Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో నార్మల్‌గా గుడికి వచ్చానని శోభ చెబుతుంది. మీనాకు బాలు పుస్తెలు తీసుకున్నాడు. ఐదుగురు ముత్తయిదువులు పూసలు గుచ్చాలి. ఒకరు తక్కువ అయ్యారనుకుంటున్నా.. సమయానికి వచ్చారు రండి వదిన అని ప్రభావతి అంటుంది.
20 వేలకు మనోజ్‌కు తాయిత్తు

దాంతో శోభ, ప్రభావతి మీనా పుస్తెల తాడుకు పూసలు గుచ్చి వేస్తారు. తర్వాత లక్కీ డ్రిప్ తీస్తున్నామని రాజేష్ చెబుతాడు. మనోజ్ పరుగెత్తుతాడు. అంతా వెళ్తారు. ప్రైజ్‌లన్నీ తనకే రావాలని మొత్తం 20 వేలతో రిసీట్లు మనోజ్ తీసుకున్నాడని రాజేష్ చెబుతాడు. ఫస్ట్ చిట్టీలో మనోజ్ పేరు వస్తుంది. అందులో తాయిత్తు ఉంటుంది.
అది చూసి మనోజ్ షాక్ అవుతాడు. రూ. 20 వేలు పెట్టి తాయిత్తు తీసుకున్నావా అని రవి అంటాడు. ఇంతలో చింతామణి చప్పట్లు కొడుతూ వస్తుంది. అందరూ చాలా సంతోషంగా దసరా ఎంజాయ్ చేస్తున్నారు. మీ ఆనందం ఆవిరి అయ్యేందుకు నా రూపంలో వచ్చింది. నువ్వేదో గొప్పదానిలా నువ్వేం తప్పు చేయనిదానిలా నన్ను విమర్శించావుగా. ఈరోజు నువ్వేంటన్నది నీ కుటుంబానికి తెలియజేయడానికే వచ్చానని చింతామణి అంటుంది.
మా అమ్మ గురించి మాట్లాడుతున్నావేంటీ అని బాలు కోప్పడుతాడు. మీ ఇంట్లో అన్ని అనర్థాలకు కారణం మీ అమ్మే మూలం బాలు. అప్పు ఇచ్చినవాళ్లను ముంచేసి ఇక్కడ ఆనందాలతో మునిగిపోతుంది. మీ కొంప మునిగిపోయింది అని ప్రభావతి ఇంటి పత్రాలు తీసి చూపిస్తుంది. ఇవి మీ ఇంటి పత్రాలు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయని చెబుతుంది చింతీ.
తీసుకున్నా అప్పు 17 లక్షలేగా
అవి నీ దగ్గరకు ఎలా వచ్చాయని బాలు అడుగుతాడు. మీకు అప్పు ఇచ్చినవాడు మీరు అది తీర్చకపోవడంతో దివాళ తీసి ఆ ఫైనాన్షియర్ నాకు హ్యాండోవర్ చేశాడు. మీ అప్పు నేను కట్టాను. ఇప్పుడు ఆ ఫైనాన్స్ కంపెనీ నాది. ఇప్పుడు మీరు ఆ అప్పు నాకే తీర్చాలి అని చింతామణి అంటుంది. అంతా షాక్ అవుతారు. ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ రవి చూసి ఇదంతా నిజమే అంటాడు.
{{/usCountry}}అవి నీ దగ్గరకు ఎలా వచ్చాయని బాలు అడుగుతాడు. మీకు అప్పు ఇచ్చినవాడు మీరు అది తీర్చకపోవడంతో దివాళ తీసి ఆ ఫైనాన్షియర్ నాకు హ్యాండోవర్ చేశాడు. మీ అప్పు నేను కట్టాను. ఇప్పుడు ఆ ఫైనాన్స్ కంపెనీ నాది. ఇప్పుడు మీరు ఆ అప్పు నాకే తీర్చాలి అని చింతామణి అంటుంది. అంతా షాక్ అవుతారు. ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ రవి చూసి ఇదంతా నిజమే అంటాడు.
{{/usCountry}}అసలు, వడ్డీ కలిపి రూ. 50 లక్షలు అని చింతామణి అంటుంది. మా ఇంటి మీద మేము తీసుకున్న అప్పు 17 లక్షలేగా అని సత్యం అంటాడు. అంతేనా ప్రభావతి.. 17 లక్షలేనా అని చింతామణి అంటుంది. 50 లక్షలు అంటుందేంట్రా అని మనోజ్‌ను అడుగుతుంది ప్రభావతి. మేము తీసుకుంది 17 లక్షలే. అయినా నేను నెల నెల వడ్డీ కడుతున్నాగా.. అంతా ఎలా అయిందని బాలు అంటాడు.
ఎంత అయిందో మీ అన్నయ్యను అడుగు అని చింతామణి అంటుంది. దాంతో ప్రభావతి వెనుక దాక్కుంటాడు మనోజ్. రేయ్ ఏం చేశావురా అని అడుగుతారు. తీసుకుంది రెండున్నర లక్షలేగా అని ప్రభావతి అంటుంది. అవేంటని సత్యం అడుగుతాడు. ఆ ముంబై ముఖేష్‌కి 10 లక్షలు ఇవ్వాలని, దానికి తక్కువ పడిందని రెండున్నర లక్షలు అడిగాడు. ఆ ఇంటి పత్రాలపైనా ఆ రెండున్నర లక్షలకు నేను సంతకం చేశానని ప్రభావతి చెబుతుంది.
రెండున్నర కాదు అదనంగా 25 లక్షలు అప్పు
ఏంటీ మనోజ్ రెండున్నర లక్షలేనా తీసుకుంది అని చింతామణి అడుగుతుంది. ఇప్పుడే అంతా సంతోషంగా ఉన్నాం. రేపు వచ్చి మాట్లాడతామని మనోజ్ దాటవేస్తాడు. మాకు చెప్పకుండా వాడికి రెండున్నరల లక్షలు ఎందుకు ఇప్పించావని సత్యం అడుగుతాడు. గుట్టుచప్పుడు కాకుండా రెండు నెలల్లో తీర్చేస్తా అన్నాడని ప్రభావతి అంటుంది.
అలా తీర్చడానికి తీసుకుంది రెండున్నర లక్షలు కాదు రూ. 25 లక్షలు అని చింతామణి బాంబ్ పేలుస్తుంది. అందరిని మోసం అదనంగా మనోజ్ 25 లక్షలు తీసుకున్నాడు. దాంతో మనోజ్ కాలర్ పట్టుకుని అమ్మను కూడా మోసం చేశావా. 25 లక్షలు తీసుకున్నావా అని బాలు బాదుతాడు. బాలును ఆపి ప్రభావతి మనోజ్‌ను కొడుతుంది.
నాకు చెప్పింది రెండున్నర లక్షలు.. 25 లక్షలు ఎలా అయ్యాయని చితకబాదుతుంది. నేనే ఇంకా సున్నా పెట్టానమ్మా అని మనోజ్ అంటాడు. దాంతో మరింత కొడుతుంది. మళ్లీ మళ్లీ మోసం చేశావ్ అని బాలు అంటాడు. సత్యం కూడా మనోజ్‌ను కొడతాడు. అసలు ఆ పాతికలక్షలతో ఏం వెలగబెట్టారో కనుక్కోండని మీనా అంటుంది.
ఇల్లు రాసి ఇచ్చేయండి
ఆ డబ్బుతోనే విల్లా విజయ్‌కు విల్లా కోసం అడ్వాన్స్ ఇచ్చానని మనోజ్ చెబుతాడు. దాంతో సత్యం తలపట్టుకుంటాడు. అంతా షాక్ అవుతారు. మీకు అసలు సిగ్గుందా మనోజ్ అని శ్రుతి అంటే.. రవి మాత్రం ఆపనంటాడు. అడగడానికి పెద్దవాళ్లు ఉన్నారని మీనా ఆపుతుంది. నా 50 లక్షలు ఎప్పుడు కడతారు. అప్పు కింద మీ ఇల్లు నాకు రాసి ఇస్తున్నట్లుగా ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం చేయండని చింతామణి డిమాండ్ చేస్తుంది.
నువ్వు నా మీద పగతో వచ్చి ఉంటే అది చెప్పు. నీకు దమ్ముంటే నాతో తలపడు అంతాకనీ ఇంటిమీద పడకు. మేమంతా చర్చించుకుని అప్పు ఎలా కట్టాలనేది ఆలోచించి చెబుతాం. ఇప్పుడు వెళ్లు అని మీనా అంటుంది. నాకు ఇల్లు ఇచ్చి వెళ్లిపోతారా, అప్పు కడతారా ఏదోటి తేల్చుకోండని చింతామణి వార్నింగ్ ఇస్తుంది. ఏం మాట్లాడుతున్నావ్. నేనుండగా వాళ్లకు ఎలాంటి సమస్య రానివ్వను అని శోభ అంటుంది.
ఆ 50 లక్షలు నేను ఇస్తానని శోభ అంటుంది. అలా చింతామణికే షాక్ ఇస్తుంది శోభ. బాలు సెటైర్లు వేస్తాడు. నేను ఊరికే ఇవ్వట్లేదు. అప్పుగానే ఇస్తున్నా. వడ్డీ అవసరం లేదని శోభ అంటుంది. నేను 50 లక్షలు ఇప్పుడే కట్టేస్తాను. కానీ ఓ కండిషన్. మీ బాలు వల్లే మాకు అవమానాలు జరుగుతున్నాయి. అందుకు ఓ పని చేస్తే చాలు. ఈ బాలు వచ్చి నా కాళ్లు పట్టుకుని క్షమించమని అడగాలి అని శోభ అంటుంది.
ఏ ఆడగాడిద కాళ్లు పట్టుకోడు
బాలు మా బావగారు ఏం మాట్లాడుతున్నావ్ అని శ్రుతి అంటుంది. ఆ పనికిమాలిన రిలేషన్ నాకు అవసరం లేదు. నా కాళ్లు పట్టుకుంటే చాలు. డబ్బు నిదానంగా కట్టవచ్చు అని శోభ అంటుంది. మా ఆయనంటే అంత చులకన అయిపోయిందా. ఆయనకు ఆడగాడిదల కాళ్లు, అడ్డగాడిద కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు అని మీనా అంటుంది.
వాడు చేసింది తప్పేరా. ఇల్లు లేకపోతే రోడ్డున పడిపోతాంరా. రేయ్ కాళ్లు పట్టుకోరా అని ప్రభావతి వేడుకుంటుంది. అసలు కన్నతల్లేనా మీరు. అత్తగారు కాబట్టి బతికిపోయారు. అసలు ఎవరు అన్ని లక్షలకు సంతకం చేసింది. ఆయన్ను పట్టుకోమనండి కాళ్లు. ఇదేమాట ఇంకొకరు అనుంటే అని మీనా అంటుంటే.. మీ అత్తయ్య నోరు చీరిపారేస్తాను అని సత్యం అంటాడు.
ఆవిడ భర్త చాటు భార్యే అయితే మరో మగాడిని కాళ్లు ఎందుకు పట్టుకోమంటుంది. పోమ్మా.. ఇక్కడి నుంచి పోమ్మా. నీ 50 లక్షలు మీ దగ్గరే ఉంచుకో. నా కొడుకు ఏ తప్పు చేయలేదని సత్యం అంటాడు. నా అప్పు సంగతి ఏంటని చింతామణి అంటుంది. ఇంతలో రాజేష్ వచ్చి రేయ్ డ్రైవర్లంతా ఇక్కడే ఉన్నాం. ఈవిడని ప్రాణాలతో వదిలేద్దామా కాలో చేయో తీసేద్దామా అని అంటాడు.
కోర్టు నోటీసు
వెళ్లిపొమ్మని శోభ సైగ చేయడంతో చింతామణి సరేనని తల ఊపుతుంది. కోర్టుకు వెళ్లిన నాదే పైచేయి అవుతుంది. రేపటివరకు గడువు ఇస్తున్నాను. ఏదోటి తేల్చుకోండి. వస్తాను అని వెళ్లిపోతుంది చింతామణి. మనోజ్‌ను కొడుతుంది ప్రభావతి. మరుసటి రోజు ఇంట్లో పంచాయతీ నడుస్తుంది. ఏరా ఇల్లుకు ఎసరు పెట్టినోడా అని బాలు తిడతాడు.
ఇంతలో చింతామణికి ఇల్లు హ్యాండోవర్ చేయమని కోర్టు నుంచి నోటీసు వచ్చిందని రవి చెబుతాడు. శోభ వస్తుంది. మళ్లీ బాలును కాళ్లు పట్టుకోమని చెబుతుంది. అడ్డదానికాళ్లు నా భర్త పట్టుకోడని మీనా అంటుంది. ఇంతలో చింతామణి వచ్చి మీరు ఎలాగు 50 లక్షలు కట్టలేరు గానీ వెంటనే ఇల్లు ఖాళీ చేసేయండని అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.