...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలుకు రక్షగా కంకణం- ప్రభావతిని కొట్టిన మీనా- మంచానపడ్డ సుగుణ- రోహిణి దొంగతనం

Gunde Ninda Gudi Gantalu Serial October 15th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 15వ తేది ఎపిసోడ్‌లో గుడిలో పసుపు కుంకుమ కిందపడిపోవడంతో మీనా బాధపడుతుంది. బాలుకు రక్షగా కంకణం ఇస్తాడు పంతులు. కానీ, బాలు మాత్రం కంకణం అస్సలు కట్టించుకోడు. గుణతో రోహిణి డీల్ ఫిక్స్ చేసుకుంటుంది.

Published on: Oct 15, 2026, 07:16:36 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణిని రూ. లక్ష ఇవ్వమని బెదిరిస్తాడు దినేష్. గుణకు కాల్ చేసి దినేష్ గురించి అడుగుతుంది. వాడి పీడ లేకుండా చేస్తానన్నావ్. అనవసరంగా నీకు డబ్బు ఇచ్చాను అని రోహిణి అంటుంది.

వాడి నుంచి విముక్తి కావాలి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 15 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 15 ఎపిసోడ్

నేను వాడు రాకుండా చేస్తాననే చేశాను. కానీ, మీ మధ్య ఏముందో వాడు మళ్లీ వచ్చాడు అని గుణ అంటాడు. వాడి నుంచి నాకు విముక్తి కావాలి. నాకు భయమేస్తుంది. ఏమైనా చేయగలవా అని. వద్దులే నేను వేరే దారి వెతుక్కుంటా అని రోహిణి అంటుంది. అవసరం లేదు. నాకు డబ్బులు వద్దు. వాడి పీడ లేకుండా చేస్తా. కానీ, చిన్న హెల్ప్ చేయాలి. బాలు కారు కీస్ కావాలి. బాలుతో తీర్చుకోవాల్సిన పాత పగలున్నాయని గుణ అంటాడు.

నాకు ఏమైనా సమస్య అయితే అని రోహిణి అంటుంది. దినేష్ కంటే పెద్ద సమస్య ఏముంటుంది. ఆలోచించుకుని చెప్పు అని గుణ కాల్ కట్ చేస్తాడు. బాలు కారు కీస్ గుణకు ఎందుకు అని ఆలోచిస్తున్న రోహిణికి తన ఫ్రెండ్ విద్య ఫోన్ చేస్తుంది. మీ అమ్మకు బీపీ డౌన్ అయింది వెంటనే రమ్మనంటుంది విద్య. వస్తున్నా అని రోహిణి చెబుతుంది.

మంచానపడ్డ సుగుణకు జ్యూస్ ఇస్తుంది విద్య. కాస్తా బలం వస్తుందని సేవలు చేస్తుంది. ఆ బాలు మీనా లాగే నువ్వు కూడా మంచిగా చూసుకుంటున్నావ్. కానీ నా కూతురుకు మాత్రం నా మీద, కొడుకు మీద ప్రేమ లేదంటుంది సుగుణ. ఇంతలో వచ్చిన రోహిణి నా మీద ఏం కంప్లైంట్స్ ఇస్తున్నావని తిడుతుంది. పెళ్లి, చింటు గురించి నిజం తెలియడం గురించి మాట్లాడుకుంటారు.

తల్లితో రోహిణి వాదన

ఇప్పుడు నువ్వు చెప్పకపోయిన రేపు తెలుస్తుంది. బాలు, మీనా రేపు స్కూల్‌కి వస్తారంట. చింటు తల్లితో మాట్లడతారంట అని విద్య చెబుతుంది. ఇక నేను చింటుదాచే పరిస్థితి లేదని సుగుణ అంటుంది. ఎందుకు లేదు. ఏదొకటి చెప్పి ఆపు అని రోహిణి అరుస్తుంది. వాళ్లు ఆగరు. దాచడం మా వల్ల కూడా కాదు. బాలు మీనా మంచి వాళ్లు. నిజం చెబితే మీ అత్తకు కోపం రాకుండా మాట్లాడి ఒప్పిస్తారు అని సుగుణ అంటుంది.

నీకు తలకాయ ఉందా. నా జీవితం ఇలా కావడానికి కారణమే బాలు. మీనా. ఇది తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అరిచి వెళ్తుంది రోహిణి. విద్య వెళ్తుంది. అమ్మను చూసుకో రేపు స్కూల్ సంగతి నేను చూసుకుంటానని రోహిణి వెళ్లిపోతుంది. మరోవైపు గుడిలో శివ, పార్వతి, సుమతి పూలు కడుతుంటారు. మీనా వచ్చి కోప్పడుతుంది.

బాలుకు రక్షగా కంకణం

గుణ తన ఫ్రెండ్‌ని అప్పులు అడగడం, రోహిణి-మనోజ్ గొడవల గురించి చెబుతుంది మీనా. పంతులును అడిగి సమస్యలకు పరిష్కారం చెబుతాడని సుమతి అంటుంది. వెళ్లి పంతులును మీనా కలుస్తుంది. మీనా డల్‌గా ఉండటం చూసి ఆరా తీస్తాడు పంతులు. జరిగింది చెబుతుంది మీనా. అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించు అని పంతులు ఇస్తాడు.

