...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలులా తాగుబోతు కాకుడదనే చేశానన్న రోహిణి- మీనా వార్నింగ్- మీనా 5 లక్షలు దొంగతనం

Gunde Ninda Gudi Gantalu Serial September 18th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 18వ తేది ఎపిసోడ్‌లో రోహిణిపై తెగ ఫైర్ అవుతుంది ప్రభావతి. హారతి కర్పూరం అరచేతిలో వేసుకుని దేవుడికి హారతి ఇస్తుంది రోహిణి. మహానటి అంటూ శ్రుతి ఫోన్ రింగ్ అవుతుంది. 5 లక్షలు దొరికాయని అత్తకు చెబుతుంది మీనా.

Published on: Sep 18, 2026, 07:35:21 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్‌కు జ్వరం వచ్చింది కిచెన్‌లో రాగి జావ చేస్తున్న రోహిణిని నంగనాచి అంటూ తిడుతూ బయటకు లాక్కెళ్తుంది ప్రభావతి. మీనా అడ్డుపడితే మధ్యలో కలగజేసుకోవద్దని తిడుతుంది అత్త.

అత్తపై రోహిణి రివర్స్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 18 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 18 ఎపిసోడ్

బాలు, రవి వాళ్లు వచ్చి ఇది ఆడాళ్ల విషయం మధ్యలో కలగజేసుకోవద్దని ప్రభావతి అంటుంది. ఇది నా భర్త విషయం. మీరెందుకు కలగజేసుకుంటున్నారు అని రివర్స్ అవుతుంది రోహిణి. ఒక్కటి కొట్టబోయిన ప్రభావతి ఆగి.. నీ భర్త.. నేను లేకుండా నీకు భర్త ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడే. మళ్లీ వాడిని నీ గుప్పిట్లోకి తెచ్చుకుందామనుకుంటున్నావా అని ప్రభావతి అంటుంది.

మరి ఇంత కఠినంగా ఎందుకుంటున్నారని శ్రుతి అంటుంది. ఏయ్.. నీకు పెద్ద చిన్నా అనే గౌరవం లేదా. ప్రతిదానికి నోరు లేస్తుంది. ఇంట్లో ఉండాలని ఉంటే నాకు ఎదురు సమాధానం చెప్పడం మానుకో అని శ్రుతికి వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. దీని విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దని అందరిని హెచ్చరిస్తుంది. శ్రుతి ఆగు.. ప్రతిసారి నా ముందే అమ్మ గురించి నోరుజారుతున్నావ్. నాకు నచ్చట్లేదని రవి అంటాడు.

ఇప్పుడు పార్లరమ్మా ఏం చేసిందని బాలు అంటాడు. దాంతో జరిగింది చెబుతుంది మీనా. ఏంటే పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్లు నువ్వు చెబుతున్నావా. నీకు దీనిగురించి ఏం తెలిసే. నువ్వు ఒక మొద్దుమొహానివి. నా వేలు కట్ చేసి సంతకం తీసుకుని ఇల్లు అమ్మేసే రకం ఇది అని ప్రభావతి అంటుంది. నువ్వు కొత్త ఐడియాలు ఇవ్వకని బాలు అంటాడు.

ప్రభావతి ఉగ్రరూపం

నేను ఏం చేసిన కాపురం కోసమే చేశానని రోహిణి అంటుంది. ఏంటే నోరు లేస్తుంది మరింత ఉగ్రరూపం చూపిస్తుంది ప్రభావతి. పూలకుండీతో కొట్టబోతుంటే శ్రుతి ఆపుతుంది. నువ్వు వరలక్ష్మి వ్రతం చేయకపోవడం వల్లే వాడు అనారోగ్యపాలయ్యాడని ప్రభావతి అంటుంది. నేను ఆయన్ను బార్ నుంచి తీసుకొచ్చేందుకే వెళ్లానని రోహిణి అంటుంది.

తెలియక అడుగుతాను. నువ్వే బారుకు ఎందుకు వెళ్లాలి. వ్రతం నీతో జరుగుతుందని తెలుసు నువ్వే ఎందుకు వెళ్లాలి. నాకో, రవికో, నాన్నకో చెప్పొచ్చుగా అని బాలు డౌట్‌గా అడుగుతాడు. బాగా అడిగాడు అని ప్రభావతి అంటుంది. నాకు మనోజ్ కాల్ చేసి నా వల్లే తాగుతున్నాడని చెప్పాడు. అలాగే వదిలేస్తే బాలులాగే తాగుబోతు అవుతాడనుకుని భయపడ్డాను అని బాలునే రివర్స్‌లో అంటుంది రోహిణి.

అత్తయ్య కాదు నేను కొడతాను

ఏమన్నావ్. మళ్లీ అను.. అత్తయ్య కాదు.. నేను.. (కొడతాను) అన్నట్లుగా అంటుంది. నా భర్త ఎవరిని మోసం చేయలేదే. తాగడానికి ఏం అమ్ముకోలేదే. నీవైపు 100 తప్పులు పెట్టుకుని నా భర్తను అంటావా. సరైన ఆడదానివి అయితే ఇన్ని తప్పులు మోసాలు పాపాలు తప్పులు చేసి మాట్లాడగలవా అని మీనా గట్టిగా ఇచ్చిపడేస్తుంది. శ్రుతి కూడా ఫ్రాడ్, డెకాయిట్, చీటర్‌వి అంటూ తిడుతుంది.

ఇప్పుడు నేను పూజ చేయకపోవడం వల్లే మనోజ్‌కు జ్వరం వచ్చిందంటారా. దానికి నేనే పరిష్కారం చేస్తాను అని అరచేతిలో కర్పూరం వెలిగించి దేవుడికి హారతి ఇస్తుంది. అప్పుడే శ్రుతి ఫోన్ మహానటి.. మహానటి.. అంటూ రింగ్ అవుతుంది. నేనేం పెట్టలేదు. అదే వచ్చిందని శ్రుతి అంటుంది. రవి ఆపమంటాడు. అది అరచేతిలో రూపాయి పెట్టుకుని సినిమా చూపించే రకం అని ప్రభావతి అంటుంది.

మీనా వెళ్లి ఆపుతుంది. రోహిణి ఏడుస్తూ గదికి వెళ్తుంది. అత్త తిట్టిన మాటలన్ని తలుచుకుని ఏడుస్తుంటుంది. అమ్మ ఆకలిగా ఉంది. ఏదైనా తీసుకురండి. తట్టుకోలేకపోతున్నాను అని అలమటిస్తుంటాడు మనోజ్. ఎలాగైన మనోజ్‌కి జావ తీసుకెళ్లాలని మళ్లీ కిచెన్‌లోకి వెళ్లి రెడీ చేస్తుంది. మనోజ్‌ను లేపి జావ తెచ్చానంటుంది రోహిణి.

నీరసంలో కూడా పౌరుషం తగ్గలేదు

దానికి కంప్యూటర్ లాంగ్వేజ్ జావ గురించి చెబుతాడు మనోజ్. నేను హైలీ క్వాలిఫైయిడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని మనోజ్ అంటాడు. నీరసంలో కూడా పౌరుషం తగ్గలేదు అని రోహిణి అనుకుంటుంది. నేను తెచ్చింది సాఫ్ట్‌వేర్ కాదు తాగే జావ.. రాగి జావ అని రోహిణి చెబుతుంది. మనోజ్‌కు తాగిస్తూ సేవలు చేస్తుంది. చేయెందుకు వణుకుతుందని మనోజ్ అంటాడు.

గాయమైందని చెబుతుంది రోహిణి. అరచేతిలో కాలిన గాయం చూసి మనోజ్ అడుగుతాడు. దాంతో జరిగింది అంతా చెబుతుంది రోహిణి. హారతి కర్పూరంతో చేతులు కాల్చుకుంటే అమ్మవారు క్షమిస్తుందా. జరిగింది తెలియదా అని మనోజ్ అంటాడు. అత్తయ్యకు తెలియదుగా. మూడు రోజుల్లో తగ్గిపోతుంది. నువ్వు హెల్తీగా అయితే చాలు. తాగు.. అని రోహిణి అంటుంది.

ఇంకెప్పుడు తాగనని మనోజ్ అంటాడు. నేను తాగమంది జావ అని తాగిస్తుంది రోహిణి. దానికి మనోజ్ నవ్వుతాడు. అలా రోహిణికి మనోజ్ పడిపోతాడు. మరోవైపు పార్లరమ్మకు ఎన్ని కష్టాలు వచ్చాయో అంటాడు బాలు. నాతో మాట్లాడుతున్నారేంటని మీనా కూడా మాట్లాడుతుంది. తర్వాత మీనాను గట్టిగా హగ్ చేసుకుని చీరలో చాలా బాగున్నావని అంటాడు బాలు.

ఇలా అల్లుకుపోతున్నారేంటీ

ఇద్దరు రొమాంటిక్‌గా మాట్లాడుకుంటారు. రాత్రంతా మాట్లాడుకుండా ఇప్పుడు ఇలా అల్లుకుపోతున్నారేంటని మీనా అడుగుతుంది. దాంతో గొడవ గుర్తుకు వచ్చి దూరం పెడతాడు. ఎందుకింత అందంగా పుట్టావని అంటాడు. మరి ఎందుకు ముద్దుపెట్టుకున్నారని అంటుంది మీనా. అద్దాన్ని చూస్తూ బాలు, మంచాన్ని మీనా అంటూ ఇద్దరు అలకతో గొడవపడుకుంటారు.

బాలును మంచం అంటూ, మీనాను అద్దం అంటూ బాలు మాట్లాడుకుంటారు. డిపాజిట్ కోసం డబ్బులు వచ్చాయని మీనా చెబుతుంది. మీనా ఏది అనుకున్నా సాధిస్తుందని బాలు మనసులో అనుకుంటాడు. మరోవైపు మనోజ్‌ను ఎలా ఉందని అడుగుతుంది ప్రభావతి. ఉన్నపళంగా జ్వరం ఎలా వచ్చిందని ప్రభావతి అడుగుతుంది.

మనం బాగా ఇష్టమైనవాళ్లకు దూరంగా ఉంటే జ్వరం వస్తుందంటగా. రోహిణి నాకు దూరంగా ఉంటుంది కదా. తనతో మాట్లాడకుంటే ఏదోలా ఉంది అని మనోజ్ అంటాడు. దానివైపు మొగ్గు చూపిస్తున్నావా అని ప్రభావతి అడిగితే.. లేదని మనోజ్ అంటాడు. తర్వాత పెద్ద ఆర్డర్‌కి ఇవ్వాల్సిన ఐదు లక్షల డిపాజిట్ డబ్బు దొరికిందని ప్రభావతికి చూపిస్తుంది మీనా.

మీనా 5 లక్షలు దొంగతనం?

ఆ విషయం చింతామణికి చెబుతుంది ప్రభావతి. నేను చూసుకుంటానని చెప్పి ఒక రౌడీని మీనా దగ్గరికి పంపిస్తుంది చింతామణి. మీనా వెనుక అతను నడుస్తాడు. మీనా డిపాజిట్ డబ్బును దొంగలించేందుకు చింతామణి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దానికి కారణం అత్త ప్రభావతి అవుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks