...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయిన రోహిణి- ప్రభావతికి ఎదురుతిరిగిన మనోజ్- నీతూ భయం

Gunde Ninda Gudi Gantalu Serial November 11th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 11వ తేది ఎపిసోడ్‌లో రోహిణి ఫొటో మెడలో వేసుకుని పిచ్చోడిలా తిరుగుతాడు మనోజ్. నిద్రలేచేసరికి రోహిణి లెటర్ రాసిపెట్టి వెళ్లిపోతుంది. అది తెలిసి ఏడుస్తాడు. ప్రభావతికి చెబితే విజిల్ కొట్టి, డ్యాన్స్ చేస్తుంది.

Published on: Nov 11, 2026, 07:17:22 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సుమతి గురించి ఆలోచిస్తుంది మీనా. బాలు వస్తాడు. పార్వతికి సుమతి ప్రేమ విషయం చెప్పడం గురించి అడిగితే.. ఆ చలనా గాడు మంచివాడు కాదని కూడా చెప్పాని బాలు అంటాడు. చిన్నదానికి, పెద్దదానికి చలనా వేస్తూ డబ్బులు గుంజుతాడుగా అని బాలు అంటాడు.

ఇంట్లో బాంబ్ వేసేసి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 11 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 11 ఎపిసోడ్

మనకు నచ్చనంత మాత్రానా సుమతికి నచ్చకూడదని లేదుగా. అయినా దీని గురించి మనం ముగ్గురు మాట్లాడుకుని తర్వాత చెప్పాలి. ముందే వెళ్లి ఇంట్లో బాంబ్ వేసేసి అమ్మను కంగారుపెట్టి, సుమతిని బాధపెట్టి వస్తే ఎలా అండి అని మీనా అంటుంది. నువ్వుంటేనే ఇంటికి వెళ్లాలా. లేకుంటే వెళ్లకూడదా. మరెందుకు నువ్వే ఇంటికి పెద్ద దిక్కు చింతకాయ తొక్కు అనాలి. రేయ్ బాలు నీ లిమిట్స్ ఇవి ఇక్కడే ఉండు అని నాకు చెప్పుంటే నేను నా హద్దుల్లో ఉండేవాన్నిగా అని బాలు అంటాడు.

నేను అలా అనట్లేదని మీనా అంటుంది. నాకు ఇలాగే మాట్లాడాలని ఉండదు. నేను తప్పు చేయను. ఎవరు తప్పుపట్టిన ఒప్పుకోను. సుమతికి బ్రోకర్‌ను కలిసి మంచి సంబంధాలు తెచ్చాను. ఇతను డాక్టర్.. చాలా బుద్ధిమంతుడు కూడా. రేపు జాతకాలు తెప్పించి పొద్దున పంతులు గారికి చూపించి ఎవరో ఒకరిని ఫైనల్ చేద్దామని బాలు అంటాడు.

అయ్యో నా మాట వినండి. ఎందుకు తొందరపడుతున్నారు. సుమతి ఇష్టాయిష్టాల గురించి పట్టించుకోకూడదా. మనం సంబంధం చూపిస్తే తలవంచుకుని తాళి కట్టించుకోవాలా అని మీనా అంటుంది. దాంతో అరుణ్ గాడు ఏం చేశాడు. నా మీద దొంగ కేసు పెట్టాడు. ఎంత ద్వేషం ఉంటే అలా చేస్తాడు. వాడు బాధ్యతగల పోలీస్ ఎలా అవుతాడని కోప్పడతాడు బాలు.

మన తప్పులు ఉంచుకుని

వాడి గురించి ఒక్క మంచి మాట మాట్లాడిన ఊరుకోను. వాడు మంచోడు కాదు అంతే. నా మాట కాదని సొంత నిర్ణయాలు తీసుకుని వాడికి సుమతిని ఇచ్చి పెళ్లి చేస్తే జీవితంలో ఆ ఇంటి గడప తొక్కను. నువ్వు కూడా మీ పుట్టింటిని మర్చిపోవాల్సి వస్తుంది అని బాలు వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే వచ్చిన ప్రభావతి వింటుంది. సరే మళ్లీ మాట్లాడుకుందాం అని మీనా అంటుంది.

మళ్లీ మళ్లీ లేదు మీ ఇంటికి నేను పెద్ద దిక్కులా ఉండాలంటే నేను చెప్పింది చేయండి. లేకుంటే మీ ఇష్టం అని బాలు వెళ్లిపోతాడు. మీరు ఏం మాట్లాడుకుంటున్నారు. వాడెందుకు హెచ్చరించి వెళ్తున్నాడని ప్రభావతి అడుగుతుంది. అవేం లేదు. మాములు మాటలే అని మీనా వెళ్లిపోతుంది. అది ఇలాగే అంది, ఇది అలాగే ఉంది. కానీ, అరుచుకున్నట్లే ఉందని ప్రభావతి అనుకుంటుంది.

