...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలుకోసం గుణను చితకబాదిన అత్తాకోడళ్లు-రోడ్డుమీదకు సత్యం ఫ్యామిలీ- రాజేష్‌కు లంచం

Gunde Ninda Gudi Gantalu Serial October 30th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 30వ తేది ఎపిసోడ్‌లో సత్యం కుటుంబం మండపానికి నిద్రకు వెళ్తుంది. అక్కడ ఆడిన గేమ్‌లో ప్లేట్ తిప్పేసిన మీనా ప్రభావతికి సపోర్ట్ చేస్తుంది. బాలును కొట్టేందుకు వచ్చిన గుణ, అతని రౌడీలను ప్రభావతి, మీనా చితకబాదుతారు.

Published on: Oct 30, 2026, 07:18:06 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దేవీ నవరాత్రుల సందర్భంగా మండపంలో నిద్ర చేసేందుకు సత్యం ఫ్యామిలీ వెళ్తారని అనుకుంటారు. రోహిణి కూడా వస్తానంటే ఇంటికి కాపలాగా ఎవరుంటారని ప్రభావతి అడుగుతుంది.

గుడికి బాలు ఫ్యామిలీ

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 30 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 30 ఎపిసోడ్

తనేమైనా మలేషియా నుంచి తెచ్చుకున్న కుక్కనా. తను కూడా వస్తుందని శ్రుతి అంటుంది. అంతా గుడికి వెళ్తారు. లక్కీ డ్రా గురించి రాజేష్‌ను అడిగితే రేపు చేద్దామంటాడు. బాలు ఫ్యామిలీ ఇక్కడే పడుకుంటుందని తెలిసి గుణ ప్లాన్ చేస్తాడు. మరోవైపు సత్యం ఫ్యామిలీ వినోదం కోసం గేమ్ ఆడతారు. చిట్టీలు వస్తే అందులో ఉన్నది ఎందుకో చెప్పాలి.

భర్తలు గొప్పా భార్యలు గొప్పా అని వస్తుంది. భర్తలు, భార్యలు దీనిపై వాదించుకుంటారు. బాలు లాంటివాడిని భరిస్తున్నందుకు నీ భార్య గొప్పదేగా అని మీనాను పొగుడుతుంది ప్రభావతి. నాన్నోయ్ విన్నావా మీనాను అమ్మను పొగుడుతుందని బాలు అంటాడు. అత్తయ్య అంది కరెక్టేగా అని మీనా అంటుంది. అత్తా కోడళ్లు ఒక్కటయ్యారని బాలు అంటాడు.

ఇంతలో రాజేష్ వస్తాడు. రాజేష్‌ను అడిగితే.. బొమ్మ బొరుసు వేసి అమ్మవారిని అడుగుదామని వేస్తాడు. అది హుండీలో పడుతుంది. దాంతో దీనికి అమ్మవారి దగ్గర సమాధానం లేదని బాలు అంటాడు. తర్వాత అత్త గొప్పా కోడలు గొప్పా అని వస్తుంది. అత్త లేకుండా కోడలు రాదు కాబట్టి అత్తే గొప్ప అని ప్రభావతి అంటుంది. ప్రభావతి, మీనా-శ్రుతి వాదించుకుంటారు.

ప్లేట్ తిప్పేసిన మీనా

నేను అలా అనలేదు. నేనే గొప్ప అని ప్రభావతి అంటుంది. అంటే కోడలు గొప్పా అని మీనా అంటుంది. అయ్యో అని ఎటుతేల్చులేకపోతుంది ప్రభావతి. మా అమ్మను భలే ఇరకాటంలో పెట్టావ్ మీనా అని బాలు అంటాడు. కొడుకు జీవితంలోకి వచ్చిన భార్యకు అన్ని నేర్పే అత్త గొప్ప అని చాలా గొప్పగా చెబుతుంది మీనా. దాంతో ప్రభావతి ఇంప్రెస్ అవుతుంది.

ప్రభావతికి మీనా ఓటు వేస్తుంది. చూశావా మీనా ఎంత బాగా చెప్పిందో. మీనాను అర్థం చేసుకుంటే మీ బంధం మరింత అందంగా ఉంటుందని సత్యం అంటాడు. అది అవకాశం దొరికిందని కాకా పట్టిందని ప్రభావతి అంటుంది. మనోజ్ నీళ్లు తాగేందుకు వెళ్తాడు. అక్కడ లక్కీ డిప్ హుండీ ఉంటే.. ఏం చేస్తే నా పేరు వస్తుందని ఆలోచిస్తుంది.

రాజేష్‌కు పదివేలు లంచం

రాజేష్ వస్తే నా పేరే రావాలంటే ఏం చేయాలని మనోజ్ అడుగుతాడు. దానికి ఖర్చు అవుతుందని రాజేష్ అంటే వంద ఇస్తాడు మనోజ్. పదివేలు ఇవ్వాలని రాజేష్ అంటే.. మనోజ్ లంచంగా ఇస్తాడు. రేపు అన్ని ప్రైజులు నీకే వస్తాయని చెబుతాడు రాజేష్. ఇంతలో గుడిలోకి గుణ, అతని గ్యాంగ్ వచ్చి కరెంట్ పొగొడతారు. బాలును ఎత్తుకురండని గుణ అంటాడు.

జెనరేటర్ దగ్గరికి బాలు వెళ్తాడు. బాలుకు బదులు మనోజ్‌పై ముసుగు వేసి కిడ్నాప్ చేస్తారు. గుణ దగ్గరికి తీసుకెళ్లి మనోజ్‌ను చితకబాదుతారు. మనోజ్ గొంతు విని గుర్తుపట్టిన గుణ ఆపుతాడు. బాలు అనుకుని నన్ను కొడుతున్నారా అని మనోజ్ అంటే.. అవును, ఈ విషయం ఎవరికి చెప్పకు అని గుణ అంటాడు. మనోజ్ పారిపోతాడు.

మరోవైపు బాలు దగ్గరికి రౌడీలు వెళ్తారు. భలే దొరికావురా. ఈ రోజు ఇక్కడ నువ్వు నిద్ర చేయవు. శాశ్వతంగా నిద్రలోకి జారుకుంటావు అని గుణ అంటాడు. సత్యం, మీనాకు ఇచ్చిన మాట గుర్తు చేసుకుంటాడు బాలు. నీ ప్రాణం కంటే మీ నాన్న మాటకు విలువ ఎక్కువ ఇస్తావని తెలుసురా. అందుకే ఇక్కడ స్పాట్ పెట్టానని గుణ అంటాడు.

గుణను చితకబాదిన అత్తాకోడళ్లు

రౌడీలు బాలును కొట్టబోతుంటే ఓవైపు మీనా మరోవైపు ప్రభావతి వచ్చి రౌడీల చేతులు పట్టుకుని ఆపుతారు. అవే కర్రలు పట్టుకుని రౌడీలను చితకబాదుతారు అత్తాకోడళ్లు ప్రభావతి, మీనా, శ్రుతి. తర్వాత రవి, సత్యం వచ్చి కూడా కొడతారు. గుణను పట్టుకుని చితకబాదుతుంది మీనా. మా ఆయన వ్రతం ఉన్నాడని కొట్టేందుకు వచ్చావా. మా ఆయన కారు బ్రేకు వైరులు కట్ చేసింది నువ్వేగా. నీకు తాళాలు ఎవరు ఇచ్చారో చెప్పు అని చెంపలు వాయిస్తుంది మీనా.

దొరికిపోతానని భయపడిన రోహిణి గుణను తనే కొట్టి ఎందుకు చేశావో చెప్పు అంటూ కొడుతుంది. మెల్లికా పారిపొమ్మని సైగ చేస్తుంది. దాంతో వదిలించుకుని గుణ పారిపోతాడు. అదంతా బాలు గమనిస్తాడు. బాలును ఏం కాలేదుగా అని అడుగుతుంది. హమ్మయ్య తప్పించుకున్నాను అని రోహిణి అనుకుంటుంది.

మరోవైపు చింతామణితో చాలా పెద్ద సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఇకమీదట బాలుకు, వాడి కుటుంబానికి చాలా చెడ్డరోజులే రాబోతున్నాయని శోభ అంటుంది. నాకు మీనా మీదే కాదు ప్రభావతిపై కూడా పీకలదాకా కోపం ఉందని చింతామణి అంటుంది. నా కూతురుని, అల్లుడిని వేరు చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదని శోభ అంటుంది.

రోడ్డుమీదకు సత్యం కుటుంబం

ఇది తిరుగులేని అస్త్రం. దీన్ని కాదనే హక్క వాళ్లకుండదు. కట్టుబట్టలతో వాళ్లను బయటకు పంపిస్తాను అని చింతామణి అంటుంది. వాళ్లను గెంటేస్తుంటే ఇంటికి ఎదురుగా నిలబడి చూస్తానని శోభ అంటుంది. మరోవైపు నవరాత్రుల్లో సత్యం కుటుంబం అంతా డ్యాన్స్ చేస్తుంటారు. చింతామణి వచ్చి చప్పట్లు కొడుతుంది.

మీ ఇంటి పత్రాలు నా దగ్గర ఉన్నాయి. మీ అప్పు నేనే కట్టాను. ఇకమీదట అప్పు మీరు నాకే కట్టాలి. అసలు వడ్డీ అంతా కలిపి రూ. 50 లక్షలు అయింది. అప్పు కింద మీ ఇల్లు రాసి ఇస్తున్నట్లు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం చేయండని చింతామణి అంటుంది. దాంతో అంతా నోరెళ్లబెడతారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks