజీ ప్రాజెక్ట్

'టేక్ ఆఫ్', 'చార్లీ', 'మరియాన్', 'ఖరీబ్ ఖరీబ్ సింగిల్' వంటి అద్భుతమైన చిత్రాల్లో నటించిన పార్వతి తిరువోతు ఇటీవల 'ఉల్లోళుక్కు', తమిళ చిత్రం 'హర్' సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం మలయాళంలో రెండు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న ఆమె, త్వరలోనే హిందీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పైకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు.

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన హోమ్ బ్యానర్ 'హెచ్ఆర్ఎక్స్ ఫిల్మ్స్' (HRX Films) పై మొదటిసారి నిర్మిస్తున్న 'ది స్టోర్మ్' (The Storm) అనే వెబ్ సిరీస్‌లో పార్వతి తిరువోతు కీలక పాత్ర పోషిస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అజిత్‌పాల్ సింగ్ దర్శకత్వంలో ముంబై నేపథ్యంలో సాగే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లింగ్ ఓటీటీ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఇందులో అలయా ఎఫ్, సబా ఆజాద్, సృష్టి శ్రీవాస్తవ కూడా నటిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More