రోజు నిందలు మోయాల్సి వస్తుంది. మమ్మల్ని దీవించు తల్లి అని మొక్కి పసుపు కుంకుమను పంతులుకు ఇవ్వబోతుంటే చేజారిపోతుంది. దాంతో అమ్మవారికి కూడా మీద కనికరం లేదు అని మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది మీనా. పసుపు కుంకుమ ఐదోతనానికి గుర్తు. అదే చేజారిపోయింది. నాకెందుకో కీడు చెంకిస్తుంది. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారో. మాట్లాడాలి అని మీనా ఏడుస్తుంది.

మీ ఆయనకు ఏం కాదు. నీ భయం పోడానికి ఓ పని చేస్తానని చెప్పిన పంతులు రక్షగా కంకణం ఇస్తాడు. ఇంటికెళ్లాక మీ ఆయనకు కట్టమంటాడు. దాన్ని కట్టేలోపు ఎక్కడ జారిపోకూడదు. భద్రంగా కట్టు అని పంతులు జాగ్రత్తలు చెబుతాడు.ఇంటికి మీనా వెళ్తుంది. బాలు గురించి అడిగితే.. సత్యం రాలేదంటాడు. మీనాను చూసి బాధపడుతున్నావేంటని అడుగుతాడు.

ప్రభావతిని కొట్టిన మీనా

గుడిలో పసుపుకుంకమ కిందపడింది చెప్పింది మీనా. బాలుకు కాల్ చేయగానే వచ్చేశా అంటూ ఇంట్లోకి వస్తాడు బాలు. చూశావా. వాడికి నూరేళ్లు అనేలా అడగ్గానే ఎలా వచ్చేశాడో అని సత్యం అంటాడు. ఏమైందని బాలు అడుగుతాడు. మీనా భయం గురించి చెబుతాడు సత్యం. తండ్రి సత్యం కోసం పూతరేకులు తెచ్చానని ఇస్తాడు బాలు.

సత్యం వెళ్లిపోతాడు. ఎలాంటి దుష్టశక్తులు రావని బాలుకు కంకణం కడతానంటుంది మీనా. బాలు వద్దని, ఇదంతా అసమర్థులు, బద్ధకస్తులకు. డబ్బుల కోసం ఇలాగే చేస్తారని బాలు అంటాడు. ఇది మీకోసం పంతులు ప్రత్యేకంగా పూజ చేసి ఇచ్చారు. నా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని మీనా అంటుంది. వద్దంటే వద్దని బాలు అంటాడు.

నా మాట వింటారా లేదా. కొడతానంటూ సోఫా దిండు పట్టుకుని కొట్టబోతుంది మీనా. బాలు తప్పించుకుంటాడు. బాలుపై దిండు విసురుతుంది. బాలు తప్పించుకోవడంతో వెనుకే వచ్చిన అత్త ప్రభావతికి తాకుతుంది. అలా ప్రభావతిని మీనా కొడుతుంది. జరిగింది చూసి మీనా, బాలు షాక్ అవుతారు. ప్రభావతి కోపంతో ఊగిపోతుంది.

మీనా కళ్లే పీకిస్తాను

అమ్మావతి కాస్తా దిండావతి అయిపోయిందే అని బాలు అంటాడు. ఎందుకు కొట్టావే అని ప్రభావతి అడుగుతుంది. జరిగింది చెబుతుంది మీనా. పెళ్లయిన ఇన్నేళ్లకు మా అమ్మను కొట్టే ఛాన్స్ దిండు ఇచ్చిందని బాలు అంటాడు. ఇంతలో సత్యం వచ్చి అడిగితే ఇది నన్ను దిండుతో కొట్టిందని ప్రభావతి చెబుతుంది. బాలు సంతోషంగా పాట పడతాడు.

ఇదంతా దీనివల్లే అని దిండు విసురుతుంది ప్రభావతి. బాలు పట్టుకుని వెనక్కి వేస్తాడు. అది మనోజ్‌పై పడుతుంది. కళ్లజొడు కుచ్చుకుని కళ్లు పోయేవని. నాకు కళ్లు నువ్విస్తావా అని బాలుపై మనోజ్ కోప్పడతాడు. మీనా కళ్లు పీకిస్తానని ప్రభావతి అంటుంది. నీ కళ్లే పీకిస్తానని బాలు అంటాడు. సత్యం కోప్పడి అందరిని ఆపుతాడు. మనోజ్‌ను వెళ్లమంటాడు సత్యం. మనోజ్ వెళ్లిపోతాడు.

ఇదేంటని ప్రభావతి అడిగితే.. పంతులు ఇచ్చిన విషయం చెబుతుంది మీనా. తర్వాత చింటు స్కూల్‌కి వెళ్లాలని మీనాతో బాలు అంటాడు. అది విన్న రోహిణి వీళ్ల సంగతి ఇలా కాదు అని గుణకు కాల్ చేసి బాలు కారు కీస్ ఇస్తానని, రేపు ఉదయం బయటకు రాకుండా ఆపగలవా అని అడుగుతుంది. అసలు వాడు కారే ఎక్కకుండా చేస్తానని గుణ అంటాడు.

బాలు దిండు కింద రోహిణి చేయి

రేపు రాత్రి రా కీస్ ఇస్తానని రోహిణి అంటుంది. బాలు, మీనా పడుకుంటారు. కారు కీస్ దొంగతనం చేసేందుకు దిండు కింద చేయి పెడుతుంది రోహిణి. బాలు పక్కకు వాలుతాడు. దిండు కింద చేయి ఉండిపోతుంది. దొరికిపోయినట్లుగా రోహిణి నోరు మూసుకుంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks