గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ చేసిన మురికిని ఎలా కడగాలో చెప్పండి అని మీనా అంటుంది. అమ్మలానే వీడు తయారయ్యాడు అని బాలు అంటాడు. నాలుగు రోజులు నీ నగలు నీ మొహాన పడేస్తాను అని మనోజ్ అంటాడు. దాంతో మనోజ్ కాలర్ పట్టుకుని ఏం పడేస్తావ్. దొంగతనం చేసి అమ్ముకుంది కాక అంటున్నావా అని తెగ కొడతాడు సత్యం.
ప్రభావతిపై చేయి ఎత్తిన సత్యం

ప్రభావతి ఆపడానికి వస్తే తనను తోసేసి ఇంకా ఫైర్ అవుతాడు. నన్ను ముట్టుకోకు. అసలు నిన్ను కొట్టాలి అని ప్రభావతిపై చేయి ఎత్తుతాడు సత్యం. మళ్లీ ఆగిపోతాడు. ఎందుకింతా చేశావ్ అని నిలదీస్తాడు సత్యం. జరిగిన మోసాన్ని ఇలా దాస్తావా అని చివాట్లు పెడతాడు సత్యం. మాట్లాడితే బిజినెస్ మ్యాన్ అంటావ్. నా భార్య నగలు ఎలా దొంగతనం చేశావురా అని బాలు కొడతాడు.
రవి ఆపుతాడు. ఎందుకు వాన్ని ఆపుతున్నారు అని సత్యం అంటాడు. అందరు మనోజ్‌ను కొట్టి చంపేస్తారా అని రోహిణి అంటుంది. అందరికంటే కోపం నీకే కదా రావాలి. నిజం ఈ విషయం నీకు కూడా తెలుసు కదా అని శ్రుతి అంటుంది. నిన్ననే తెలిసింది అని రోహిణి చెబుతుంది. అంతా షాక్ అవుతారు. శుభం అందరూ తోడుదొంగలే అని బాలు అంటాడు.
ఏదో మోసపోయి ఇలా చేశాడు. నాకు ముందు తెలిస్తే ఇలా చేయించేదాన్ని కాదు అని రోహిణి అంటుంది. మోసపోవడం తప్పు కాదు మోసం చేయడం తప్పు అని మీనా అంటుంది. ఏయ్ అంటూ ప్రభావతి వేలెత్తితే.. ఏయ్.. అంటూ అత్తపై వేలెత్తుతూ రివర్స్ అవుతుంది మీనా. కానీ, సత్యంను చూసి ఒక్కసారిగా ఆగిపోతుంది.
ముష్టి కింద పడేశారు
క్షమించండి అత్తయ్య. మీ కొడుకును దొంగలా పెంచిందే మీరు. అందుకే ఒక్క క్షణం గౌరవం పోయిందని మీనా అంటుంది. మాట్లాడితే నీ నగలంటున్నావ్. మీ అమ్మ చేయించిందా. మా అత్తగారు మా ఆయన ముష్టికింద పడేశారు అని ప్రభావతి అంటుంది. ఏంటీ ముష్టి కింద పడేశారా. మరి ఆ ముష్టినే ఎత్తుకెళ్లిన మీ తల్లికొడుకులను ఏమనాలి అని సత్యం అంటాడు.
{{/usCountry}}క్షమించండి అత్తయ్య. మీ కొడుకును దొంగలా పెంచిందే మీరు. అందుకే ఒక్క క్షణం గౌరవం పోయిందని మీనా అంటుంది. మాట్లాడితే నీ నగలంటున్నావ్. మీ అమ్మ చేయించిందా. మా అత్తగారు మా ఆయన ముష్టికింద పడేశారు అని ప్రభావతి అంటుంది. ఏంటీ ముష్టి కింద పడేశారా. మరి ఆ ముష్టినే ఎత్తుకెళ్లిన మీ తల్లికొడుకులను ఏమనాలి అని సత్యం అంటాడు.
{{/usCountry}}వాడికి ఏమైన మంచి లక్ష్మణాలు నేర్పావా. వాడికి ఏనాడైన నీతి, నిజాయితి నేర్పావా. వాడు మోసపోవడం, నగలు అమ్మడం అన్ని తెలిసి మీనా అమ్మ బంగారం కొట్టేసింది అంటావా. మా అమ్మ గిల్ట్ నగలు పెట్టిందని నింద వేస్తావా. అమ్మో ఇన్నాళ్లు పక్కన పామును పెట్టుకుని బతికినట్లు నీతో ఉన్నానంటేనే ఒళ్లు జలదరిస్తుంది. నీలాంటి దాంతో ఇంతకాలం కాపురం చేసినందుకు నా మీదే నాకే అసహ్యం వేస్తుంది అని సత్యం అంటాడు.
నువ్వు నా భార్యవి కావు నేను నీ భర్తను కాదు. ఇలాంటి దొంగబుద్ధి ఉన్న నీకు నేను భర్తగా ఉండలేను. నీతో పచ్చి మంచినీళ్లు కూడా తాగను. అభిమానం గల ఆడదానివి అయితే నాకు ఎదురు పడకు అని సత్యం అంటాడు. ఇప్పుడేం చేశాను. కొడుకు కోసమేగా చేశాను. నాతో మాట్లాడరు కదా. సరే అందరూ నన్ను వెలేయండి అని లోపలికి వెళ్లి తలుపేసుకుంటుంది ప్రభావతి.
గెంటేస్తారన్న భయంతో
నిన్ను క్షమించడం తప్ప నాకు ఇంకోదారి లేదు. నిజానికి ఇలాంటి వాడిని ఏ భార్య క్షమించదు. మీ వాళ్ల తప్పు లేదు. మావయ్య గారు ఎక్కడ నిన్ను గెంటేస్తారో అని కాపాడాను. అత్తయ్య చాలా మాటలు పడ్డారు. నువ్వు తలుపు తీయమని అడుగు అని రోహిణి చెబుతుంది. మనోజ్ తలుపు తీయమంటాడు. సారీ చెబుతాడు. రవి, శ్రుతి వచ్చి మనోజ్‌ను అంటారు.
నువ్వు ఒక్కడివి మిగిలావా అని రోహిణి అంటే.. ఇంకా మనోజ్‌ను వెనకేసుకొస్తున్నావా. రవి చేస్తే నేను అయితే ఎగిరి తన్ని పుట్టింటికి వెళ్లేదాన్ని అని శ్రుతి అంటుంది. తర్వాత అంతా కలిసి ప్రభావతిని పిలుస్తారు. ఒక్క శ్రుతి మాత్రం పట్టించుకోదు. అంతా కలిసి సత్యంను రిక్వెస్ట్ చేస్తారు. తప్పు చేసి దొరికిపోయినప్పుడు మా అమ్మ వాడే ఆయుధం ఇదే అని బాలు అంటాడు.
సత్యంను క్షమించమని మనోజ్ అడుగుతాడు. ప్రభావతిని క్షమించి పిలవమని చెబుతారు. నాకు సంబంధం లేని వాళ్ల గురించి నన్ను అడగకండి అని సత్యం అంటాడు. బాలు చెప్పిన వినడు. అదంతా నాటకం, తను మారదు అని సత్యం అంటాడు. ప్రభావతి ముందు నుంచి చేసిన తప్పులన్ని చెప్పిన సత్యం క్షమించలేను అంటాడు. ఇంట్లో ఉండాలా లేదా గుడి అరుగు మీద పడుకోవాలా అని సత్యం అంటాడు.
బాలు, మీనా ప్లాన్
దాంతో ఏం మాట్లాడకుండా అంతా వెళ్లిపోతారు. అత్తయ్య అఘాయిత్యం చేసుకుంటారో అని మీనా భయపడితే అలా ఏం చేయదని బాలు అంటాడు. మరుసటి రోజు మావయ్య, అత్తయ్యను ఎలాగైనా కలపాలని మీనా, బాలు అనుకుంటారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.