అరుణ్ సుమతి వేదన

మరోవైపు బాలు, పార్వతి తలుచుకుంటుంది సుమతి. ఇంకోవైపు బాలు కొట్టింది తలుచుకుంటాడు అరుణ్. వీళ్లందరు కాదు నాకు సుమతి కావాలి. తనతో మాట్లాడాలి అని సుమతికి అరుణ్ కాల్ చేస్తాడు. పార్వతి చూస్తుంది. దాంతో సుమతి కాల్ లిఫ్ట్ చేయదు. ఎలా ఉన్నావ్ సుమతి. నాకు పిచ్చెక్కిపోతుందనుకుంటాడు అరుణ్. మళ్లీ మళ్లీ కాల్ చేసిన లిఫ్ట్ చేయదు.

పార్వతి వచ్చి అది స్విచ్ఛాఫ్ పెట్టమంటుంది. మరోవైపు మనోజ్ మెడలో రోహిణి ఫొటో పెట్టుకుని పిచ్చోడిలా తిరుగుతాడు. అది కలకంటాడు మనోజ్. రోహిణి లేకపోవడంతో కంగారుపడతాడు. పక్కన లెటర్ ఉంటుంది. అందులో నేను వెళ్లిపోతున్నాను మనోజ్. ఎప్పుడు వస్తానో తెలియదు. నాకు కాల్ చేయకు. టైమ్‌కి తిను అని రాసి ఉంటుంది.

అది చదివి ఏడుస్తూ కిందకు వస్తాడు. ప్రభావతి దగ్గరికి వచ్చి నా పరువు అంతా పోయిందంటాడు. నీకు చెబితే నీ గుండె ఆగిపోయే అవకాశం ఉంది. రోహిణి ఇంట్లోంచి వెళ్లిపోయింది అని మనోజ్ ఏడుస్తూ చెబుతాడు. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. కాసేపటికి ఇంట్లోంచి వెళ్లిపోయిందా అని నవ్వుతుంది. అవునమ్మా. నన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్లిపోయిందని మనోజ్ అంటాడు.

విజిల్ కొట్టిన ప్రభావతి

దాంతో విజిల్ కొడుతుంది ప్రభావతి. సంతోషంగా డ్యాన్స్ చేస్తుంది. కోరికలను నెరవేరినప్పుడు సంబంరపడాలిగా అంటుంది. రోహిణి కోసం మనోజ్ ఏడుస్తాడు. వీడేంటీ ఫీల్ అవుతున్నాడు. నేను కట్టిన తాయిత్తు ఉండాలిగా అని చూస్తుంది ప్రభావతి. తాయిత్తు ఉంటుంది. హమ్మయ్య ఉందనుకుంటుంది. అది పోతే పోయిందిరా. ఏం తీసుకొచ్చింది. రంగులు వేసే పనికి పోయింటుంది. మళ్లీ వస్తుందని ప్రభావతి అంటుంది.

గదిలోకి వెళ్తాడు మనోజ్. అప్పుడే బాత్రూమ్ నుంచి రోహిణి వస్తుంది. దాంతో మనోజ్ షాక్ అవుతాడు. నువ్వు వెళ్లలేదా అని లెటర్ చూపిస్తాడు. క్లయింట్ దగ్గరికి వెళ్లాలి. నువ్వు లేచేసరికి లేట్ అవుతుందేమో అని ఇలా రాశానని రోహిణి చెబుతుంది. ఇంకేం లేదుగా. థ్యాంక్యూ సో మచ్ అంటాడు మనోజ్. నేను క్లయింట్ దగ్గరికి వెళ్లాను. నీకు క్యారేజ్ పంపిస్తా. భోజనం చేయాలని గుర్తుకువచ్చి తింటావ్. హెల్త్ బాగుంటుందని రోహిణి అంటుంది.

రోహిణిపై తనకున్న ప్రేమను చూసి అలాగే ఉండిపోతాడు మనోజ్. ఇదివరకులా ఉంటున్నావా నాతో. మాట్లాడితే అమ్మ అంటావ్. ఇలాగే నువ్వు ఉంటే నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత నువ్వెంత బాధపడ్డా తిరిగి రాలేను అని రోహిణి అంటుంది. ఏంటా నిర్ణయం అని మనోజ్ అడిగితే ఇంకా ఆలోచించలేదు. తల్లా, పెళ్లామా ఆలోచించుకో అని రోహిణి వెళ్లిపోతుంది.

నీదు చేతకానీ తనం

నాకు తెలుసు. మణికంఠ చెప్పాడు అని మనోజ్‌కు కొత్త భయం పట్టుకుంటుంది. మరోవైపు రెస్టారెంట్‌కి శ్రుతి వెళ్తుంది. లోపలికి రాను. బయటకు రవిని రమ్మంటుంది. ఇంతలో బ్రోకర్‌తో మాట్లాడితే.. మ్యారేజ్ బ్రోకరా అని రవి అంటాడు. అవును, నీకే పెళ్లి సంబంధాలు చూస్తున్నాను అంటుంది శ్రుతి. తర్వాత రెస్టారెంట్‌కి మన బడ్జెట్‌లో రెండు చూపిస్తాడట. రా అని శ్రుతి అంటుంది.

ఇద్దరు కొత్త రెస్టారెంట్ గురించి వాదించుకుంటారు. ఆ మాటలు నీతూ వింటుంది. దేనికైనా ఓర్పు, సహనం ఉండాలని రవి అంటే.. కరెక్టే కానీ నీది చేతకానీ తనం అంటారు. ఆవేశంతో నిర్ణయం తీసుకోలేదు. మనమేంటో నిరూపించుకోవాలంటే సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయాలని శ్రుతి అంటుంది. నేను ఇప్పుడు రాలేను. నువ్వు ఇప్పుడు వస్తావని తెలియదుగా. లోపల 30 మందికి ఫుడ్ ప్రిపేర్ చేయాలని, కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు రవి అంటాడు.

నీకు నాకంటే రెస్టారెంట్ ఎక్కువ ఇంపార్టెంట్ అయింది. వాళ్లు ఎంత అవమానించినా సిగ్గులేకుండా ఫుడ్ ప్రిపేర్ చేసుకో పో అని శ్రుతి అంటుంది. నువ్వెంత తక్కువ మాట్లాడిన నేను నా పనిని గౌరవిస్తానని రవి అంటాడు. చేసేది లేక రవి లోపలికి వెళ్తాడు. సమస్య ఏంటని శ్రుతిని అడుగుతుంది నీతూ. ఇప్పుడు నీకు అది పూసగుచ్చినట్లు చెప్పాలా. ఇలా తెలిస్తే మొత్తం రికార్డ్ చేసేదాన్నిగా అని వెటకారంగా మాట్లాడుతుంది శ్రుతి.

భయపడిన నీతూ

ఇక్కడికి ఎందుకు వచ్చావ్. మళ్లీ జాబ్‌లో చేరాలనుకుంటున్నావా. నేనేం అనుకోను. ఎప్పుడైనా జాయిన్ కావచ్చని నీతూ అంటుంది. నాకు రెస్పెక్ట్ లేని దగ్గర చచ్చిన జాబ్ చేయను. మేమే కొత్తగా రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అని శ్రుతి అంటుంది. నీతూ షాక్ అయితే.. ఫ్యూచర్ లో మరిన్ని షాక్ లు తగులుతాయని శ్రుతి అంటుంది. అది అంతా ఈజీ కాదు. స్టార్ట్ చేసిన రవిలాంటి మంచి చెఫ్ దొరకడని నీతూ అంటుంది.

రవిలాంటి మంచి మొగుడే నాకు దొరికాడు. అలాంటి మంచి చెఫ్ ఎందుకు దొరకడని శ్రుతి అంటుంది. అంటే రవిని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతావా అని భయపడుతుంది నీతూ. తర్వాత రోహిణి తనను వదిలేసి వెళ్లిపోతుందనిపిస్తుందిరా అని బాలుతో మనోజ్ చెబుతాడు. నీ దగ్గర ప్రేమ, ఆప్యాయత దొరకనప్పుడు ఇంకెందుకు ఉంటుందని బాలు అంటాడు.

నేను ఒంటరిగా మిగిలిపోతానా అని మనోజ్ భయపడితే అంతేగా మరి. అమ్మ చెప్పినట్లు వింటే పార్లరమ్మ కచ్చితంగా నిన్ను వదిలేస్తుందని బాలు బెదిరిస్తాడు. దాంతో మరుసటి రోజు ఉదయం ఇకనుంచి రోహిణి కూడా నాతోపాటు ఫర్నిచర్ షాప్‌కి వస్తుందని ప్రభావతితో చెబుతాడు మనోజ్. మనోజ్ చేతిలో బొచ్చె పెట్టి అది నీతో వస్తే అడుక్కుతినాలని అంటుంది ప్రభావతి.

ఎదురుతిరిగిన మనోజ్

నువ్వేం చెప్పిన సరే ఈరోజు నుంచి నాతోపాటు రోహిణి వస్తుందని తల్లి ప్రభావతికే ఎదురుతిరుగుతాడు మనోజ్. అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks