Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా దగ్గరి నుంచి రూ. 5 లక్షలు రౌడీలు ఎత్తుకెళ్తారు. మీనా తలకు దెబ్బ తగిలి రక్తం కారడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్తారు ఫ్రెండ్స్. రౌడీలు చింతామణికి కాల్ చేసి దొంగతనం చేశామని చెబుతారు.
చింతామణికి ఆర్డర్

ఈసారి నాకు ఎదురైతే నిలబెట్టి పరువు తీసేస్తా అని చింతామణి అంటుంది. ఇప్పుడు ఈ ఆర్డర్ నాది అవుతుంది, మార్కెట్‌లో నా విలువ మరింత పెరుగుతుంది. నాతో పోటీకి రావాలంటే వణికిపోతారు అని చింతామణి అంటుంది. నూరు గుడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు బలైపోతుంది అని అసిస్టెంట్ పంచ్ ఇస్తాడు.
అతన్ని తిడుతుంది చింతామణి. మేనేజర్ దగ్గరికి వెళ్లి మీనాకు ఐదు లక్షలు రావు. తను కచ్చితంగా రాదని చింతామణి అంటుంది. అంత కచ్చితంగా రాదని ఎలా చెబుతున్నారు అని మేనేజర్ అడిగితే అది మాకు తెలియదు. కానీ, రాదంటే రాదు అని చింతామణి అంటుంది. సరే గ్రేస్ టైమ్ కూడా అయిపోయింది కాబట్టి ఈ ఆర్డర్ మీకే కన్ఫర్మ్ చేస్తున్నా అని మేనేజర్ అంటాడు.
మేనేజర్‌కి 5 లక్షల చెక్ ఇచ్చి వెళ్లిపోతుంది చింతామణి. బాలు హాస్పిటల్‌కి వెళ్తారు. మీనాను వెళ్లి బాలు చూస్తాడు. నేను మీతో మాట్లాడట్లేదు. కానీ, ఇప్పుడు మిమ్మల్ని పట్టుకుని ఏడవాలని ఉంది. మీరు 50 వేలు ఇస్తానంటే డబుల్ ఇస్తానన్నాను. నాకు అంత పొగరు ఉండాల్సింది కాదు. మీ అన్నయ్యను అన్నట్లు నన్ను కూడా అనండి 5 లక్షలు మింగినదానా అని మీనా అంటుంది.
మీనాను ఓదార్చిన బాలు
నీ నుంచి దొంగలు కొట్టేశారని బాలు అంటాడు. దాంతో బాలును పట్టుకుని ఏడుస్తుంది మీనా. అందులో మీ కష్టం ఉంది. సుమతి తెలిసినవాళ్ల దగ్గర తీసుకొచ్చింది. వాళ్లకు ఎలా ఇవ్వాలి అని మీనా అంటుంది. ఇంత జరుగుతుంటే నాకెందుకు కాల్ చేయలేదు. సారీ మీనా. పోయింది డబ్బేగా సుమతి అప్పుతెచ్చినవాళ్లకు ఎలాగైనా కడదాం అని బాలు అంటాడు.
{{/usCountry}}నీ నుంచి దొంగలు కొట్టేశారని బాలు అంటాడు. దాంతో బాలును పట్టుకుని ఏడుస్తుంది మీనా. అందులో మీ కష్టం ఉంది. సుమతి తెలిసినవాళ్ల దగ్గర తీసుకొచ్చింది. వాళ్లకు ఎలా ఇవ్వాలి అని మీనా అంటుంది. ఇంత జరుగుతుంటే నాకెందుకు కాల్ చేయలేదు. సారీ మీనా. పోయింది డబ్బేగా సుమతి అప్పుతెచ్చినవాళ్లకు ఎలాగైనా కడదాం అని బాలు అంటాడు.
{{/usCountry}}పోయిన డబ్బు గురించే మీనా తెగ బాధపడిపోతుంది. బాలు ఓదారుస్తాడు. ఇంతలో డాక్టర్ వస్తుంది. ఫ్యాక్చర్ ఏం జరగలేదు. ట్యాబ్లెట్స్ రాశాను. కాకపోతే చేతికి రెస్ట్ ఇవ్వండి. ఏ పని చేయకుంటేనే త్వరగా నయం అవుతుంది అని డాక్టర్ చెబుతాడు. ఇంట్లో మీనా లేకపోయేసరికి అంతా కాఫీ అడుగుతారు. ఇంతలో మీనా వస్తుంది.
ప్రభావతి వెటకారంగా మాట్లాడితే బాలు ఫైర్ అవుతాడు. గాయం గురించి అడిగితే.. చిన్నదెబ్బ అని మీనా చెబుతుంది. ఏమైందని అంతా అడిగితే.. మీనా ఏడుస్తుంది. ఏమైందే. నట్టింట్లో ఈ శోకాలు ఏంటే అని ప్రభావతి అంటుంది. మీనా 5 లక్షలు తీసుకెళ్లడం ఎవరికో తెలిసింది. దొంగలు ఎత్తుకెళ్లారు అని బాలు చెబుతాడు.
అది గుండెనా బండనా
ఏంటీ డబ్బు పోయిందా అని ప్రభావతి షాక్ అవుతుంది. అది గుండెనా బండా అంత డబ్బుపోతే ఎలా తట్టుకుని నిలబడ్డావే అని ప్రభావతి అంటుంది. మీనా అంత డబ్బు తీసుకెళ్తుంటే వెళ్లకుండా నువ్వేం చేశావురా అని బాలును తిడతాడు సత్యం. లక్షా 50 వేలు నేను కూడబెట్టాను, 50 వేలు ఆయన ఇచ్చారు. 3 లక్షలు సుమతి వాళ్ల ఫ్రెండ్ దగ్గర అప్పు చేసింది. ఇప్పుడు నేను సుమతికి ఏం చెప్పేది అని మీనా ఏడుస్తూ చెబుతుంది.
మీనా నువ్వెళ్లి రెస్ట్ తీసుకో అని బాలు అంటాడు. కాఫీ పెట్టివ్వదా అని మనోజ్ అంటాడు. పళ్లు రాలతాయ్. మనిషివేనా. నీ భార్యను అడుగు అని బాలు కోప్పడుతాడు. వద్దులే బాగుంటే అడుగుతాగా అని మనోజ్ అంటాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా అని సత్యం అడిగితే.. ఇచ్చాను అని బాలు అంటాడు. నా 30 లక్షలే ఇప్పటివరకు పోలీసులు పట్టుకోలేదు. చిల్లర దొంగలు చేసి ఉంటారు అని మనోజ్ అంటాడు.
నాకు నమ్మకం లేదు. కానీ, సుమతి తెచ్చిన 3 లక్షలు అయినా కట్టాలి. అదే ఎలాగో అర్థం కావడం లేదని బాలు అంటాడు. ప్రభా.. కొంచెం పెద్ద మనసు చేసుకో. ప్రస్తుతానికి నీ నగలు ఇవ్వు. తాకట్టు పెట్టి అప్పు కట్టేస్తారు అని సత్యం రిక్వెస్ట్ చేస్తాడు. మీరు ప్రభా అని ప్రేమగా పిలిచినప్పుడే నా గుండెల్లో రాయి పడింది. నేను నా నగలు చచ్చిన ఇవ్వలేను అని ప్రభావతి అంటుంది.
ప్రభావతి నగలకు ఎసరు
పరిస్థితి అర్థం చేసుకో. సుమతి చిన్నపిల్ల ఎలా డబ్బు కడుతుంది. మీనా చేసింది మనింటికోసమేగా అని సత్యం అంటాడు. చింతామణికి మీనా 5 లక్షల గురించి తన నగలకే ఎసరు పెట్టుకుంది ప్రభావతి. నా 30 లక్షల కోసం ఎప్పుడైనా అడిగావా అని మనోజ్ అంటాడు. అది నీ ఓవరాక్షన్ వల్ల పోయాయని రవి అంటాడు. పోనీ నా నగలు తీసుకో అని శ్రుతి అంటుంది.
వద్దు మీ అమ్మ మా నాన్న పరువు తీస్తుందని బాలు అంటాడు. శ్రుతి కూడా అడుగుతుంది. నీకు అర్థం కావడంలేదు. ఈ ఇంట్లో డబ్బే కాదు నగలు పోయిన తిరిగిరావు అని ప్రభావతి అంటుంది. మనోజ్‌కి మీనా నగలిచ్చి తాకట్టు పెట్టిస్తే అమ్మేశాడు. ఏరోజైనా మీనా అందా అని సత్యం అంటాడు. తర్వాత మీనాకు గాయం కావడంతో వంటింట్లో ప్రభావతి కష్టాలు పడుతుంది.
వేలికి గాయం కావడంతో దానిపై పసుపుకు బదులు కారం పెట్టుకుంటుంది. తర్వాత కామాక్షి ఇంటికొస్తుంది. నువ్వు డబ్బులు ఇంట్లోంచి తీసుకెళ్లిన విషయం ఎక్కడో పుట్టిపెరిగిన దొంగలకు ఎలా తెలిసింది అని కామాక్షి డౌట్ క్రియేట్ చేస్తుంది.
ప్రభావతిని పట్టించిన కామాక్షి
ఇప్పుడు మీనా బాగుపడితే కళ్లలో ఎవరు నిప్పులు పోసుకుంటారు నువ్వే కదా. నాకు తెలిసి నువ్వు చింతామణి కలిసి దొంగలను దోచుకోమ్మని పంపించారేమో అని కామాక్షి గట్టిగా ఇరికిస్తుంది. బాలు, మీనా డౌట్‌గా చూస్తారు. అలా ప్రభావతి దొరికిపోతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.